Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లొంగిపోనున్న బండి భగీరథ్..? రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ

లొంగిపోనున్న బండి భగీరథ్..? రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ

Tupaki.com 1 week ago

మైనర్ ను మోసం చేసిన ఆరోపణలపై బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు ఇప్పుడు రాష్ట్రంలో పెను సంచలనానికి దారితీసింది. కేసు నమోదైన రోజు నుంచి భగీరథ్‌ ఆచూకీ లభించకపోవడం..

పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుని తిరుగుతుండటంతో ఈ వ్యవహారం రోజురోజుకూ మరిన్ని మలుపులు తిరుగుతోంది.

ఈ నేపథ్యంలో తనపై ఉన్న చట్టపరమైన ఉచ్చు బిగుస్తుండటంతో లొంగిపోవడం మినహా మరో మార్గం లేదని భగీరథ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కావడం, ఉన్నత న్యాయస్థానం నుంచి కూడా ఎలాంటి ఊరట లభించకపోవడంతో ఆయన లొంగుబాటుకు సిద్ధమైనట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. .

సీపీ కార్యాలయంలో లొంగుబాటు? పోలీసుల వ్యూహాత్మక అడుగులు

హైదరాబాద్‌లోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో భగీరథ్ కాసేపట్లో లొంగిపోయే అవకాశాలున్నాయన్న ప్రచారం రాజకీయ, పోలీసు వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ ఆయన లొంగిపోతే.. తదుపరి చట్టపరమైన చర్యల కోసం కేసు నమోదైన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించే అవకాశం ఉంది. అక్కడ ప్రాథమిక విచారణ అనంతరం, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, ఆపై మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంలో పోలీసులు ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. నిందితుడు దేశం విడిచి పారిపోకుండా ఇప్పటికే 'లుకౌట్ నోటీసులు' జారీ చేశారు. అంతేకాకుండా ఆయన సన్నిహితులు, స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలోని పలు ప్రాంతాల్లో నిఘా పెంచి, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా కదలికలను నిశితంగా గమనిస్తున్నారు.

సున్నితమైన పోక్సో చట్టం.. పోలీసులపై గురుతర బాధ్యత

మైనర్లపై జరిగే లైంగిక వేధింపులు, నేరాల నియంత్రణ కోసం ఉద్దేశించిన అత్యంత కఠినమైన 'పోక్సో' చట్టం కింద ఈ కేసు నమోదు కావడంతో కేసు బలంగా మారింది.

మున్ముందు ఏం జరగబోతోంది?

సాయి భగీరథ్ లొంగిపోతే లేదా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేస్తే.. ఈ కేసు విచారణ శరవేగంగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి సున్నితమైన కేసుల్లో ప్రధానంగా డిజిటల్, ఫొరెన్సిక్ , ప్రత్యక్ష సాక్ష్యాలను పక్కాగా సేకరించడం... బాధితురాలికి, ఆమె కుటుంబానికి పూర్తి రక్షణ కల్పిస్తారు. కేసును ప్రభావితం చేయకుండా సాక్షులను కాపాడుకోవడం అత్యంత కీలకం కానున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu