Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మామ హెచ్చరించినా పట్టించుకోని హీరో!

మామ హెచ్చరించినా పట్టించుకోని హీరో!

Tupaki.com 2 weeks ago

బాలీవుడ్ సీరియల్ కిస్సర్‌ ఇమ్రాన్ హష్మీ కెరీర్‌లో `వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై` ఓ మైలురాయి లాంటి సినిమా. ఈ చిత్రం కమిట్ అయ్యే సమయంలో ఇమ్రాన్ హష్మీ గురువు, మామ అయిన మహేష్ భట్ నుండి ఒక షాకింగ్ హెచ్చరిక ఎదుర్కున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ ప్రాజెక్ట్‌లో నటించడం వల్ల కెరీర్ ముగిసి పోతుందని మహేష్ భట్ నేరుగా ఇమ్రాన్‌కు చెప్పారుట. అయితే నటుడిగా ఇమ్రాన్ తీసుకున్న ఆ సాహసోపేత నిర్ణయం ఆయన సినీ ప్రయాణాన్నే మార్చేసిందన్నది అంతే వాస్తవం. మరి మహేష్ భట్ ఎందుకు అలా అన్నారంటే? అప్పటి వరకు ఇమ్రాన్ హష్మీ నటించిన సినిమాలు ఎక్కువగా రొమాంటిక్ థ్రిల్లర్లే.

అప్పటికే నిర్దిష్టమైన ఇమేజ్‌లో ఉన్న ఇమ్రాన్ అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామాలో షోయబ్ వంటి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తే ప్రేక్షకులు ఆదరించరని భట్ ఆందోళన చెందారు. ఒక మాస్ హీరోగా ఎదుగుతోన్న సమయంలో ఇలాంటి ప్రయోగాలు చేయడం కెరీర్ కే ముప్పు అని హెచ్చరించారు. అందుకే ఈ సినిమా నుంచి తప్పుకోవాలని ఇమ్రాన్‌కు సూచించారు భట్. కానీ ఇమ్రాన్ హష్మీకి ఆ కథపై , దర్శకుడు మిలన్ లుథ్రియాపై అపారమైన నమ్మకం ఉంది. తనపై ఉన్న లవర్ బాయ్ ముద్రను పోగొట్టుకోవడానికి ఇదే సరైన అవకాశమని హష్మీ భావించాడు. అజయ్ దేవగన్ వంటి దిగ్గజ నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన నటనను మెరుగుపరుస్తుందని ఇమ్రాన్ మరింత నమ్మాడు.

దీంతో మహేష్ భట్ హెచ్చరికను పక్కన పెట్టి ముందుకు సాగాడు. ఒక నటుడిగా తన పరిధిని విస్తరించుకోవాలనే కసితో ఇమ్రాన్ ఆ ప్రాజెక్ట్‌ను స్వీకరించాడు. సినిమా విడుదలైన తర్వాత ఫలితం అందరినీ ఆశ్చర్యపరిచింది. `వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై` బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాదు. ఇమ్రాన్ హష్మీ నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. గ్యాంగ్‌స్టర్‌గా ఆయన చూపిన తీక్షణత, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. కెరీర్ ముగిసిపోతుందని భయపడిన చోటే హష్మీ పరిపూర్ణమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈ సినిమా విజయంతో మహేష్ భట్ అంచనాలు తప్పని నిరూపితమైంది. అయినా మహేష్ భట్ హెచ్చరిక వెనుక ఇమ్రాన్ ప్రేమ, బాధ్యత మాత్రమే ఉన్నాయని పలుమార్లు చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో ఒక నటుడు తన రూట్ మార్చినప్పుడు ఎదురయ్యే రిస్క్ గురించి భట్ అనుభవంతో హెచ్చరించారు. అయితే ఆ రిస్క్ తీసుకోకపోతే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని ఇమ్రాన్ అభిప్రాయపడ్డారు. గురువు మాటను కాదని ఆయన చేసిన ఆ ప్రయోగం బాలీవుడ్‌లో ఓ గొప్ప విజయగాధగా మిగిలిపోయింది. ఈ ఘటనతో ఒక నటుడికి ఉండాల్సిన గట్ ఫీలింగ్ ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. ఇతరుల సలహాలు గౌరవప్రదమైనవే అయినా? తన ప్రతిభపై తనకు నమ్మకం ఉన్నప్పుడు చేసే ప్రయత్నం ఎప్పుడూ విఫలం కాదని ఇమ్రాన్ నిరూపించాడు. నేడు ఇమ్రాన్ హష్మీ రొమాంటిక్ సినిమాలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన పాత్రలు పోషిస్తున్నాడంటే? దానికి పునాది ఆ రోజు ఆయన తీసుకున్న కఠినమైన నిర్ణయమే అన్నది కాదనలేని నిజం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu