Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మారెమ్మ ట్రైలర్ టాక్: రవితేజ తమ్ముడి కొడుకు ఎలా ఉన్నాడంటే..

మారెమ్మ ట్రైలర్ టాక్: రవితేజ తమ్ముడి కొడుకు ఎలా ఉన్నాడంటే..

Tupaki.com 1 week ago

వితేజ సోదరుడు రఘు కొడుకు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఇక మొదటి సినిమా 'మారెమ్మ' ట్రైలర్ ను విడుదల చేశారు. మంచర్ల నాగరాజ్ దర్శకత్వంలో మయూర్ రెడ్డి బండారు నిర్మించిన ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్‌గా నటించింది.

ఇక ఈ సినిమా ట్రైలర్‌ను రామ్ పోతినేని విడుదల చేశారు. ట్రైలర్ మొదలైనప్పటి నుంచే కథను ఒక పల్లెటూరు, అక్కడి నమ్మకాలు, భయం చుట్టూ తీసుకెళ్లారు. రెగ్యులర్ హీరో ఇంట్రడక్షన్ కంటే కథ సెటప్‌కే ఎక్కువ టైమ్ ఇచ్చారు.

ఊరిలో గేదెలు వరుసగా చనిపోవడం దగ్గర నుంచి అసలు సమస్య మొదలవుతుంది. ఎందుకు చనిపోతున్నాయో తెలియకపోవడంతో అక్కడి వాళ్లు దానికి ఏదో శక్తి కారణమని నమ్ముతారు. మూడో పౌర్ణమిలోపు ఒక మగ దున్నపోతు పుడుతుందని, అదే ఊరిని కాపాడుతుందని పెద్దలు చెప్పే మాటతో కథ మరో లైన్ లోకి వెళ్తుంది. ఆ నమ్మకం నిజమా, దాని వెనుక ఇంకేదైనా ఉందా అన్న ప్రశ్నను ట్రైలర్ ఓపెన్‌గానే వదిలేసింది.

ఆ దున్నపోతుకు 'మారి' అని పేరు పెట్టి హీరో దాన్ని తన దగ్గర పెంచుకుంటాడు. అక్కడి నుంచి అతనికి దానితో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడుతుంది. మరోవైపు జాతర దగ్గరపడటం, మారిని ఎవరో దక్కించుకోవాలని చూడటం, చంపాలనే ప్రయత్నాలు కనిపించడం వల్ల సమస్య పెద్దదవుతుంది. "ఏడేళ్ల పగ", "ఊరి పరువు" లాంటి డైలాగ్స్ చూస్తే ఇది ఒక్క జంతువు చుట్టూ తిరిగే కథ మాత్రమే కాదని అర్థమవుతోంది.

ట్రైలర్‌లో విజువల్స్ కూడా పూర్తిగా గ్రామీణ వాతావరణానికే తగ్గట్టు ఉన్నాయి. రాత్రి సీన్స్, పొలాలు, జాతర ఎపిసోడ్స్‌ను కాస్త రఫ్‌గా చూపించారు. ప్రశాంత్ ఆర్ విహారి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా మిస్టరీ పార్ట్‌ను ముందుకు తీసుకెళ్లేలా ఉంది. అయితే ట్రైలర్ మొత్తం మీద సౌండ్ కంటే విజువల్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు అనిపిస్తోంది.

మాధవ్‌కు ఇది మొదటి సినిమా. హీరోయిజం కంటే కథలో అతని పాత్ర ఏం చేస్తుందనే దానిపై ట్రైలర్ ఫోకస్ చేసింది. గ్రామంలో పెరిగిన యువకుడిగా, మారితో అతనికి ఉన్న బంధాన్ని ఎక్కువగా చూపించారు. దీపా బాలు పాత్ర మద్యలో లవ్ ఎమోషన్ కూడా హైలెట్ చేశారు. ఆమె హీరో జీవితంలో ఎంత వరకు భాగమవుతుందో సినిమా చూసాకే తెలుస్తుంది. ఇక 'మారెమ్మ' సెప్టెంబర్ 10న థియేటర్లలోకి రానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu