Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహేష్ బాబు టీమ్ లో పెద్ది బాంబ్

మహేష్ బాబు టీమ్ లో పెద్ది బాంబ్

Tupaki.com 3 weeks ago

సినిమా ఇండస్ట్రీలో రిలీజ్ డేట్స్ మార్పులు ఒక్కోసారి చిన్న సినిమాల పాలిట శాపంగా మారుతుంటాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలు తమ డేట్స్ అనౌన్స్ చేసినప్పుడు, మిగతా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తలదాచుకోవడానికి కొత్త దారి వెతుక్కోక తప్పదు.

ఇప్పుడు సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది సత్యదేవ్ నటిస్తున్న 'రావు బహదూర్' చిత్ర బృందం. ఇన్నాళ్లూ ఒక పక్కా ప్లానింగ్‌తో ఉన్న మేకర్స్‌కు, సడన్‌గా పెద్ది రాకతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది.

అసలు విషయం ఏంటంటే, సత్యదేవ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ఫిజియోలాజికల్ డ్రామాలో మహేష్ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా భాగస్వామిగా ఉంది. పెద్ద ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ ఉండటంతో పాటు, జూన్ 5వ తేదీన పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఆ డేట్‌ను రావు బహదూర్ టీమ్ ముందే లాక్ చేసుకుంది. ఎటువంటి పోటీ లేకుండా సోలోగా వచ్చి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయొచ్చని టీమ్ అంతా చాలా సంతోషంగా ప్రమోషన్లకు సిద్ధమైంది.

కానీ ఈ సంతోషంపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' బాంబ్ పడినంత పనయ్యింది. మొదట జూన్ చివరి వారంలో వస్తుందని హింట్ ఇచ్చిన పెద్ది టీమ్, అనూహ్యంగా జూన్ 4వ తేదీనే అఫీషియల్ రిలీజ్ డేట్ అని ప్రకటించడంతో రావు బహదూర్ మేకర్స్ షాక్‌కు గురయ్యారు. పెద్దికి ఉన్న క్రేజ్ వల్ల మొదటి వారమే దాదాపు 80 శాతం స్క్రీన్లు బుక్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి టైమ్‌లో కేవలం ఒక్క రోజు గ్యాప్‌తో సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం రిస్క్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇప్పుడు రావు బహదూర్ టీమ్ ముందున్న ఏకైక మార్గం సినిమాను వాయిదా వేసుకోవడమే. జూన్ చివరి వారానికి సినిమాను షిఫ్ట్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయానికి స్కూళ్లు, కాలేజీలు మళ్ళీ ప్రారంభం అవుతుంటాయి కాబట్టి, ఆడియన్స్ థియేటర్లకు రావడంపై కొంత ప్రభావం ఉండే ఛాన్స్ ఉంది. అయినా సరే, పెద్ది లాంటి మాస్ సినిమాతో నేరుగా తలపడటం కంటే కొంచెం వెనక్కి జరిగి రావడం సేఫ్ బెట్ అని టీమ్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కంటెంట్ చాలా బలంగా ఉంటుందని, దాన్ని నమ్ముకుని రిస్క్ చేయక తప్పదని మేకర్స్ అనుకుంటున్నారట. మరి పెద్ది సృష్టించే ప్రభంజనం తగ్గాక రావు బహదూర్ బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు నిలబడుతుందో చూడాలి. రిలీజ్ డేట్ మార్పుపై చిత్ర యూనిట్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం మహేష్ బాబు టీమ్ తన రిలీజ్ స్ట్రాటజీని మళ్ళీ మొదటి నుంచి సెట్ చేసుకునే పనిలో పడింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu