Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మైక్రో వెడ్డింగ్స్‌పై యువత ఆసక్తి!

మైక్రో వెడ్డింగ్స్‌పై యువత ఆసక్తి!

Tupaki.com 4 days ago

పెళ్లంటే నూరేళ్ల పంట.. జీవితంలో ఒకేసారి చేసుకుంటాం కాబట్టి కోట్లల్లో ఖర్చు పెట్టాలి అనుకునే రోజులు మెల్లగా మారిపోతున్నాయి. ఒకప్పుడు ఆడంబరాలకు, గ్రాండ్ వెడ్డింగ్స్‌కు ఇచ్చిన ప్రాధాన్యతను ఇప్పుడు పక్కన పెడుతున్నారు.

ఈ కాలం యువత లగ్జరీ కంటే కూడా మనసుకు నచ్చిన వారితో ప్రశాంతంగా పెళ్లి చేసుకోవడానికే ఇష్టపడుతున్నారు. అందుకే ఇప్పుడు 'మైక్రో వెడ్డింగ్స్' వైపు ట్రెండ్ వేగంగా మారుతోంది.

ఒకప్పటి భారీ ఖర్చులు.. అప్పుల బాధలు:

ఇంతకుముందు పెళ్లి అంటే మినిమం రూ.30 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ప్రీ-వెడ్డింగ్ షూట్స్, హల్దీ, మెహందీ, సంగీత్ అంటూ ఫంక్షన్ల లిస్ట్ సాగిపోయేది. ఇక ఈ భారీ ఖర్చుల కోసం మధ్యతరగతి తల్లిదండ్రులు జీవితకాలం సంపాదించిన డబ్బును ఖర్చు పెట్టడమో, లేదా పొలాలు, ఇళ్లు, స్థలాలు అమ్మడమో చేసేవాళ్లు. పెళ్లి అయిపోయాక అప్పుల పాలై ఇబ్బంది పడేవాళ్లు కొందరు.

పేరెంట్స్‌ను మోటివేట్ చేస్తున్న పిల్లలు:

ఇప్పుడు యువత ఆలోచన పూర్తిగా ప్రాక్టికల్‌గా ఉంది. మా పెళ్లి కోసం ఆస్తులు అమ్మొద్దు.. ఆ స్థలంలోనే ఒక చిన్న ఇల్లు కట్టుకుందాం. అక్కడే సింపుల్‌గా పెళ్లి చేసేయండి అంటూ పిల్లలే తమ తల్లిదండ్రులకు నచ్చజెబుతున్నారు. ఇక అనవసరపు హంగూ ఆడంబరాలకు డబ్బులు తగలేయడం కంటే, ఆ డబ్బును భవిష్యత్తు కోసం దాచుకోవడం బెటర్ అని ఫిక్స్ అవుతున్నారు.

వేల మంది ఎందుకు? మనవాళ్లు ఉంటే చాలు:

పెళ్లికి 2000 మందిని, 4000 మందిని పిలిచినా.. వాళ్లు వచ్చి భోజనం చేసి, వంటలు బాగున్నాయో లేదో అని మాట్లాడుకుని వెళ్ళిపోతారు. కానీ రేపు మనకు ఏదైనా కష్టం వస్తే నిలబడేది ఎవరు? మనకు ఎవరు సహాయం చేయరు. అందుకే, రేపు పొద్దున మనకు తోడుగా ఉండే మనకు అత్యంత సన్నిహితులైన ఒక 50 నుంచి 100 మందిని మాత్రమే పిలిచి పెళ్లి చేసుకోవాలని యువత కోరుకుంటోంది.

మైక్రో వెడ్డింగ్ అంటే ఏంటి?:

మైక్రో వెడ్డింగ్ అంటే పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవడం కాదు. కేవలం పరిమిత సంఖ్యలో అతిథులను పిలిచి, ఆత్మీయంగా, ఎంతో అందంగా జరుపుకోవడం. ఇక దీనివల్ల ఖర్చు విపరీతంగా తగ్గుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరితోనూ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు సరదాగా సమయం గడపడానికి, మాట్లాడటానికి వీలవుతుంది.

సమాజం కోసం, ఎవరో ఏదో అనుకుంటారని చేసే ఆడంబరాల కంటే.. మనకు నచ్చినట్టు, మన బడ్జెట్‌లో చేసుకునే పెళ్లే ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఇక యువత ఆలోచనల్లో వచ్చిన ఈ మార్పు నిజంగా అభినందించదగ్గది. అనవసరపు ఖర్చులను తగ్గించుకుని, హ్యాపీగా కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఈ మైక్రో వెడ్డింగ్స్ పర్ఫెక్ట్ ఛాయిస్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu