Friday, 27 Nov, 11.00 pm Tupaki.com

మూవీ న్యూస్
మల్లెల మంచంపై రేతిరంతా జాతరే!

స్నేహల పందిరి క్రింద...మరు మల్లెతో ముచ్చట్లు...!! పరిమళలా గుభాళ్ళింపుతో మనస్సున పులకరింత... స్నేహల మల్లెల అలంకరణలో వెలుగులు విరజిమ్మేను...!! చల్లటి వెన్నెలాంట్టి నీ మనస్సు ...పసుపు పచ్చని గంధమై పుసెను నా మెముపై...!! స్నేహల సెలఎట్టిలో కేరింతల కెరటాలలో...మరు మల్లెల పువ్వుల మాలై విరిసెను మన స్నేహం...!!ఏమిటో ఈ సుదీర్ఘ కవిత అనుకుంటున్నారా? ప్చ్.. హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న కాజల్ కిచ్లు జంట ఏ రేంజులో ఎంజాయ్ చేస్తోందో ఆ రొమాంటిక్ సందర్భాన్ని..

కాజల్ స్వయంగా పది మూరల మల్లె చెండు ఫోటోని షేర్ చేయగానే కొంటె కుర్రాళ్లంతా రకరకాల కామెంట్లతో విరుచుకుపడ్డారు. ఓవైపు మాల్దీవుల్లో అండర్ వాటర్ రిసార్ట్ లో హనీమూన్ ఎంజాయ్ చేసిన కాజల్ -కిచ్లు జంట తమ జ్ఞాపకాల్ని ఏవీ దాచుకోకుండా ఇలా ఓపెన్ అయిపోతోంది. అయితే కాజల్ మరీ ఇలా బోల్డ్ గా మల్లె పూలను షేర్ చేస్తుందన్నది ఊహించనిది. తన సెలబ్రేషన్ పీక్స్ లో ఉందని అందరికీ చెప్పడమే దీని ఉద్ధేశం కావొచ్చు. మరుమల్లెలు విరిసెను రేతిరంతా జాతరే! అంటూ కిరాక్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు కుర్రకారు. మల్లెల గుభాళింపులో ఆ ఒక్క కార్యం రసాస్వాధనల్ని ఊహించేసుకుంటున్నారు మరి. అక్టోబర్ 30న కిచ్లుని పెళ్లాడింది మొదలు ఈ జంట ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. అన్నట్టు హనీమూన్ ముగించేసి ఇప్పుడు షూటింగుల కోసం షెడ్యూల్స్ కేటాయించేందుకు కాజల్ ప్రిపరేషన్ లో ఉందని వార్తలొచ్చాయి. దానిపై వివరణ ఇస్తుందేమో చూడాలి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu
Top