Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మమతను మళ్లీ ఓడించాలి.. బీజేపీ హైలెవిల్ మీటింగ్‌!

మమతను మళ్లీ ఓడించాలి.. బీజేపీ హైలెవిల్ మీటింగ్‌!

Tupaki.com 1 week ago

శ్చిమ బెంగాల్‌లో తొలిసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. తనదైన పాలనను ప్రారంభించింది. గత ప్రభుత్వం చేసిన తప్పులపై ఇప్పుడు విచారణకు ఆదేశించాలని సీఎం సువేందు అధికారి నిర్ణయించారు.

ముఖ్యంగా డీఎస్సీలో జరిగిన అవకతవకలతోపాటు.. భూముల కేటాయింపులోనూ జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశించనున్నారు. ఇదిలావుంటే.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం మమతా బెనర్జీని అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చేయాలని బీజేపీ నిర్ణయించింది.

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భవానీ పూర్ నియోజకవర్గం నుంచి మమత పరాజయం పాలయ్యారు. ఇక్కడ పోటీ చేసిన సువేందు అధికారి ఆమెను ఓడించారు. ఈ నియోజకవర్గంతో పాటు.. సువేందు అధి కారి.. నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసి ఒకేసారి రెండు నియోజకవర్గాలను కైవసం చేసు కున్నారు. ఈ క్రమంలో నిబంధనల మేరకు.. ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి ఉంది. అయితే.. మమతను అసెంబ్లీలోకి అడుగు పెట్టుకుండా చేయాలంటే.. భవానీ పూర్ నుంచి తాను కొనసాగాల్సి ఉంటుందని ఆయన చెబుతున్నారు.

ఎందుకంటే.. మమతకు అంతో ఇంతో సానుభూతి ఉన్న నియోజకవర్గం భవానీపూర్‌. గతంలో నూ ఆమె ఇక్కడ నుంచే ఉప ఎన్నికలో విజయం దక్కించుకున్నారు. దీనిని బట్టి ఈనియోజకవర్గం నుంచి మమతకు ఛాన్స్ ఇవ్వకుండా.. నందిగ్రామ్ నియోజకవర్గాన్ని సువేందు వదులుకుంటే.. అక్కడ నుంచి మమత పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ, ఇక్కడ సువేందు చెప్పిందే వేదం. దీంతో మమతను మరోసారి సునాయాసంగా ఇక్కడ ఓడించవచ్చని సీఎం ఆలోచన.

ఈ నేపథ్యంలో శనివారం బీజేపీ హైలెవిల్ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీఎం సువేందు అధికారి ఏ నియోజకవర్గం ఉంచుకోవాలి.. ఎక్కడ రాజీనామా చేయాలన్న నిర్ణయం తీసుకుంటారు. ఏదేమైనా.. మమతకు మరో ఛాన్స్ ఇవ్వకుండా.. చూడడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. నందిగ్రామ్ నియోజకవర్గంలో సువేందు కుటుంబం పాతుకుపోయింది. పైగా మమతకు ఈ నియోజకవర్గం నేటివ్ ప్లేస్ కూడా కాదు. కాబట్టి ఇక్కడ రాజీనామా చేసి.. ఉప ఎన్నికలకు వెళ్లడం ద్వారా సువేందు వదిన లేదా.. కుటుంబ సభ్యులను బరిలో దింపుతారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu