Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి.. ట్రోల్స్‌పై సారా టెండూల్కర్ ఫుల్ ఫైర్!

మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి.. ట్రోల్స్‌పై సారా టెండూల్కర్ ఫుల్ ఫైర్!

Tupaki.com 3 days ago

సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్, బాడీ షేమింగ్ కామెంట్స్ కొత్త విషయం కాదు. కానీ ఇప్పుడు ఈ విషయంలో సెలబ్రిటీలు కూడా మౌనం వీడి నేరుగా స్పందిస్తున్న తీరు కనిపిస్తోంది.

తాజాగా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ చేసిన ఘాటు స్పందన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. తనపై ఒక సోషల్ మీడియా పేజ్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై సారా బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇటీవల సారా టెండూల్కర్ తన వదినతో కలిసి బయటకు వెళ్తున్న టైమ్ లో తీసిన వీడియోను ఒక సోషల్ మీడియా పేజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే వీడియోతో పాటు మోటీ వాలా సారా హై అంటూ బాడీ షేమింగ్‌కు దిగేలా కామెంట్ జత చేయడం వివాదానికి కారణమైంది. ఈ పోస్ట్‌ను గమనించిన సారా వెంటనే స్పందించారు. ఆ పోస్ట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ మీరు అసహ్యంగా ఉన్నారు. ఇది జర్నలిజం కాదు. మమ్మల్ని ఒంటరిగా వదిలేయండంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వ్యూస్, ఎంగేజ్‌మెంట్ కోసం పర్సనల్ లైఫ్స్ ను టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం అనే చర్చ కూడా ఈ ఘటనతో మళ్లీ తెరపైకి వచ్చింది.

సారా రియాక్షన్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో ఆ పేజ్ వెంటనే ఆ వీడియోను డిలీట్ చేసింది. అయితే అక్కడితో ఆగకుండా సారా మరోసారి అదే పేజ్‌ను ట్యాగ్ చేస్తూ స్టోరీ పెట్టారు. మీరు ఇప్పుడు ఆ పోస్ట్‌ను తొలగించి ఉండొచ్చు. కానీ దానివల్ల మీ అసహ్యకరమైన ఆలోచనా విధానం మారదంటూ ఆమె మరింత ఘాటుగా స్పందించారు. సెలబ్రిటీలపై ఇలాంటి వ్యక్తిగత కామెంట్లు చేయడం జర్నలిజం కాదని, అది కేవలం ఆన్‌లైన్ హరాస్మెంట్ మాత్రమేనని పలువురు నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో సారాకు భారీ మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా మహిళలపై బాడీ షేమింగ్ కామెంట్లను సాధారణంగా తీసుకోకూడదని, వాటిని ప్రశ్నించడం అవసరమని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

రీసెంట్ గానే సారా కుటుంబంలో జరిగిన వేడుకల ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఆమె సోదరుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లి వేడుకలకు సంబంధించిన పలు క్షణాలను సారా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫ్యామిలీ కంటెంట్‌ను ఆధారంగా చేసుకుని కొన్ని పేజీలు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. సోషల్ మీడియా పెరుగుతున్న ప్రభావంతో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం పూర్తిగా పబ్లిక్ డిస్కషన్‌గా మారిపోతున్నప్పటికీ, వ్యక్తిగత గౌరవం అనే హద్దు దాటకూడదనే అభిప్రాయం బలపడుతోంది. ముఖ్యంగా మహిళలపై బాడీ షేమింగ్, మార్ఫింగ్, వ్యక్తిగత విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో సారా టెండూల్కర్ ఇచ్చిన ఈ స్ట్రాంగ్ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద డిబేట్‌కు కారణమైంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu