Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మంచు ఫ్యామిలీ గొడవలు.. మనోజ్ 'హెల్మెట్' కామెంట్స్ తో కొత్త చర్చ..

మంచు ఫ్యామిలీ గొడవలు.. మనోజ్ 'హెల్మెట్' కామెంట్స్ తో కొత్త చర్చ..

Tupaki.com 5 days ago

టాలీవుడ్‌ లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌ గా మారిన మంచు ఫ్యామిలీ వివాదాలు మరోసారి వార్తల్లో నిలిచాయి. మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య కొనసాగుతున్న మనస్పర్థలు, ఆస్తి వివాదాలపై ఇప్పటికే అనేక రకాల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

ఒకప్పుడు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం, సోషల్ మీడియాలో పరోక్ష విమర్శలు చేసుకోవడం వంటి పరిణామాలు పెద్ద చర్చకు దారితీశాయి.

అయితే గత కొన్ని నెలలుగా ఇద్దరూ తమ తమ సినిమాలు, వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉండటంతో ఆ వివాదం సద్దుమణిగిందని చాలా మంది భావించారు. కానీ తాజాగా మనోజ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి కుటుంబ గొడవలు తెరపైకి తీసుకొచ్చాయి. తన పుట్టినరోజు వేడుకలకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో మనోజ్ విలేకరులతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఒక జర్నలిస్ట్ "మీ ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ ఇప్పుడు క్లియర్ అయినట్టేనా?" అని ప్రశ్నించారు. దీనికి మనోజ్ తనదైన శైలిలో నవ్వుతూ సెటైరికల్‌ గా స్పందించారు.

"ఆ విషయం గురించి ఎవరిని అడగాలో మీకు బాగా తెలుసు కదా.. వెళ్లి వాళ్ళని అడగండి. కానీ వెళ్ళేటప్పుడు చేతిలో మైక్ పట్టుకుని మాత్రం వెళ్ళొద్దు.. తలకు మంచి హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి" అంటూ నవ్వేశారు. మనోజ్ చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. ముఖ్యంగా "హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి" అన్న కామెంట్ ఇప్పుడు నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆ కామెంట్స్ పరోక్షంగా తన మోహన్ బాబును ఉద్దేశించినవేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

గతంలో మంచు కుటుంబంలో జరిగిన గొడవల సమయంలో మీడియా ప్రతినిధులు ఇంటి వద్దకు వెళ్లిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో మోహన్ బాబు ఒక విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. రిపోర్టర్ చేతిలోని మైక్ తీసుకుని కొట్టిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు మనోజ్ చేసిన "మైక్ తీసుకుని వెళ్లొద్దు.. హెల్మెట్ పెట్టుకోండి" అన్న వ్యాఖ్యలు ఆ సంఘటనను గుర్తుచేస్తున్నాయంటూ పెద్ద ఎత్తున పోస్టులు కనిపిస్తున్నాయి.

అయితే మనోజ్ వ్యాఖ్యల తర్వాత మంచు కుటుంబంలో ఇంకా విభేదాలు పూర్తిగా తగ్గలేదనే అభిప్రాయం వినిపిస్తోంది. బయటకు ఎవరూ నేరుగా స్పందించకపోయినా, అప్పుడప్పుడు ఇలాంటి పరోక్ష కామెంట్లు రావడం వల్ల అన్నదమ్ముల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుందనే చర్చ మళ్లీ మొదలైంది. ఇక మనోజ్ మాత్రం మొత్తం వ్యవహారాన్ని సరదాగా చెప్పినట్టు కనిపించినా, ఆయన మాటల్లో వ్యంగ్యం స్పష్టంగా కనిపించిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతుండగా, కొందరు మనోజ్ ధైర్యంగా మాట్లాడాడని కామెంట్ చేస్తుంటే.. మరికొందరు కుటుంబ విషయాలను ఇలా పబ్లిక్‌ లో ప్రస్తావించడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా, చాలా రోజుల తర్వాత మంచు ఫ్యామిలీ వివాదాలు మళ్లీ హాట్ టాపిక్‌ గా మారాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu