Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెగా 158 గ్లింప్స్: మెగా బ్రదర్స్ కాదు మెగా త్రిమూర్తులు!

మెగా 158 గ్లింప్స్: మెగా బ్రదర్స్ కాదు మెగా త్రిమూర్తులు!

Tupaki.com 3 days ago

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వరుస సినిమాలతో బాక్సాఫీస్ పోరులో బిజీగా గడుపుతున్నారు. మరోవైపు ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టించి, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా ప్రజాసేవలో తలమునకలై ఉన్నారు.

అదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబు బుల్లితెర రియాలిటీ షోలతో అలరిస్తూనే, అటు రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇలా ముగ్గురూ ఎవరి రంగాల్లో వారు అత్యంత బిజీగా ఉండటం వల్ల ఇంతకాలానికి కానీ ఈ ముగ్గురు మెగా బ్రదర్స్ ఒకే వేదికపై కనిపించే అరుదైన సన్నివేశం సాధ్యపడలేదు.

గతంలో సొంత ఇండ్లలో జరిగే ఫంక్షన్లు, పండగలను పక్కన పెడితే.. బహిరంగ వేదికలపై లేదా సినిమా ఈవెంట్లలో ఈ ముగ్గురూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన సందర్భాలు చాలా అరుదు. టాలీవుడ్ వజ్రోత్సవాల వేళ, ప్రజారాజ్యం పార్టీ ప్రచార కార్యక్రమాలలో లేదా బెంగళూరు ఫామ్‌హౌస్‌లో జరిగే సంక్రాంతి వేడుకల్లో మాత్రమే వీరు గతంలో కలిసి కనిపించి ఉండవచ్చు. అయితే సుదీర్ఘ విరామం తర్వాత ఈ అరుదైన దృశ్యం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం `మెగా 15` ప్రారంభోత్సవ వేదికపై ఆవిష్కృతమైంది. ఒకే వేదికపై ముగ్గురూ కలిసి కెమెరా కంటికి చిక్కడంతో మెగా క్యాంప్‌లో సరికొత్త జోష్ వచ్చింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ ఫోటోలు, వీడియోలను చూసిన అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ఈ అద్భుతమైన విజువల్స్ చూసి వీరు కేవలం `మెగా బ్రదర్స్` కాదు.. ప్రజల హృదయాలను శాసిస్తున్న `మెగా త్రిమూర్తులు` అంటూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరైతే ఈ ముగ్గురి స్టైలిష్ లుక్స్‌కు ఫిదా అయిపోయి `మెగా కలర్‌ఫుల్ బ్రదర్స్` అని ప్రశంసిస్తున్నారు. ఈ వేడుకలో ముగ్గురూ ఒకరి చెవిలో ఒకరు గుసగుసలాడుకుంటూ ఆత్మీయంగా మాట్లాడుకుంటున్న దృశ్యాలను కవర్ చేయడానికి అక్కడి మీడియా కెమెరాలకు కళ్లు చాలలేదనే చెప్పాలి.

ముఖ్యంగా ఈ వేదికపై ఆ ముగ్గురి డ్రెస్ కోడ్, సరికొత్త లుక్స్ అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించాయి. మెగాస్టార్ చిరంజీవి వైట్ షర్ట్‌తో జెంటిల్‌మన్‌లా కనిపిస్తూనే, లూజ్ డఫెల్ ప్యాంట్‌లో సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేశారు. మరోవైపు నాగబాబు స్లిమ్ లుక్ ఫార్మల్స్‌లో ఎంతో ట్రెడిషనల్‌గా కాగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన నిత్య రాజకీయ అవతారాన్ని పక్కన పెట్టి, బ్లూ షర్ట్ -ఖాకీ ప్యాంట్‌లో ఎంతో స్మార్ట్‌గా, స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చారు. మెగాస్టార్ కొత్త సినిమా ప్రారంభోత్సవం కాస్తా, ఇలా మెగా త్రిమూర్తుల కలయికతో ఇటు ఇండస్ట్రీలో, అటు సోషల్ మీడియాలో ఒక పెద్ద పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu