Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెగా 158: 'వాల్తేరు వీరయ్య 2.O' డబుల్ ధమకా ట్రీట్ మొదలు!

మెగా 158: 'వాల్తేరు వీరయ్య 2.O' డబుల్ ధమకా ట్రీట్ మొదలు!

Tupaki.com 3 days ago

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల వేట మొదలుకానుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం `మన శంకర వరప్రసాద్ గారు` అందించిన అద్భుతమైన విజయం తర్వాత..

ఆయన తన తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. చిరంజీవి కెరీర్‌లో వస్తున్న ఈ 158వ చిత్రానికి తాత్కాలికంగా `మెగా 158` అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటనతోనే చిత్ర పరిశ్రమతో పాటు మెగా అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం రెట్టింపయింది.

ఈ సినిమాపై ఇండస్ట్రీలో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడటానికి ప్రధాన కారణం దీని వెనుక ఉన్న సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ మాస్ హిట్‌గా నిలిచిన `వాల్తేరు వీరయ్య` చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) కలిసి చేస్తున్న రెండో చిత్రం ఇది. ఈ సూపర్ హిట్ జోడీ మళ్లీ కుదరడంతో ఈసారి థియేటర్లలో `వాల్తేరు వీరయ్య 2.O` రేంజ్‌లో డబుల్ ధమకా మాస్ ట్రీట్ ఖాయమని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.

ఈ గురువారం(21 మే) నాడు చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కు మెగా కుటుంబానికి చెందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నాగబాబు, పవన్, చరణ్ ముగ్గురూ కలిసి చిరంజీవితో ముహూర్త కార్యక్రమంలో కనిపించడంతో మెగా క్యాంప్‌లో ఒకేసారి ఉల్లాసం, ఉద్వేగం నెలకొన్నాయి. ఈ పండుగ వాతావరణం సినిమా నిర్మాణానికి ఒక బలమైన, పాజిటివ్ ఎనర్జీని ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాని అధికారికంగా పవన్ కల్యాణ్ క్లాప్ తో ప్రారంభించడం ఎగ్జయిట్ చేసింది.

సాంకేతిక నిపుణుల పరంగా కూడా ఈ సినిమా కోసం ఒక పవర్‌ఫుల్ బృందాన్ని రంగంలోకి దించారు. కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో భారీ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ `కేవీఎన్ ప్రొడక్షన్స్` ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి నేరుగా అడుగుపెడుతోంది. ఈ క్రేజీ మాస్ ఎంటర్‌టైనర్‌కు ప్రముఖ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా... విజయ్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా...అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా బాధ్యతలు చేపట్టారు. విజువల్‌గా, మ్యూజికల్‌గా సినిమాను అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించేందుకు ఈ టీమ్ సిద్ధమవుతోంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్ చాలా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ నుంచి అభిమానులు ఆశించే ఊర మాస్ యాక్షన్ ఎలిమెంట్స్, అదిరిపోయే డైలాగ్స్ .. వింటేజ్ స్టెప్పులతో కూడిన డ్యాన్సులు పుష్కలంగా ఉండబోతున్నాయని ఇండస్ట్రీ టాక్. వీరయ్య మ్యాజిక్‌ను డైరెక్టర్ బాబీ ఈసారి డబుల్ డోస్‌తో ఎలా రీక్రియేట్ చేయబోతున్నారో చూడటానికి సోషల్ మీడియా వేదికగా అప్పుడే హైప్ పీక్స్‌కు చేరుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu