Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'మెరుపు' మెమొరీస్.. పెద్దితో చరణ్ కోరిక తీరుతున్నట్లేనా?

'మెరుపు' మెమొరీస్.. పెద్దితో చరణ్ కోరిక తీరుతున్నట్లేనా?

Tupaki.com 3 days ago

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ పెద్దిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఆ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ద్వారా తనకు ఎన్నాళ్లుగానో ఉన్న కోరిక నెరవేరుతోందని ఇటీవల ప్రమోషన్స్‌ లో చరణ్ చెప్పడం ఆసక్తికరంగా మారింది.

ముఖ్యంగా స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్‌ లో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నా.. మెరుపు ఆగిపోవడం బాధ కలిగించిందని ఆయన చెప్పడంతో మళ్లీ ఆ ప్రాజెక్టు గురించి చర్చ మొదలైంది.

మెరుపు అనేది రామ్ చరణ్ కెరీర్‌ లో ఎంతో గ్రాండ్ గా స్టార్ట్ అయిన సినిమా. మగధీర వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చరణ్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిన సమయంలో ఆ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చింది. కోలీవుడ్ డైరెక్టర్ ధరణి దర్శకత్వంలో 2010 ఏప్రిల్ 30న ఆ సినిమా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత ఆర్ బీ చౌదరీ తన సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌ పై నిర్మించేందుకు ముందుకొచ్చారు. లాంచింగ్ రోజు మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టడం అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఆ సినిమాను కంప్లీట్ ఫుట్‌ బాల్ స్పోర్ట్స్ లవ్ స్టోరీగా ప్లాన్ చేశారు. చిరంజీవి కెరీర్‌ లో వచ్చిన విజేత తరహాలో ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందించాలని భావించారు. అందుకే ఆ కథపై చరణ్ కూడా ప్రత్యేక ఆసక్తి చూపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. హీరోయిన్ ఎంపిక విషయంలో పలుమార్లు మార్పులు చోటుచేసుకున్నాయి. మొదట బాలీవుడ్ నటి షాజన్ పదాంసీ పేరు వినిపించగా, తర్వాత కాజల్ అగర్వాల్ ను ఫైనల్ చేశారు. అయితే డేట్స్ సమస్యల కారణంగా ఆమె తప్పుకోవడంతో మరో హీరోయిన్ కోసం ప్రయత్నాలు జరిగాయి. షూటింగ్ మొదలయ్యేలోపే సినిమాకు ఆటంకాలు మొదలయ్యాయి.

అయితే అసలు సమస్య బడ్జెట్ దగ్గర వచ్చి ఆగిపోయిందని తెలుస్తోంది. మొదట ఆ సినిమాకు సుమారు రూ.35 కోట్ల బడ్జెట్ అనుకున్నట్లు సమాచారం. కానీ దర్శకుడు అదనంగా మరో భారీ మొత్తాన్ని కోరడంతో నిర్మాతలు కాస్త వెనకడుగు వేసినట్లు టాక్ వినిపించింది. అయినా చరణ్, చిరంజీవి ఎంకరేజ్మెంట్ తో చెన్నైలో మొదటి షెడ్యూల్ ప్రారంభించారు. కేవలం 15 రోజుల షూటింగ్‌ కే దాదాపు రూ.8 కోట్లు ఖర్చవడం నిర్మాతలకు షాక్ ఇచ్చిందని అప్పట్ల చర్చ జరిగింది.

అంతేకాదు షూటింగ్ అనంతరం వచ్చిన రష్ అవుట్‌ పుట్ ఆశించిన స్థాయిలో లేదని సమాచారం. చిరంజీవి కొన్ని మార్పులు సూచించినప్పటికీ, కథ, ట్రీట్మెంట్ విషయంలో అనుకున్న ఫలితం రాదనే అభిప్రాయం ఏర్పడిందట. మరోవైపు షూటింగ్ ఆలస్యం, హీరోయిన్ డేట్స్ సమస్యలు కూడా కలిసి రావడంతో చివరకు ఆ ప్రాజెక్ట్‌ ను పూర్తిగా నిలిపివేశారని వినికిడి. అయితే మెరుపు ఆగిపోవడం చరణ్‌ ను వ్యక్తిగతంగా నిరాశకు గురి చేసినట్లు ఆయన లేటెస్ట్ కామెంట్స్ తో అర్థమవుతోంది.

స్పోర్ట్స్ జానర్‌ పై ఉన్న ఆసక్తి అప్పటినుంచే ఉన్నప్పటికీ, సరైన కథ కోసం ఎదురు చూశారు. ఇప్పుడు పెద్ది రూపంలో ఆ కల నిజమవుతుండటంతో అభిమానుల్లో కూడా భారీ అంచనాలు పెరిగాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా బుచ్చిబాబు ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఏదేమైనా ఒకప్పుడు మధ్యలో ఆగిపోయిన మెరుపు జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతున్నా.. ఇప్పుడు పెద్దితో చరణ్ కోరిక తీరనుందనే చెప్పాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu