Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మోదీ చెప్పిన వెస్ట్ బెంగాల్ కథ.. పెద్ది సినిమాతో చరణ్ కనెక్షన్!

మోదీ చెప్పిన వెస్ట్ బెంగాల్ కథ.. పెద్ది సినిమాతో చరణ్ కనెక్షన్!

Tupaki.com 2 weeks ago

ఢిల్లీలో జరిగిన 'పెద్ది' ప్రమోషనల్ ఈవెంట్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. ఇటీవలే దేశ రాజధానిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు, ఈ సినిమా కథేంటి అని మోదీ అడిగారట.

దానికి చరణ్ స్పందిస్తూ.. మన పల్లెటూళ్ల రేంజ్ ని పెంచడం, వాటికి ఒక స్పెషల్ గుర్తింపు తీసుకురావడం అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ రాబోతోందని ప్రధానికి వివరించాడు.

చరణ్ చెప్పిన విషయాలు విన్నాక ప్రధాని మోదీ కూడా తన లైఫ్ లో చూసిన ఒక రియల్ సంఘటనను చరణ్ తో పంచుకున్నారట. గతంలో తాను వెస్ట్ బెంగాల్ లో ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని మోదీ గుర్తుచేసినట్లు వివరించారు. ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ లో కొంతమంది కుర్రాళ్లు పైన జెర్సీ, కింద లంగోటా వేసుకుని ప్రధానికి కనిపించారట.

వాళ్ల గెటప్ చూసి అసలు ఎక్కడి వాళ్లు అని ఆరా తీస్తే.. వెస్ట్ బెంగాల్ లోని ఒక చిన్న మారుమూల గ్రామానికి చెందిన వాళ్లని మోదీకి తెలిసింది. ఆ ఊరి బ్యాక్ గ్రౌండ్ ఏంటా అని చూస్తే.. దాదాపు యాభై ఏళ్ల క్రితం ఆ చిన్న పల్లెటూరు నుంచి మహ్మద్ అనే ఒక సాధారణ వ్యక్తి ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ కు ఎంపికయ్యాడు. ఆ ఒక్క మనిషి సాధించిన విజయం ఆ ఊరి మొత్తానికి ఒక పెద్ద ఇన్స్పిరేషన్ గా మారింది.

ఒక్క వ్యక్తి మొదలుపెట్టిన ఆ జర్నీ వల్లే ఈరోజు అదే చిన్న గ్రామం నుంచి దాదాపు ఎనభై ఐదు మందికి పైగా కుర్రాళ్లు ఫుట్ బాల్ ఆడుతున్నారని మోదీ తనకు వివరించినట్లు చరణ్ స్టేజ్ మీద చెప్పాడు. ఒకే ఒక్క మనిషి గట్టిగా అనుకుంటే ఒక ఊరి రూపురేఖలను ఎంతలా మార్చేయగలడో చెప్పడానికి ప్రధాని మోదీ పంచుకున్న ఈ సంఘటన ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చరణ్ అన్నాడు.

సరిగ్గా పెద్ది సినిమా కథ కూడా ఇలాంటి లైన్ లోనే సాగుతుందని చరణ్ క్లారిటీ ఇచ్చాడు. ఒక మారుమూల గిరిజన ప్రాంతానికి చెందిన ఒక కుర్రాడు తన ఊరి కోసం ఎలాంటి మార్పు తీసుకొచ్చాడు, తనకంటూ ఒక ఐడెంటిటీ ఎలా క్రియేట్ చేసుకున్నాడు అనేదే పెద్ది అసలు కథ అని చరణ్ క్లారిటీ ఇచ్చాడు. ఇక సినిమా విషయానికి వస్తే, బుచ్చిబాబు సన డైరెక్షన్ లో వెంకట సతీష్ కిలారు ఈ ప్రాజెక్ట్ ను భారీ లెవెల్ లో నిర్మించారు. రామ్ చరణ్ కు జంటగా జాన్వీ కపూర్ నటించగా, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. పక్కా విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. చరణ్ కెరీర్ లోనే ఇదొక డిఫరెంట్ ఎమోషనల్ జర్నీ కాబోతోందని మేకర్స్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu