Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మోడీ హింట్ ఇచ్చేశారా...అవుట్ అయ్యేది ఎవరు ?

మోడీ హింట్ ఇచ్చేశారా...అవుట్ అయ్యేది ఎవరు ?

Tupaki.com 3 days ago

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానిగా రెండేళ్ళ పాలన పూర్తి అయింది. మూడవసారి అధికార్మలోకి వచ్చిన తరువాత తొలి రెండేళ్ల పాలన మీద సమగ్రమైన సమీక్ష అయితే తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో జరిగింది అని అంటున్నారు.

ఏకంగా దాదాపుగా అయిదు గంటల పాటు సుదీర్ఘమైన భేటీ జరిగింది అని అంటున్నారు. ఇంతటి కీలకమైన లాంగ్ టెర్మ్ భేటీ అయితే గతంలో ఎపుడూ జరగలేదు, గరిష్టంగా మూడు గంటల పాటు మాత్రమే మంత్రి వర్గ సమావేశాలు గతంలో జరిగాయి. మరి ఇంతటి సుదీర్ఘమైన సమావేశం ద్వారా ఏమి చెప్పారు మంత్రులకు ఏ విధంగా దిశా నిర్దేశం చేశారు అన్నదే ఢిల్లీ సర్కిల్స్ లో ప్రస్తుతం బిగ్ పొలిటికల్ డిబేట్ గా సాగుతోంది.

పని తీరు మారాలి :

మంత్రుల పనితీరు మారాలని ప్రధాని కోరారని అంటున్నారు. అంతే కాదు ఫైళ్ళ క్లియరెన్స్ విషయంలో వేగం పెరగాలని ఆయన సూచించారు అని అంటున్నారు. అలాగే మంత్రులు తమ పని తీరులో కొత్త దనం చూపించాలని శాఖా పరంగా సంస్కరణలను కూడా కొత్తవి ఆవిష్కరించాలని ప్రధాని సూచించారు అని అంటున్నారు. అలాగే అలసత్వం వద్దని కూడా పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.

విభేదాలు వద్దు :

అదే సమయంలో విభేదాలు వద్దని శాఖాపరంగా అంతా నిబద్ధతో పనిచేయాలని 2047 లక్ష్యాన్ని పెట్టుకుని ఉత్సాహంగా ముందుకు సాగాలని మోడీ కోరారు. పెండింగ్ అన్న మాటే వినిపించకూడదని మోడీ మంత్రులకు స్పష్టం చేసినట్లుగా చెప్పారు. ఈ రోజే అధికారంలోకి వచ్చామన్న హుషార్ తో పనిచేయాలని ఆయన కోరారు శాఖాపరంగా ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు తీసుకుని రావాలని కూడా ఆయన కోరారని అంటున్నారు.

అంచనాలతో రెడీనా :

ఇదిలా ఉంటే ఈ ఏడాదిలో మోడీ అధ్యక్షతన జరిగిన పూర్తి స్థాయి మంత్రి వర్గ సమావేశం ఇదే అని అంటున్నారు. ఈ సమావేశంలో కేబినెట్ మంత్రులతో పాటు ఇండిపెండెంట్ చార్జితో ఉన్న మంత్రులు సహాయ మంత్రులు మొత్తం 71 మంది దాకా హాజరయ్యారని అంటున్నారు. అందరినీ పిలిచి మరీ మోడీ పనితీరు గురించి వివరించారు అంటే కచ్చితంగా కేంద్ర పెద్దల వద్ద మంత్రుల పనితీరు మీద అంచనాలు ఉన్నాయని అంటున్నారు. ఒక విధంగా హింట్ ఇచ్చారా అన్న చర్చ కూడా సాగుతోంది. పని తీరు మెరుగుపరచుకోఅవలని కోరడం అంటే కొందరికి ఉధ్వాసన తప్పదా అన్న చర్చ కూడా సాగుతోంది. దాంతో ఇన్ ఎవరు అన్నది పక్కన పెడితే ఎవరు అవుట్ అన్న దాని మీదనే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. జూన్ నెలలో మంత్రి వర్గ విస్తరణ ఉందని చెబుతున్నారు. దాంతో మోడీ మార్క్ పునర్ వ్యవస్థీకరణకు ఈ మీటింగ్ కీలకంగా మారిందని ప్రచారం కిఊడా సాగుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu