Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముంబైలో రామ్ చరణ్ స్టెప్పులు.. బాలీవుడ్ ఫిదా

ముంబైలో రామ్ చరణ్ స్టెప్పులు.. బాలీవుడ్ ఫిదా

Tupaki.com 1 week ago

ముంబైలో జరిగిన 'పెద్ది' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ అందరినీ ఆకట్టుకుంది. ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టేజ్ మీద డాన్స్ చేసి అక్కడ ఉన్న వారందరినీ సర్ ప్రైజ్ చేశారు.

పెద్ది ఐకానిక్ సాంగ్ 'చికిరి చికిరి' హుక్ స్టెప్ వేసి ముంబై ఆడియన్స్ లో మంచి జోష్ నింపారు. జూన్ 4న సినిమా రిలీజ్ కాబోతున్న తరుణంలో చిత్ర యూనిట్ నార్త్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ఈ గ్రాండ్ ఈవెంట్ ను ప్లాన్ చేసింది.

ఈ వేడుకలో చరణ్ డాన్స్ మూమెంట్స్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతోంది. ఈవెంట్ లో రామ్ చరణ్ లుక్ చాలా స్టైలిష్ గా ఉంది. సూట్ వేసుకుని, చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకుని స్టేజ్ మీదకు ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన ఒక స్పోర్ట్స్ పర్సన్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ లో కూడా క్రికెట్, రెజ్లింగ్ బ్యాక్‌డ్రాప్ సీన్స్ హైలైట్ గా నిలిచాయి.

ప్రమోషన్స్ లో భాగంగా స్టేజ్ మీద యాంకర్ రిక్వెస్ట్ చేయడంతో చరణ్ తన పాపులర్ స్టెప్ ను వేసి చూపించారు. చరణ్ బాడీ లాంగ్వేజ్, ఆ డాన్స్ లో ఉన్న స్టైల్ చూసి బాలీవుడ్ మీడియా ప్రతినిధులు సైతం ఫిదా అయ్యారు. దర్శకుడు బుచ్చిబాబు సన ఈ ఈవెంట్ లో చరణ్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు పంచుకున్నారు. సినిమా కోసం చరణ్ కేవలం మూడు నాలుగు నెలల్లోనే బాడీని కంప్లీట్ గా మార్చేసుకున్నారని చెప్పారు.

షూటింగ్ జరిగేటప్పుడు అయ్యప్ప మాల వేసుకోవడం వల్ల పూర్తిగా వెజ్ ఫుడ్ తింటూనే ఇంతటి ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ లో పాల్గొన్నారని చరణ్ డెడికేషన్ ని గుర్తుచేశారు. ఈ కథకు చరణ్ అప్పియరెన్స్ పక్కాగా సెట్ అయిందని, ఆయన మాత్రమే ఈ పాత్రకు న్యాయం చేయగలరని డైరెక్టర్ నమ్మకంగా చెప్పారు.

హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. బుచ్చిబాబును 'ఇండియా రౌడీ డైరెక్టర్' అని పిలుస్తూ ఆమె చేసిన కామెంట్స్ హైలెట్ అయ్యాయి.

చరణ్ తో కలిసి వర్క్ చేయడం తన లైఫ్ లోనే బెస్ట్ మూమెంట్ అని ఆమె చెప్పారు. ఈ సినిమాలో తాను 'అచ్చియ్యమ్మ' అనే ఒక ధైర్యమైన పల్లెటూరి అమ్మాయి క్యారెక్టర్ ప్లే చేస్తున్నానని, దీని కోసం ఉత్తరాంధ్ర యాస నేర్చుకుని మరి డబ్బింగ్ చెప్పానని జాన్వీ వెల్లడించారు. ముంబైలో ఉన్నా కూడా తెలుగు జనాల మధ్య ఉన్నట్లే హోమ్లీగా ఫీలవుతున్నానని చెప్పారు.

'పెద్ది' ట్రైలర్ లాంచ్ తో ముంబైలో ప్రమోషన్స్ గట్టిగానే స్టార్ట్ అయ్యాయి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, రత్నవేలు విజువల్స్ ట్రైలర్ లో రిచ్ గా కనిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించింది. ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ కి తోడు చరణ్ స్టేజ్ డాన్స్ వీడియో కూడా తోడవడంతో సినిమాపై నెట్టింట మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక జూన్ 4న విడుదల కాబోతున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu