Dailyhunt
నాన్న ఈరోజు సీతమ్మతోనా? హనుమంతుడితోనా?

నాన్న ఈరోజు సీతమ్మతోనా? హనుమంతుడితోనా?

Tupaki.com 3 weeks ago

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కథానాయకుడిగా నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా `రామాయణం` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో రాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీత పాత్ంరలో సాయి పల్లవి నటిస్తున్నారు.

ఇంకా రామాయణంలోని వివిధ పాత్రలను పలవురు నటీనటులు పోషిస్తున్నారు.రాముడి, పరశరాముడి పాత్ర కోసం రణబీర్ కపూర్ ఏడాది పాటు సన్నధం అయి రంగంలోకి దిగిన ఆ పాత్రల్లో ఒదిగిపోతున్నారు. తాజాగా ఈ సినిమా ఆన్ సెట్స్ అనుభవాలను రణబీర్ పంచుకున్నారు.

ముఖ్యంగా చిన్నారి రాహాతో తన బాండింగ్ ఎలా ఉంటుంది? అన్నది మరోసారి బయట పడింది. రణబీర్ షూటింగ్ ముగించుకుని ఇంటికి రాగానే చిన్నారి రాహా ఎంతో అమాయకంగా `నాన్న.. ఈరోజు నువ్వు షూటింగ్ సీతమ్మతో చేశావా? లేక హనుమంతుడితో చేశావా? అని అడుగుతుందట. మూడు ఏళ్ల ప్రాయంలోనే రాహాకు రామాయణంలోని పాత్రల పేర్లు తెలియడం, వాటి పట్ల ఆమె ఆసక్తి చూపడం చూస్తుంటే తనకు ఎంతో ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపిస్తుందని రణబీర్ మురిసిపోతూ చెప్పారు. కుమార్తె అడిగే ఈ ప్రశ్నలను బట్టి రామాయణం మన భారతీయుల డీఎన్‌ఏ లోనే ఉంది అని రణబీర్ అభిప్రాయపడ్డారు.

తరతరాలుగా ఈ మహాకావ్యం మన రక్తంలో, మన సంస్కృతిలో ఎంతగా కలిసిపోయిందో రాహా వంటి చిన్నారి మాటలే నిదర్శనమని పేర్కొన్నారు. మన ఉప చేతనలోనే రామాయణ గాథ నిక్షిప్తమై ఉందని, అందుకే మన దేశంలో ప్రతి బిడ్డకు ఈ కథలు అతి త్వరగా చేరువవుతాయని రణబీర్ అభిప్రాయ పడ్డారు. మరి రాముడి గురించి రాహాకి ఎవరు చెప్పి ఉంటారు? అంటే మామ్ అలియాభట్ ట్రైనింగ్ ఇచ్చి ఉండొచ్చని నెటి జనులు పోస్టులు పెడుతున్నారు. అమ్మ కాకపోతే రాహాను చూసుకునే సిబ్బంది పనై ఉండొచ్చని తెలుస్తుంది.

రాముడి పాత్ర ప్రయాణం మొదలైన తర్వాత రణబీర్ కపూర్ లో ఎన్నో మార్పులొచ్చాయి. రణబీర్ ఇప్పుడు సెట్స్ లో నటుడిగా కంటే రామభక్తుడిగా మారిపోయాడని చెప్పొచ్చు. పాత్రలో పరిపూర్ణత కోసం ఆయన తన ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవడం విశేషం. మొత్తానికి రణబీర్ కపూర్ `రామాయణ` చిత్రంపై చూపిస్తోన్న నిబద్ధత అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. తన కుమార్తె రాహా అడిగే ప్రశ్నలే తనలో బాధ్యతను మరింత పెంచాయని తెలుస్తోంది. భావితరాలకు మన సంస్కృతిని సగర్వంగా చాటిచెప్పడమే ఈ చిత్ర లక్ష్యమని తెలుస్తోంది. ఈ విజువల్ వండర్ కోసం ప్రతీ భారతీయుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu