Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నందు 'అగ్లీ స్టోరీ'.. ఆ వివాదాస్పద టైటిల్ అనుకున్నారా?

నందు 'అగ్లీ స్టోరీ'.. ఆ వివాదాస్పద టైటిల్ అనుకున్నారా?

Tupaki.com 1 week ago

టాలీవుడ్‌ లో విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్న నటుడు నందు మరోసారి ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే సినిమా కథ కంటే ముందుగా.. ఆ మూవీకి మొదట అనుకున్న టైటిల్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.

దర్శకుడు ప్రణవ్ స్వరూప్ తాజాగా జరిగిన సినిమా ఈవెంట్‌ లో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ఆ కథను చాలా కాలం క్రితమే నందుకు చెప్పానని.. అప్పట్లో సినిమాకు గాండు అనే టైటిల్ అనుకున్నామని వెల్లడించారు. అయితే ఆ టైటిల్‌ ను ఫిల్మ్ ఛాంబర్‌ లో రిజిస్టర్ చేయడానికి అనుమతి రాలేదని, అందుకే తర్వాత అగ్లీ స్టోరీగా మార్చామని చెప్పారు. ఆ విషయాన్ని చెబుతున్న సమయంలో వేదికపై ఉన్న నందు పెద్దగా నవ్వడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.

ఆ విషయం చెప్పొద్దని నందు ముందే చెప్పా కదా అంటూ నందు నవ్వుతూ చెప్పడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి గాండు అనే పదం.. కాస్త వివాదాస్పదమైనదనే చెప్పాలి. నిజానికి గాండు అనే పదానికి సందర్భాన్ని బట్టి రెండు వేర్వేరు అర్థాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకటి అచ్చ తెలుగు వాడుక భాషకు సంబంధించినది కాగా, మరొకటి హిందీ బూతు పదం. ఏదేమైనా ఆ టైటిల్ పెట్టకపోవడమే మంచిదని చెప్పాలి.

ఇక సినిమా విషయానికి వస్తే.. అగ్లీ స్టోరీ ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌ తో మంచి ఆసక్తి రేకెత్తించింది. ముఖ్యంగా ట్రైలర్‌ లో కనిపించిన నందు పాత్ర ప్రేక్షకులను షాక్‌ కు గురిచేసేలా ఉంది. చిన్నప్పటి నుంచి ప్రేమించిన అమ్మాయి తనను కాకుండా మరొకరిని ఇష్టపడుతుందని తెలుసుకున్న హీరో.. ఆ తర్వాత మానసికంగా ఎలా మారాడు? ప్రేమ పేరుతో ఎంత దారుణానికి దిగజారాడు? అనే అంశాలను దర్శకుడు థ్రిల్లింగ్‌ గా చూపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తున్న అవికా గోర్ సాధారణ గృహిణి పాత్రలో కనిపిస్తోంది. ట్రైలర్‌ లో ఆమె పాత్ర ఎంతో సహజంగా ఉండగా.. భర్త నుంచి మానసిక హింస ఎదుర్కొంటూ కూడా ఎందుకు మౌనంగా ఉంటుందనే ప్రశ్న ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది. మరోవైపు నందు మాత్రం సైకో లక్షణాలున్న వ్యక్తిగా పూర్తిగా భిన్నమైన షేడ్స్‌ లో కనిపించారు. తనకు దక్కని ప్రేమ ఇంకెవరికీ దక్కకూడదనే ఆలోచనతో హీరోయిన్‌ ను బలవంతంగా పెళ్లి చేసుకుని ఆమె జీవితాన్ని నరకంగా మార్చే వ్యక్తిగా ఆయన నటన ట్రైలర్‌ లో హైలైట్ అయింది.

ఇప్పటికే పలు సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసిన నందు.. అగ్లీ స్టోరీలో మరింత ఇంటెన్స్‌ గా కనిపిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్ జానర్‌ ను ఇష్టపడే ప్రేక్షకులకు ఆ సినిమా కొత్త అనుభూతిని ఇవ్వొచ్చని టాక్ వినిపిస్తోంది. విభిన్న కథలు ఎంచుకుంటున్నా.. ఇప్పటివరకు పెద్ద కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న నందుకు అగ్లీ స్టోరీ కీలకం. మే 22న రిలీజ్ కానున్న మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu