Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిజమైన సంపద సృష్టి అంటే తెలుసా ?

నిజమైన సంపద సృష్టి అంటే తెలుసా ?

Tupaki.com 1 week ago

చాలా మంది సంపద అంటే పెద్ద భవనాలు ఆభరణాలు అలాగే లగ్జరీ లైఫ్ అని అనుకుంటారు. తాము ఎంత కాస్ట్లీ లైఫ్ ని లీడ్ చేస్తున్నామో జనాలకు తెలియచేప్పాలని తెగ తాపత్రయపడతారు.

ఈ ప్రయత్నంలో వారు అప్పులు తప్పులూ వరుసగా చేసుకుంటూ పోతూంటారు. అప్పులతో తెచ్చినది ఆడంబరాలు చేసి చూపించేది నిజమైన సంపదగా భావిస్తూంటారు. అంతే కాదు ఎంతసేపూ పక్క వాడిని చూసి వాడి సొమ్ముని చూసి తామూ అలాగే అవాలని భావిస్తూ మనశ్శాంతిని కూడా కోల్పోతారు. మరి సంపద అంటే ఏమిటి ఆర్థిక క్రమశిక్షణ ఏ విధంగా నేర్చుకోవాలి. అది ఏ విధంగా మేలు చేస్తుంది అన్నది ఆర్థిక నిపుణులు చెబుతారు.

కొత్త రూపాయి కంటే :

కొత్త రూపాయి కోసం ఆశపడి ఉన్న రూపాయిని జారవిడుచుకునేవాడు ఎపుడూ సంపన్నుడు కాలేడని అంటారు ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ ఆశల లోకంలో విహరిస్తూ వాస్తవాలు మరచే వారు అంతా కూడా ఆర్ధిక పతనానికి చేరువలోనే ఉంటారు అని అంటున్నారు సంపద అంటే ఉన్న దానిని నిలబెట్టుకోవడం అతి ముఖ్యమని గుర్తు చేస్తున్నారు తమ వద్ద ఉన్న రూపాయిని రెండు రూపాయలు చేసినా అది సంపద కిందకే వస్తుంది. అంతే కానీ అత్యాశకు పోయి దానికి మరో నాలుగు రూపాయలు అప్పులు జత చేర్చి ఆనక తిప్పలు పడూతూ పోవడం వంటివి చేసేవారికి సంపద చేరదు సరికదా దుబారాలతోనే వారి జీవితం నాశనం అవుతుంది అని నిపుణులు చెబుతున్నారు.

ఈ సంగతి గ్రహించాలి :

అవసరాలు ఏమిటో గ్రహించి వాటి మేరకు పరిధులు దాటకుండా ఖర్చు చేసేవారు నిజమైన సంపదని కలిగి ఉన్నారని చెప్పవచ్చు అంటారు. ఆడంబరాలు హెచ్చులకు పోయి తమ జీవితాలని ఎవరితోనో పోల్చుకుంటూ కృత్రిమ ప్రపంచంలో జీవించే వారికి సంపద కంటే సమస్యలే చుట్టముడతాయని అంటున్నారు.

ఆర్థిక లక్ష్యాల మీద :

సంపద సృష్టినాలనుకునే వారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. వారు ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకుని దానిని అనుగుణంగా పనిచేయాలని కోరుతున్నారు. తమ వద్ద ఉన్నదేమిటి, తమ తాహతు ఏమిటి తమ సంపాదన ఎంత అన్నది క్షుణ్ణంగా అవగాహన పెంచుకుని దానిని సక్రమంగా వినియోగించేవారు సంపద సృష్టికర్తలుగా మారుతారు అని అంటున్నారు. ఎవరైతే తమ సంపాదనలో క్రమం తప్పకుండా పదిహేను నుంచి ఇరవై శాతం దాకా మొత్తాలను పెట్టుబడుల్లో పెట్టి ఆదాయాన్ని పెంచుకుంటారో వారు సంపద సృష్టి కర్తలే అని అంటున్నారు. పెట్టిన పెట్టుబడి ఎంత అన్నది పక్కన పెట్టి చిన్న మొత్తాలను అయినా పెట్టుబడి పెడితే అవే దీర్ఘ కాలంలో పెద్ద మొత్తాలుగా మారుతాయి అన్నది గ్రహించాలని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

నిర్మాణాత్మక రుణాలు :

అప్పులు చేయడం అంటే పూర్తిగా తప్పు కాదు, వాటి వల్ల దీర్ఘకాలంలో ఆస్తి సమకూరినా లేక వేరే విధంగా లాభాలు వచ్చినా అటువంటి అప్పులు చేయడంతో తప్పు లేదు కానీ అనవసరంగా అప్పులు చేయడం వ్యక్తిగత రుణాలు క్రెడిట్ కార్డుల ద్వారా అప్పులు చేయడం వంటివి కూడా ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేస్తాయని గుర్తు చేస్తున్నారు.

తీవమైన ఒత్తిడి :

ఈ రోజున ప్రతీ వారి ఆర్థిక పరిస్థితుల మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంది అని అంటున్నారు. దానికి కారణం జీవన వ్యయం నానాటికీ అధికం అవుతోంది. అదే సమయంలో సమాజానికి ప్రభావితం అయ్యే వారే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. దాంతో వారిలో ఆరాటాలూ కోరికలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. దాంతో ఆర్ధికంగా నిలకడ లేని వైఖరి పెరుగుతోంది. అయింతే తమను తాను నియంత్రించుకుని వాస్తవికంగా ఉన్న వారు ఎవరైనా చిన్న మొత్తలతో పెట్టుబడులు పెట్టినా కూడా వారే అసలైన సంపన్నులు అని సంపద తయారీ వారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu