Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిర్మాత ఎం.ఎస్.రాజును ప్రభాస్ హర్ట్ చేసారా?

నిర్మాత ఎం.ఎస్.రాజును ప్రభాస్ హర్ట్ చేసారా?

Tupaki.com 1 week ago

టాలీవుడ్ సీనియర్ నిర్మాత ఎం.ఎస్.రాజు.. రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన `వర్షం` సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

ప్రభాస్ కెరీర్‌ను మలుపు తిప్పిన ఈ చిత్రం వెనుక ఆసక్తికరమైన జ్ఞాపకాలు ఉన్నాయని ఎం.ఎస్.రాజు తాజా ఇంటర్వ్యూలో షేర్ చేసారు. ఆరంభంలో వీరిద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయనే వార్తలపై ఆయన స్పందిస్తూ.. ఒక క్రియేటర్‌గా తానూ కొంత హర్ట్ అయిన మాట వాస్తవమేనని.. అయితే అది కేవలం ప్రభాస్ అడిగిన ఒక చిన్న ప్రశ్న వల్ల మాత్రమేనని వివరించారు.

ప్రభాస్‌తో సినిమా చేయాలని నిర్ణయించుకున్న సమయంలో ఆయన అడిగిన ఒక ప్రశ్న నిర్మాతగా రాజుగారిని ఆలోచనలో పడేసింది. అయితే ఆ సమయంలో ఆయన భార్య జోక్యం చేసుకుని, సూర్యనారాయణ రాజు, కృష్ణంరాజుల కుటుంబ నేపథ్యాన్ని గుర్తు చేస్తూ సినిమా చేయమని ప్రోత్సహించారట. ప్రభాస్ అడిగిన ఆ చిన్న ప్రశ్నకు రాజుగారు కొంత నొచ్చుకున్నా కానీ.. ఆయన భార్య వచ్చి కాఫీ ఇచ్చి.. ఇద్దరినీ కలిపి మాట్లాడించేయడంతో ఆ అలకలన్నీ ఇట్టే సమసిపోయాయని రాజుగారు గుర్తు చేసుకున్నారు. కృష్ణ గారి ఫ్యామిలీ నుండి వచ్చిన మహేష్ బాబుకు ఒక్కడు` సినిమా ఎంతటి స్టార్‌డమ్ ఇచ్చిందో, ప్రభాస్ ఫ్యామిలీ నుండి కూడా అలాంటి హిట్టే వస్తుందని ఆమె ముందే ఊహించారట.

ఆ తర్వాత ప్రభాస్ .. ఎం.ఎస్.రాజుల మధ్య ఒక అద్భుతమైన అనుబంధం ఏర్పడింది. ప్రభాస్‌ను తాను `అబ్బాయి` అని పిలిచేవాడినని, మా మధ్య తండ్రి కొడుకుల వంటి అండర్ స్టాండింగ్ ఉండేదని ఆయన తెలిపారు. ప్రభాస్ తనను ఎంతగా నమ్మేవాడంటే, ``దూకేయ్ అంటే దూకేసేవాడు, పరిగెత్తు అంటే పరిగెత్తేవాడు, డాన్స్ చెయ్ అంటే డాన్స్ చేసేవాడు`` అంటూ ప్రభాస్ అంకితభావాన్ని ఆయన కొనియాడారు. తనను ప్రభాస్ పూర్తిగా నమ్మాడని.. ఆ నమ్మకమే `వర్షం` వంటి బ్లాక్ బస్టర్ హిట్ రావడానికి కారణమైందని రాజు గారు వెల్లడించారు.

ప్రస్తుతం ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో పెద్ద స్టార్ అయినా కానీ.. రాజుగారికి మాత్రం ఆయన ఇప్పటికీ తన సొంత కొడుకు లాంటి ఆప్తుడే. ప్రభాస్ ఇప్పుడు ఎంతో ఎత్తుకు ఎదిగాడు కానీ, నా దృష్టిలో అతను ఇంకా నా అబ్బాయి లాంటివాడే! అని ఎం.ఎస్.రాజు భావోద్వేగంగా చెప్పారు. ఆరోజుల్లో ఏర్పడిన ఆ అండర్ స్టాండింగ్ వల్లే ప్రభాస్ కెరీర్‌లో `వర్షం` ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోయిందని.. ప్రభాస్ తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప చిత్రమిదని ఆయన పేర్కొన్నారు.

ప్రభాస్ -ఎం.ఎస్.రాజుల మధ్య ఈగో ఇష్యూస్ ఉన్నాయనే గుసగుసలన్నీ కేవలం పుకార్లేనని ఈ ఇంటర్వ్యూతో స్పష్టమైంది. వారి మధ్య ఉన్నది కేవలం వృత్తిపరమైన గౌరవం మాత్రమే కాదు.. అంతకు మించిన ఆత్మీయ అనుబంధమని అర్థమవుతోంది. ఒక క్రియేటర్‌గా చిన్న `హర్ట్` ఉన్నా.. అది ఒక గొప్ప హిట్ కోసం పునాది వేసిందని... ప్రభాస్ అంకితభావమే అతడిని నేడు గ్లోబల్ స్టార్‌గా నిలబెట్టిందని రాజుగారు తన మాటల్లో వ్యక్తం చేశారు. అయితే ప్రభాస్ తో ఎం.ఎస్.రాజు నిర్మించిన పౌర్ణమి ఎంత పెద్ద డిజాస్టర్ తెలిసిందే. ఆ తర్వాత కలిసి సినిమా చేయలేదు. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ నెక్ట్స్ సినిమా ఎప్పుడు? అనేదానికి ఇంకా ఆయన క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu