Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
OG 2: సుజిత్ ప్లాన్ ఏంటీ?

OG 2: సుజిత్ ప్లాన్ ఏంటీ?

Tupaki.com 1 week ago

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ ఫ్యాన్స్ ను ఊపేసిన విషయం తెలిసిందే. పవన్‌ ను స్టైలిష్ గ్యాంగ్‌ స్టర్ గా చూపిస్తూ దర్శకుడు సుజీత్ రూపొందించిన ఆ యాక్షన్ డ్రామా విడుదలైన మొదటి రోజు నుంచే బ్లాక్‌ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, మాస్ ఎలివేషన్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిన ఆ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించగా, సంగీత దర్శకుడు తమన్ అందించిన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో హైలైట్‌ గా నిలిచింది.

పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌ గా నటించగా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో తనదైన స్టైల్‌ లో మెప్పించారు. అలాగే ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో కనిపించారు. క్లైమాక్స్‌ లోనే సీక్వెల్‌ కు హింట్ ఇవ్వడంతో అప్పటి నుంచే ఓజీపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ముంబై బ్యాక్‌ డ్రాప్‌ లో తెరకెక్కిన ఓజీలో పవన్‌ ను చూపించిన తీరు అభిమానులకు కొత్త అనుభూతిని ఇచ్చింది.

ముఖ్యంగా ఆయన బాడీ లాంగ్వేజ్, స్టైలిష్ మేనరిజమ్స్, సుజీత్ మేకింగ్ స్టైల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సాహో తర్వాత మరోసారి తన టెక్నికల్ విజన్‌ ను సుజీత్ స్ట్రాంగ్ గా ప్రూవ్ చేసుకున్నారనే అభిప్రాయం వినిపించింది. అయితే ఇప్పుడు ఓజీ 2 పనులు ప్రారంభమైనట్లు వార్తలు వస్తుండటంతో.. ఒక్కసారిగా ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతుందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మొదటగా నానితో బ్లడీ రోమియో ప్రాజెక్ట్ ప్లాన్ చేసిన సుజీత్, డేట్స్, ఇతర కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆలస్యమవడంతో ప్రస్తుతం పూర్తిగా ఓజీ 2పై ఫోకస్ పెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఈసారి కథను మరింత భారీ స్థాయిలో డిజైన్ చేస్తున్నారట. కేవలం మొదటి భాగానికి సీక్వెల్ గా కాకుండా, పాత్రల స్కేల్, యాక్షన్ సెటప్, ఎమోషనల్ డ్రామా అన్నీ నెక్స్ట్ లెవెల్‌ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

ముఖ్యంగా పవన్ రోల్ ను లోకల్ డాన్ స్థాయి నుంచి గ్లోబల్ గ్యాంగ్‌ స్టర్ రేంజ్‌ కు ఎలివేట్ చేసే ఆలోచనలో సుజీత్ ఉన్నారని చర్చ జరుగుతోంది. మొదటి పార్ట్ లో మిగిలిపోయిన కొన్ని ప్రశ్నలకు సీక్వెల్‌ లో సమాధానాలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అలాగే కొత్త పాత్రలు, భారీ ట్విస్టులు, స్టైలిష్ యాక్షన్ బ్లాక్స్ ఈసారి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని ప్రచారం జరుగుతోంది.

ముఖ్యంగా స్క్రీన్‌ ప్లే విషయంలో అభిమానులు ఊహించని షాకింగ్ ట్విస్ట్ లు ఉండబోతున్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ - సుజీత్ కాంబినేషన్ టాలీవుడ్‌ లో ఒక బ్రాండ్‌ గా మారింది. దీంతో ఓజీ 2పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మొదటి భాగాన్ని మించి మరింత స్టైలిష్, మరింత వైలెంట్, మరింత గ్లోబల్ రేంజ్ యాక్షన్ డ్రామాగా ఆ సీక్వెల్ తెరకెక్కితే బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమనే అభిప్రాయం అభిమానుల్లో కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu