Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓటమిని ఒప్పుకోని విజేతలు!

ఓటమిని ఒప్పుకోని విజేతలు!

Tupaki.com 2 weeks ago

జీవితం ఎక్కడి నుంచి మొదలైందన్నది ముఖ్యం కాదు. గమ్యం ఎంత గొప్పదన్నదే అత్యంత ముఖ్యం. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని.. ప్రతి అడుగులోనూ అవమానాలను చవి చూసినా?

ఎప్పుడూ వెనకడుగు వేయని కొద్దిమంది వ్యక్తులు మాత్రమే చరిత్రను తిరగరాస్తుంటారు. అలాంటి దిగ్గజాల ప్రయాణమే నేడు కోట్లాది మందికి స్ఫూర్తిని ఇస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకప్పుడు బస్ కండెక్టర్‌గా పనిచేసారు. ఏమాత్రం క్రమ శిక్షణ లేని జీవితాన్ని గడిపేవారు. కానీ నేడు ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను ఏలుతున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ వాచ్‌మన్‌గా వృత్తిని ప్రారంభించి ఇండస్ట్రీలో అద్భుత నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

అక్షయ్ కుమార్ చెఫ్‌గా శ్రమించి బాలీవుడ్ కింగ్ గా ఎదిగారు. దేశం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిన్నతనంలో న్యూస్ బాయ్‌గా పనిచేసినవారే. నటుడు బొమన్ ఇరానీ ఒక హోటల్‌లో వెయిటర్‌గా పనిచేసి ప్రతిభతో వెండితెరపై నటుడిగా ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అలాగే మోటి వేషనల్ స్పీకర్ సందీప్ మహేశ్వరి కాలేజ్ డ్రాప్ ఔట్‌గా జీవితాన్ని ప్రారంభించి నేడు కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచారు.రాజకీయ రంగంలో దేశ అత్యున్నత స్థానానికి ఎదిగిన నరేంద్ర మోదీ చిన్నతనంలో రైల్వే స్టేషన్‌లో టీ అమ్ముకుంటూ ఎన్నో కష్టాలను అనుభవించారే.

భారతీయ క్రికెట్ చరిత్రను మార్చేసిన మహేంద్ర సింగ్ ధోనీ సాధారణ రైల్వే ఉద్యోగి నుంచి ప్రపంచం మెచ్చిన క్రికెట్ లెజెండ్‌గా మారారు. ధీరుభాయ్ అంబానీ గ్యాస్ స్టేషన్‌లో అటెండెంట్‌గా పనిచేసి పట్టుదలతో రిలయన్స్ అనే భారీ సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరందరి ప్రయాణంలో వారి లక్ష్యాలను చూసి హేళన చేసిన వారు.. నిరుత్సాహపరిచిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ వీరిలో ఎవ్వరూ ఓటమిని ఒప్పుకోవడానికి సిద్ధపడలేదు. పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా? తమపై తమకున్న నమ్మకంతో కల కోసం అలుపెరగని పోరాటమే చేసారు.

సామాన్యుడికి -నిజమైన విజేతకు మధ్య ఉండే అతి పెద్ద తేడా కేవలం పట్టుదల మాత్రమే. ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ? ఎదుర్కొని గెలుపే లక్ష్యంగా ముందుకు సాగితే అసాధ్యమైనది కూడా సుసాధ్యమవుతుందని ఈ మహానుభావుల జీవితాలు నిత్యం గుణపాఠం నేర్పుతూనే ఉంటాయి. ఈ స్పూర్తిదాయకమైన ప్రయాణాల వెనుక ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే? సక్సెస్ అనేది అనుకున్నంత ఈజీ కాదు. ప్రతి విజయవంతమైన వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు, లెక్కలేనన్ని వైఫల్యాలు, సమాజం నుంచి ఎదురైన హేళనలు ఉంటాయి. ఆ కష్టాలనే అనుకూలంగా మలుచుకుని అడ్డంకులను తొలకరింపులుగా భావించిన వారు మాత్రమే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.

ప్రస్తుత పరిస్థితి ఏదైనా సరే? కలలపై ఉండే నమ్మకమే గమ్యాన్ని నిర్ణయిస్తుంది. ప్రతికూలతలు మిమ్మల్ని వెనక్కి లాగాలని చూసినప్పుడు పట్టుదలతో ముందుకు అడుగు వేస్తే విజయతీరాలను చేరుకోవడం ఖాయం. చరిత్రను మార్చిన మహానుభావుల బాటలో నడుస్తూ జీవితాన్ని అద్భుతమైన విజయగాథగా మలచుకోవడమే యువత ముందున్న సవాల్.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu