Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాన్ ఇండియా పిచ్చిలో లేకుండా బుచ్చిబాబు క్లారిటీ

పాన్ ఇండియా పిచ్చిలో లేకుండా బుచ్చిబాబు క్లారిటీ

Tupaki.com 1 week ago

ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ ఏ స్థాయిలో నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నార్త్ మార్కెట్ పై కన్నేస్తున్నారు.

అయితే, ఈ రేసులో అందరిలా ఆలోచించకుండా తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు దర్శకుడు బుచ్చిబాబు సన. రామ్ చరణ్ తో త్వరలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ 'పెద్ది' గురించి, హిందీ మార్కెట్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.

హిందీలో ఓపెనింగ్స్ పై మీ అంచనా ఏంటి అని అడుగగా తనకు హిందీ మాట్లాడటమే రాదని, అలాంటప్పుడు తానేం ఆలోచిస్తానని ఆయన చాలా ప్రాక్టికల్ గా చెప్పారు. బుచ్చిబాబు కేవలం హిందీ మార్కెట్ కోసమని ప్రత్యేకంగా కథలు రాసే ఆలోచనలో లేరని అర్ధమవుతుంది. పాన్ ఇండియా హిట్ కొట్టాలనే ఒత్తిడితో సినిమాలు తీయడం కంటే, మన నేటివిటీకి తగ్గ కథలను బలంగా తెరకెక్కించడమే నమ్ముతున్నట్లు చెప్పకనే చెప్పారు.

బడ్జెట్ అనేది ఎప్పుడూ కంట్రోల్ లోనే ఉంటుందని, కథ డిమాండ్ చేసిన మేరకే ఖర్చు పెడతామని చెప్పారు. ఒక ప్రాంతీయ కథను ఎంత నిజాయితీగా చెప్తే, అది అన్ని భాషల ప్రేక్షకులకు అంత బాగా కనెక్ట్ అవుతుందని బుచ్చిబాబు ఒక క్లారిటీతో ఉన్నట్లు అర్ధమవుతుంది. నిజానికి ఇటీవల కాలంలో బాలీవుడ్ లో క్లిక్ అయిన సౌత్ సినిమాలు గమనిస్తే ఈ విషయం క్లియర్ గా అర్థమవుతుంది. 'కాంతార', 'కార్తికేయ 2' వంటి చిత్రాలు పక్కా లోకల్ ఫ్లేవర్, దైవత్వంతో కూడిన కాన్సెప్ట్స్ తోనే నార్త్ లో భారీ వసూళ్లు సాధించాయి.

హిందీ ప్రేక్షకులను మెప్పించడానికి అక్కడ వాతావరణాన్ని అనుకరించాల్సిన అవసరం లేదు. మన సంస్కృతి, కంటెంట్ లో ఒరిజినాలిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇతర భాషల జనాలు కూడా బ్రహ్మరథం పడతారు. బుచ్చిబాబు కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తున్నట్లు తెలుస్తోంది. 'ఉప్పెన' లాంటి పక్కా లోకల్ ఎమోషనల్ హిట్ తర్వాత బుచ్చిబాబు చేస్తున్న 'పెద్ది' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు కూడా ఒక పక్కా బడ్జెట్ ప్లాన్ తోనే ముందుకు వెళ్తున్నట్లు చిత్ర యూనిట్ చెప్తోంది.

నార్త్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా హిందీ ఫ్లేవర్ యాడ్ చేయకుండా, మన మట్టి కథనే నమ్ముకుని ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇమేజ్ కి ఈ లోకల్ నేటివిటీ తోడైతే వచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. ఇక బుచ్చిబాబు కామెంట్స్ పాన్ ఇండియా పిచ్చిలో ఉన్న చాలా మందికి ఒక మెసేజ్ అని చెప్పవచ్చు. భాష రానప్పుడు ఆడియన్స్ పల్స్ పట్టుకోవడం కష్టమని ఒప్పుకోవడం ఆయన హుందాతనాన్ని చూపిస్తోంది. మన లోకల్ కంటెంట్ ని నమ్ముకుంటే చాలు, సక్సెస్ అదే వస్తుందని ఆయన నమ్ముతున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రయోగం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. ఒకవేళ ఈ సినిమాకు మంచి టాక్ వస్తే, ఎలాంటి హంగులు లేకుండానే మిగతా భాషల్లో కూడా ఆటోమేటిక్ గా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu