Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాత స్టేట్మెంట్ తో హీరోని రప్పాడించేస్తున్నారు !

పాత స్టేట్మెంట్ తో హీరోని రప్పాడించేస్తున్నారు !

Tupaki.com 2 weeks ago

డిజిటల్ యుగంలో సెలబ్రిటీలు ఎప్పుడో మాట్లాడిన మాటలు అంత సులభంగా కాలగర్భంలో కలిసిపోవు. సమయం చూసి వారిపైనే రివర్స్ అస్త్రాలుగా మారే ప్రమాదం ఉంది.

ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ప్రతిష్టాత్మక యాక్షన్ ఫ్రాంచైజీ `డాన్ 3` చుట్టూ వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ నుంచి రణవీర్ సింగ్ తప్పుకోవడం దర్శక, నిర్మాతలు ఫిర్యాదు చేయడం..ప్రతిగా సంఘాలు యాక్షన్ దిగిన ఎపిసోడ్ వ్యవహారమంతా తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో రణవీర్ సింగ్ అన్న ఒక మాటను నెటిజన్లు తవ్వి తీశారు.

`నాకు ఒక్క అవకాశం ఇవ్వండి` అంటూ ఆయన కోరిన పాత స్టేట్‌మెంట్‌ను పట్టుకుని ఇంటర్నెట్ వేదికగా హీరోని నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. షారూఖ్ ఖాన్ లాంటి గ్లోబల్ స్టార్ స్థానంలో రణ్‌వీర్ సింగ్‌ను కొత్త డాన్ గా ప్రకటించినప్పటి నుండి సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల దర్శకుడు ఫర్హాన్ అక్తర్ నిర్మాణ సంస్థ (ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్)కు , సినీ కార్మికుల సమాఖ్య (FWICE)కు మధ్య తలెత్తిన అంతర్గత వివాదాలు ప్రాజెక్ట్‌ను మరింత గందరగోళంలోకి నెట్టాయి.

ఈ వివాదాల కారణంగా సినిమా ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తుండగా? ట్రోలర్స్ అందరి దృష్టి రణ్‌వీర్ సింగ్‌పైనే పడింది. ఇండస్ట్రీ సాంకేతిక సమస్యల కంటే హీరో కాస్టింగ్ గురిచే నెటిజన్లు రఫ్పాడించడం మొదలుపెట్టారు. ఈ వివాదాల నడుమ మళ్లీ వైరల్ అవుతున్న ఆ పాత వీడియోలో రణ్‌వీర్ సింగ్ నాకు ఒక్క అవకాశం అయితే ఇవ్వచ్చుగా (ఏక్ మౌకా తో బన్తా హై) అని చాలా వినమ్రంగా కోరడం కనిపిస్తుంది. నటుడిగా డాన్ లాంటి ఐకానిక్ పాత్రను పోషించాలనేది తన చిరకాల కోరికని ఆయన అప్పట్లో అన్నారు.

నెటిజన్లు ఆ పాత మాటలను నెగిటివ్ కోణంలో వాడుతున్నారు. ఆయన బతిమిలాడి, అడిగి మరీ ఈ పాత్రను దక్కించుకున్నారా? అంటూ కొందరు ఎద్దేవా చేస్తుంటే.. మరికొందరు `ఒక్క అవకాశం` కాస్తా సినిమా ఒరిజినల్ క్రేజ్‌ను , వారసత్వాన్ని దెబ్బతీసేలా ఉందంటూ విమర్శిస్తున్నారు. ఎక్స్ , ఇన్‌స్టాగ్రామ్, రెడిట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పాత స్టేట్‌మెంట్‌ను వాడుకుంటూ క్రియేట్ చేస్తున్న మీమ్స్ తెగ హల్‌చల్ చేస్తున్నాయి. షారూఖ్ ఖాన్ కి ఉన్న సహజసిద్ధమైన గంభీరత్వం, స్టైల్‌తో పోలుస్తూ.. రణ్‌వీర్ సింగ్ అతి-ఉత్సాహాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు.

ఒక నటుడు ఆశపడ్డాడని ఇంతటి ప్రతిష్టాత్మకమైన క్యారెక్టర్‌ను ఆయన చేతిలో పెట్టడం ఎంతవరకు న్యాయం అంటూ నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఈ పాత క్లిప్ ఇప్పుడు రణ్‌వీర్ కాస్టింగ్ అర్హతను ప్రశ్నించే ప్రధాన ఆయుధంగా మారింది. రణవీర్ సింగ్ ఎంత ప్రతిభావంతుడైన నటుడైనప్పటికీ ఇండస్ట్రీ గొడవలు ..ఇటు సోషల్ మీడియాలో వస్తున్న ఆన్‌లైన్ నెగిటివిటీ రణవీర్ ని ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి. ఒకప్పుడు సినిమాపై, పాత్రపై తనకున్న అమితమైన ప్రేమను చాటడానికి చేసిన వ్యాఖ్యలు నేడు ఆయన్ని పబ్లిక్ రిడిక్యూల్ చేయడానికి ఉపయోగపడటం దురదృష్టకరం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu