Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పరిమళ నత్వానీకి బై బై...ఏపీకి చేసిందేమీ లేదు !

పరిమళ నత్వానీకి బై బై...ఏపీకి చేసిందేమీ లేదు !

Tupaki.com 1 week ago

రాజ్యసభ కోటాలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సీట్లు పొందే వారు కార్పోరేట్లు పారిశ్రామికవేత్తల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దగా ఉపయోగపడేది లేదు అన్నది తెలిసిందే.

ఆరేళ్ల పాటు పెద్దల సభలో వారు హాయిగా హోదాను అందుకుంటున్నారు. తమ స్వీయ ప్రయోజనాలు తప్పించి తాము ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం గురించి అక్కడి సమస్యల గురించి కనీసంగా అయినా పార్లమెంట్ లో ప్రస్తావించని వారిని కొనసాగించాలా అన్న చర్చ అయితే చాలా కాలంగా ఉంది. ఇపుడు ఒక ఎంపీ గారి విషయంలో దీని మీద సీరియస్ గానే డిస్కషన్ సాగుతోంది. ఆయన ఎవరో కాదు పరిమళ్ నత్వానీ. ఈయన స్థాయి చాలా పెద్దదే. రిలయన్స్ గ్రూప్ కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్ పరిమళ్ నత్వానీ కొనసాగుతున్నారు. ఆయన ఏపీలో 2021 జూన్ 21 నుంచి రాజ్యసభ సభ్యుడిగా వైసీపీ తరఫున వ్యవహరిస్తున్నారు. అంతకు ముందు జార్ఖండ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ కోటాలో ఆయన రెండు సార్లు నెగ్గారు. టోటల్ గా చూస్తే 18 ఏళ్ళ నుంచి నత్వానీ రాజ్యసభ మెంబర్ గా ఉన్నారు అన్న మాట.

ఈసారి ఏపీ హ్యాండ్ :

ఇక పరిమళ్ నత్వానీ పదవీ కాలం ఈ ఏడాది జూన్ 21తో ముగియనుంది. గతంలో అయితే ఆయన వైసీపీ ప్రభుత్వంలో జగన్ మద్దతుతో రాజ్యసభ మెంబర్ అయ్యారు. ఇపుడు ఏపీలో చూస్తే కూటమి ప్రభుత్వం ఉంది. రాజకీయం మొత్తం మారిపోయింది. అయితే ఆయనకు కేంద్ర బీజేపీ పెద్దలతో సన్నిహిత పరిచయాలు ఉన్నాయి. దాంతో పాటు ఆయన గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారు కావడంతో ఆయనను బీజేపీ కోటా కింద ఏపీ నుంచి పంపిస్తారు అని ఇప్పటిదాకా ప్రచారం సాగింది. కానీ లేటెస్ట్ గా వస్తున్న వార్తలు చూస్తూంటే పరిమళ్ నత్వానీకి ఏపీ బై బై చెప్పేస్తోంది అని అంటున్నారు.

కూటమి ఖాతాలోకి :

నత్వానీ రాజ్యసభ సీటు ఇపుడు కూటమి ఖాతాలోకి వెళ్ళింది. దాంతో చంద్రబాబు దీని మీద కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆయన అనుకుంటేనే తప్ప రాజ్యసబ్య్హకు నత్వానీ వెళ్ళే పరిస్థితి ఉండదు. అయితే ఎక్కడో గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఆయనను గతంలో వైసీపీ కోటాలో నెగ్గిన మనిషిని ఏపీకి ఏ మాత్రం న్యాయం ఆయన వల్ల లేదనుకున్న పరిస్థితుల్లో ఎందుకు ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాల్సిన అవసరం ఉందా అన్న చర్చ అయితే కూటమిలో చర్చ సాగుతోంది అని అంటున్నారు. ఇక బీజేపీ కోటాలో ఒక ఎంపీ సీటు ఇచ్చినా అది ఏపీకి చెందిన వారికి ఇస్తే లాభం అన్న చర్చ కూడా ఉంది. బీజేపీ తరఫున ఎంతో మంది రేసులో ఉండగా నత్వానీని తెచ్చి ఎంపీగా చేయడం వల్ల పార్టీకి ప్రత్యేకంగా కలిగే మైలేజ్ ఏంటి అన్న చర్చ సాగుతోంది అని అంటున్నారు.

ఢిల్లీ స్థాయి బంధాలు :

అయితే నత్వానీ ఏమీ ఆషా మాషీ లీడర్ కాదు. ఆయనకు దేశంలోని అగ్రనేతలందరితోనూ సత్సంబంధాలు ఉన్నాయి. ఇక ఏపీ సీఎం చంద్రబాబు గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రిలయన్స్ పెట్టుబడుల విషయంలో పరిమళ్ నత్వానీ అమరావతికి వచ్చేవారు. అలా ఆయనకు ఏపీ పెద్దలతోనూ కూటమి సారధులతోనూ మంచి సాన్నిహిత్యమే ఉంది. అయినా సరే ఆయనకు ఈసారి టికెట్ దక్కడం కష్టమే అని అంటున్నారు. నాలుగు సీట్లు ఖాళీ అయితే నలభై మంది దాకా ఆశావహులు ఉండడం అతి పెద్ద పోటీ సాగడంతో నత్వానీకి ఏ విధంగానూ సర్దుబాటు చేయలేరని అంటున్నారు. పైగా పొరుగు రాష్ట్రానికి చెందిన వారికి ఒక సీటు వదులుకోవడం ఈ కీలక సమస్యంలో అసలు కుదిరే వ్యవహారం కాదని అంటున్నారు. ఆయన విషయంలో మరో బిగ్ షాట్ ముఖేష్ అంబానీ పట్టుబడితే చంద్రబాబు ఇవ్వాల్సి రావొచ్చు ఏమో కానీ ప్రస్తుతానికి అయితే ఆయన పేరు లేనట్లే అని అంటున్నారు.

మళ్ళీ అక్కడికే :

ఇదిలా ఉంటే పరిమళ్ నత్వానీ తనకు రెండు సార్లు చోటి ఇచ్చిన జార్ఖండ్‌ నుంచే పోటీ చేస్తారు అని అంటున్నారు. జార్ఖండ్ అసెంబ్లీలో ఉన్న రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా వాడుకుని అక్కడ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు కసరత్తు చేస్తున్నారు అని అంటున్నారు. జార్ఖండ్‌లో ఉన్న బీజేపీ దాని మిత్రపక్షాల మద్దతుతో పాటు అధికార పక్షంలోని కొందరు అసంతృప్త ఎమ్మెల్యేల మొదటి ప్రాధాన్యత ఓట్లను చీల్చి అక్కడ సీటు దక్కించుకోవాలనే వ్యూహంతో నత్వానీ ఉన్నారని అంటున్నారు. ఒకవేళ జార్ఖండ్ కాకపోతే తన సొంత రాష్ట్రమైన గుజరాత్ రాజకీయాలపైన కూడా నత్వానీ ఫోకస్ పెట్టారు అని అంటున్నారు.

ఏపీకి ఏమి చేశారు :

ఇదే ప్రశ్న ఇపుడు నత్వానీ విషయంలో వస్తోంది. ఆయన ఎంపీగా ఏపీ గురించి పెద్దగా మాట్లాడింది పనిచేసింది లేదని అంటున్నారు. ఆయన తన ఆరేళ్ళ పదవీ కాలంలో తన సొంత రాష్ట్ర గుజరాత్ గురించిన ప్రశ్నలే వేశారని గుజరాత్ పరిధిలోని గిర్ సింహాల రక్షణ గురించి గుజరాత్ జాతీయ రహదారుల గురించి అడిగిన ప్రశ్నలే ఎక్కువని గుర్తు చేస్తున్నారు. ఆఖరుకు తన ఎంపీ లాడ్స్ నిధులను ఏపీలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు చేయడంలో కూడా నత్వానీ ముందుకు రాలేదని అంటున్నారు. ఆయన భారీ పారిశ్రామికవేత్త. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు తన వంతుగా ఏమీ కృషి చేయలేదని అంటున్నారు. దాంతో నత్వానీకి ఏపీతో రాజ్యసభ బంధం కట్ అయింది అని అంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu