Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ ఫోకస్...కీలక నియోజకవర్గాల్లో భారీ చేంజ్ !

పవన్ ఫోకస్...కీలక నియోజకవర్గాల్లో భారీ చేంజ్ !

Tupaki.com 1 week ago

నసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలో పూర్తి స్థాయిలో ప్రక్షాళనకు దిగారు. ఎవరు పనిచేస్తున్నారో గుర్తించేందుకు సభ్యత్వ నమోదుని ఆయన ఉపయోగించుకున్నారు.

నెలల తరబడి సాగిన సభ్యత్వ నమోదులో కష్టపడి మెంబర్ షిప్ డ్రైవ్ ని నిర్వహించడమే కాదు పార్టీని పటిష్టం చేసిన వారి వివరాలను అధినాయకత్వం నివేదికల రూపంలో తెప్పించుకుంది. అలాగే పార్టీ నేతలతో జనాలతో మమేకం అవుతున్న వారి గురించి కూడా పూర్తి సమాచారాన్ని దగ్గర ఉంచుకుంది. వీటన్నింటి ఆసరాతో ఇపుడు పవన్ పార్టీలో ఎవరేమిటి అన్నది పూర్తిగా స్టడీ చేస్తున్నారు అని అంటున్నారు. దాంతో పార్టీకి పని చేసిన వారికి అందలాలు అందించడం ద్వారా పట్టించుకోని వారిని పక్కన పెట్టడం అనే కఠిన విధానాన్ని ఆయన అనుసరించబోతున్నారు అంటున్నారు.

సంస్థాగత నిర్మాణం కోసం :

ఏ పార్టీకైనా సంస్థాగత నిర్మాణం అన్నది చాలా అవసరం. అదే పార్టీని నిలబెడుతుంది. జనసేన ఇపుడు అధికారంలో ఉంది. దాంతో పార్టీని కూడా బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారు. పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ గా చేసుకుంటే రానున్న స్థానిక ఎన్నికల నుంచి 2029 ఎన్నికల దాకా జనసేన జెండా గట్టిగా ఎగిరేందుకు వీలు ఉంటుందని భావిస్తున్నారు అందుకే పవన్ ఇపుడు పనిచేసే వారికి ప్రమోషన్లు ఇచ్చేందుకు చేయని వారిని పనిష్ మెంట్లు ఇచ్చేందుకు రెడీ అయ్యారని అంటున్నారు.

గోదావరి జిల్లాల నుంచే :

జనసేనకు గోదావరి జిల్లాలు బలమైన స్థావరాలుగా ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలలోనే 2024 ఎన్నికల్లో జనసేన అధిక సీట్లు గెలుచుకుంది. పొత్తులలో భాగంగా మిగిలిన సీట్లు వదిలేసుకున్నా కూడా అక్కడ కూడా ఇంచార్జిలను పెట్టి పార్టీని విస్తృత పరుస్తోంది. ఈ నేపధ్యంలో జనసేన ఇంచార్జిలుగా ఎవరు బాగా చేస్తున్నారు అన్నది గోదావరి జిల్లాలలో నివేదికను బట్టి చూసి మరీ భారీగానే చేంజెస్ చేయబోతోంది అని అంటున్నారు. దాంతో కీలకమైన నియోజకవర్గాలలో పార్టీ ఇంచార్జిలలో వేటు చోటు ఎవరికి అన్నది ఇపుడు చర్చగా సాగుతోంది.

ఆ సీట్లలో సీన్ మారుతోంది :

ఇక గోదావరి గోపాలపురం, చింతలపూడి నియోజకవర్గాల్లో పాత ఇంచార్జ్‌లను మార్చి కొత్త వారికి అవకాశం ఇస్తారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం గోపాలపురం నియోజకవర్గం జనసేన నుంచి ఇంచార్జ్‌గా ఉన్న సువర్ణరాజును తొలగిస్తారని అంటున్నారు. ఆయన ప్లేస్ లో జనసేన వీర మహిళగా ఉన్న ఫాతిమారాణికి చాన్స్ దక్కుతుందని ప్రచారం అయ్హితే ఉంది. అలాగే చింతలపూడి నియోజకవర్గంలో జనసేన ఇంచార్జిగా ఉన్న మేక ఈశ్వరయ్యను తప్పిస్తరని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పోస్టుకు జనసేన ఒక ఎన్నారైని ఎంపిక ఉంచిందని చెబుతున్నారు. ఇక్కడ కొత్త ఇంచార్జిలను తీసుకోవడానికి పనితీరు సామాజిక సమీకరణలతో పాటు మహిళా ప్రాధాన్యత పవన్ పరిగణనలోకి తీసుకున్నారని అంటున్నారు.

అక్కడ కూడా మార్పులు ఖాయం :

అంతే కాకుండా ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం, అలాగే తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలోనూ కొత్త ఇంచార్జిలు జనసేన నుంచి వస్తారని జనసేన వర్గాలలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తూ సభ్యత్వ నమోదు విషయంలో చురుకైన పాత్ర పోషించిన వారికే ఇక్కడ ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. ఎవరు కష్టపడుతున్నారో ఇప్పటికే పవన్ కి పూర్తి అవగాహన ఉందని అంటున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు మొత్తం జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఉన్న వాతావరణం పార్టీ నేతల పనితీరు ఇంచార్జిల విషయం అలా అనేక అంశాల్తో కూడిన నివేదికను పార్టీ పెద్దలకు ఇచ్చారని అంటున్నారు. దాంతో గోదావరి జిల్లాలలో పార్టీ ప్రక్షాళనకు జనసేన సిద్ధపడుతోంది అని అంటున్నారు. తొందరలోనే దీనిని సంబంధించి ప్రకటన వస్తుందని అంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu