Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ గురించి చిరు... కార్తీ గురించి సూర్య..!

పవన్ గురించి చిరు... కార్తీ గురించి సూర్య..!

Tupaki.com 2 weeks ago

వన్ కళ్యాణ్‌ బర్త్‌డే సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు.. అంటూ చేసిన ఎక్స్ పోస్ట్‌ ఏ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తమ్ముడి గురించి, తమ్ముడి పై తనకు ఉన్న ప్రేమను చిరంజీవి ఎంతో అద్భుతంగా ఆ పోస్ట్‌లో షేర్‌ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్‌తో తనకు ఉన్న అనుబంధం, కుటుంబం పట్ల పవన్ కు ఉండే బాధ్యత, ప్రజల కోసం పవన్‌ పడే తపన ఇలా చాలా విషయాలను అందులో ప్రస్థావించాడు. ఈ పోస్ట్‌లోనే కాకుండా గతంలోనూ పవన్‌ కళ్యాణ్ గురించి మెగాస్టార్‌ చిరంజీవి ఏ స్థాయిలో పొగుడుతూ వ్యాఖ్యలు చేశాడో చూశాం. తనకంటే చిన్నవాడు అయినా కూడా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వాడు అని, తన కుటుంబం కోసం ఎంతో చేసిన వ్యక్తి అంటూ పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి పదే పదే మాట్లాడుతూ ఉంటాడు. పవన్‌ పై తనకు ఉన్న అభిమానంను చిరు ఎక్కడా దాచుకోకుండా చూపిస్తూ ఉంటాడు.

మెగా బ్రదర్స్‌ చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌...

తెలుగు మెగా బ్రదర్స్‌ అని చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లను పిలిస్తే, తమిళ మెగా బ్రదర్స్‌ అని సూర్య, కార్తీలను పిలుస్తారు అనే విషయం తెల్సిందే. తమిళ్‌తో పాటు తెలుగులో స్టార్‌డం దక్కించుకున్న సూర్య సందర్భం వచ్చిన ప్రతిసారీ తన తమ్ముడి గురించి ప్రత్యేకంగా మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. తాజాగా కార్తీ హీరోగా నటించిన సర్దార్‌ 2 ప్రీ రిలీజ్ వేడుకలో సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కార్తీ సినిమాల్లోకి రావాలి అనుకున్నప్పుడు చాలా లావుగా ఉండేవాడు, అమెరికాలో ఉన్న సమయంలో బస్తాలకు బస్తాలు పొటాలో చిప్స్‌ తినడం అలవాటు, ఇండియాకు వచ్చిన సమయంలోనూ బస్తాలకు బస్తాలు అన్నట్లుగా పొటాటో చిప్స్‌ ను తింటూ ఉండేవాడు. ఎప్పుడైతే మొదటి సినిమా ఆఫర్‌ వచ్చిందో అప్పటి నుంచి పూర్తిగా తనను తాను మార్చుకోవడం కోసం పడ్డ కష్టం అంతా ఇంతా కాదని సూర్య చెప్పుకొచ్చాడు.

తమిళ స్టార్స్ సూర్య, కార్తీ...

ఇంకా సూర్య మాట్లాడుతూ.. సినిమా సినిమాకి కార్తీ ఏ స్థాయిలో కష్టపడుతూ ఉంటాడో నేను చూస్తూ ఉంటాను. ఇద్దరి మధ్య అసూయ అనేది ఉండదు. ఇంటికి వచ్చిన వాళ్లలో ఎక్కువ శాతం మంది కార్తీ గురించి అడుగుతూ ఉంటారు. నాతోనూ చాలా మంది కార్తీ నటన గురించి, ఆయన సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువ శాతం మంది కార్తీ సినిమాల గురించి మాట్లాడినప్పుడు గర్వంగా అనిపిస్తుందని కూడా సూర్య చెప్పుకొచ్చాడు. తమ్ముడిని చూస్తుంటే, తమ్ముడు ఎంపిక చేసుకుంటున్న సినిమాలు చూస్తుంటే గర్వంగా ఉందని, ముందు ముందు కూడా కార్తీ ఇలాగే మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అని, తమ్ముడికి ఎప్పుడూ మంచి జరగాలి అని కోరుకుంటున్నాను అని సూర్య మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షించింది. పెద్దవాడు అయినా కార్తీ విషయంలో సూర్య ఏమాత్రం జలస్ లేకుండా గర్వంగా ఫీల్‌ కావడం మంచి విషయం.

సర్దార్‌ 2 తో కార్తీ...

పవన్‌ కళ్యాణ్ విషయంలో చిరంజీవి ఎలా అయితే గర్వంగా ఫీల్‌ అవుతున్నాడో అలాగే కార్తీ విషయంలో సూర్య సైతం అలా గర్వంగా ఫీల్‌ అవుతున్నట్లు ఈ కామెంట్స్ వింటే అర్థం అవుతుంది. అన్నదమ్ములు ఒకరిని ఒకరు అభిమానించుకుంటూ, గర్వపడేలా చేయడం గొప్ప విషయం. కార్తీ ప్రస్తుతం సర్దార్‌ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కార్తీ హీరోగా వచ్చిన సర్దార్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో అప్పటి నుంచి ఆ సినిమా సీక్వెల్‌ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు సర్దార్‌ 2 సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయింది. ఈనెలలోనే సినిమా తమిళ్‌తో పాటు, తెలుగు ప్రేక్షకుల ముందుకు భారీ ఎత్తున రాబోతుంది. సర్దార్‌ 2 తర్వాత కార్తీ నటించిన మరో సూపర్‌ హిట్‌ మూవీ ఖైదీ కి సైతం సీక్వెల్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu