Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ కు పర్మిషన్ ఇవ్వకున్నా.. బండ్ల గణేష్ మాత్రం అదే రూట్లో..

పవన్ కు పర్మిషన్ ఇవ్వకున్నా.. బండ్ల గణేష్ మాత్రం అదే రూట్లో..

Tupaki.com 2 weeks ago

తెలంగాణలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభకు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడం హాట్ టాపిక్ గా మారింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో సహజంగానే అందరి దృష్టి బండ్ల గణేష్ వైపు మళ్లింది.

బండ్ల కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటున్నాడు. సొంత పార్టీ తీసుకున్న నిర్ణయంపై బండ్ల ఎలా స్పందిస్తాడనే ఆసక్తి ఇరు వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.

ఊహించినట్లుగానే రాజకీయాలను, వ్యక్తిగత ఇష్టాలను వేరుచేసి బండ్ల తనదైన స్టైల్ లో సున్నితంగా రియాక్ట్ అయ్యాడు. పవన్ మీద తనకున్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదని ఓపెన్ గానే స్పష్టం చేశాడు. తన ఎక్స్ ఖాతాలో బండ్ల గణేష్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పవన్ అంటే తనకిష్టం ఎంతంటే.. గుండె కొట్టుకోవడం ఆగిపోవచ్చేమో కానీ ఆ అభిమానం ఆగదు అని రాసుకొచ్చాడు.

తన పేరు తాను మర్చిపోయినా పవన్ ను మాత్రం ఎప్పటికీ మర్చిపోనని, చచ్చాక కూడా ఆ ప్రేమ అలాగే నిలిచిపోతుందని ఒక ఫోటోను షేర్ చేశాడు. సొంత పార్టీ ప్రభుత్వం సభకు అడ్డుకట్ట వేసినా కూడా, బండ్ల మాత్రం పాలిటిక్స్ ను పక్కనబెట్టి పవన్ పై ఉన్న అభిమానాన్ని మరోసారి నిరూపించుకున్నాడు.

మరోవైపు బహిరంగ సభకు తెలంగాణ పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో పవన్ కళ్యాణ్ వేగంగా ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకున్నాడు.

తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెడుతూ కొత్త అప్డేట్ ఇచ్చాడు. జూబ్లీహిల్స్ లోని తన ఇంట్లోనే సాయంత్రం 4.30, 5.30 గంటల సమయంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు ప్రకటించాడు. జనసేన ముఖ్య నేతలతో కలిసి నిర్వహించే ఈ ప్రెస్ మీట్ కు అయినా కనీసం పోలీసు డిపార్ట్ మెంట్ పర్మిషన్ ఇస్తుందని ఆశిస్తున్నట్లు అందులో పేర్కొన్నాడు. ఏదేమైనా సరే తన వాయిస్ ని వినిపించేందుకు పవన్ సిద్ధమయ్యాడు.

ఈ మొత్తం ఎపిసోడ్ పై మెగా అభిమానులు, నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. చాలా మంది ఫ్యాన్స్ బండ్ల గణేష్ గట్స్ ను మెచ్చుకుంటున్నారు. అధికార పార్టీలో కొనసాగుతూ కూడా ఎలాంటి డౌట్ లేకుండా పవన్ పై ప్రేమను చాటుకోవడం నిజమైన అభిమానానికి నిదర్శనం అంటున్నారు. ఇంకొందరు మాత్రం సభకు అనుమతి నిరాకరించిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు భిన్నమైన రాజకీయ పార్టీల మధ్య ఉన్నప్పటికీ బండ్ల తన లాయల్టీని మార్చుకోకపోవడం ఇక్కడ హైలెట్ అయ్యింది.

ప్రభుత్వ నిర్ణయం ఒక వైపు, వ్యక్తిగత అభిమానం మరో వైపు.. ఈ రెండింటి మధ్య బండ్ల గణేష్ బ్యాలెన్స్ చేసిన విధానం పాలిటిక్స్ లో కాస్త రేర్ గానే కనిపిస్తుంది. ఇక సాయంత్రం జరగబోయే పవన్ ప్రెస్ మీట్ విషయంలో పోలీసులు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారో అనే ఉత్కంఠ అందరిలో ఉంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో తెలంగాణలో పాలిటిక్స్ ని ఎలాంటి మలుపులు తిప్పుతాయో వేచి చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu