Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ విత్ విజయ్... ఎలా మిస్ అయింది ?

పవన్ విత్ విజయ్... ఎలా మిస్ అయింది ?

Tupaki.com 6 hrs ago

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జోసెఫ్ విజయ్ ఏపీకి తొలిసారి వచ్చారు. ఆయన ఈ నెల 13న సాయంత్రం వచ్చి రాత్రి వరకూ అధికారిక పర్యటనలో బిజీగా గడిపారు.

విజయ్ వెన్నటి టీడీపీ మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలు, కీలక నేతలు అంతా ఉన్నారు. ఇక విజయాడ ఉత్సవ్-20లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విజయ్ తో వేదిక మీద కనిపించారు. ఈ సందర్భంగా విజయవాడ వాసులను ఉద్దేశించి విజయ్ తెలుగులో ప్రసంగం చేశారు. అది అందరికీ విపరీతంగా ఆకట్టుకుంది. మరో వైపు చూస్తే విజయవాడకు సీఎం హోదాలో వచ్చిన నిన్నటి నటుడు విజయ్ కి అడుగడుగునా జనాలు నీరాజనాలు పలికారు. విజయ్ క్రేజ్ కానీ ఆయన మేనియా కానీ స్పష్టంగా విజయవాడలో కనిపించింది. దాంతో దళపతి సూపర్ టూర్ అని అంతటా చర్చ సాగింది.

పవన్ తో భేటీ అంటూ :

ఇదిలా ఉంటే జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కూడా తమిళనాడు సీఎం విజయ్ కలుస్తారు అని ప్రచారం సాగింది. దాంతో మీడియా అంతా ఒక్కసారిగా ఈ భేటీ మీద ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఎందుకంటే విజయ్ సినీ నటుడు. అలాగే పవన్ కూడా ఏపీలో వెండి తెర పవర్ స్టార్. ఒకరు దళపతి అయితే మరొకరు సూపర్ స్టార్. ఈ విధంగా ఇద్దరు నేతలూ సినిమాల్లో తనకంటూ అద్భుతమైన ఇమేజ్ ని సొంతం చేసుకుని రాజకీయాల్లోకి అడుగు పెట్టి సూపర్ సక్సెస్ అయ్యారు ఇపుడు ఒకరు సీఎం అయితే మరొకరు డిప్యూటీ సీఎం. దాంతో ఈ ఇద్దరూ కలిసి ఒకే వేదిక మీద కలసి కనిపిన్స్తే అందరికీ కనువిందుగా ఉంటుందని ఆశపడ్డారు. అయితే ఆ ఆశ అలాగే ఉండిపోయింది. విజయ్ ఏపీకి వచ్చినా చంద్రబాబుతో మాత్రమే భేటీ అయ్యారు. పవన్ ని కలవలేదు. మరి ఇలా ఎందుకు జరిగింది అంటే దాని వెనక మ్యాటర్ ఉందని అంటున్నారు.

పవన్ ఫుల్ బిజీగా :

చిత్రమేంటి అంటే విజయ్ విజయవాడ వచ్చిన సమయంలో పవన్ కూడా అక్కడే ఉన్నారని అంటున్నారు. ఆయన మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ సమావేశాలలో బిజీగా గడిపారు అని అంటున్నారు. లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో ఆయన నేతలతో మంతనాలు జరుపుతూ తీరిక లేకుండా గడిపారు అని అంటున్నారు. అందువల్లనే ఆయన విజయ్ తో భేటీ వేయలేకపోయారు అని అంటున్నారు. అయితే మరో విషయం కూడా ఇదే సందర్భంలో చర్చకు వస్తోంది. విజయ్ ఏపీకి సీఎం హోదాలో వచ్చారు. ఆయన పార్టీ పెట్టి కేవలం రెండేళ్ళ తేడాలోనే సీఎం అయ్యారు. పవన్ విషయంలో తరచూ విజయ్ ని తెచ్చి పోలుస్తూ ప్రత్యర్ధులు మరీ ముఖ్యంగా వైసీపీ వారు ట్రోల్స్ చేస్తూ వచ్చారు. టార్గెట్ కూడా చేశారు. ఈ క్రమంలో పవన్ కూడా ఒకసారి పార్టీ మీటింగులో అదే మాట అన్నారు. పదేళ్ల నుంచి కష్టపడ్డాం కానీ రోడ్ల మీద ఉన్నాం కానీ సీఎం కాలేకపోయామని. ఇపుడు విజయ్ తో పవన్ భేటీ అయితే ఈ తేడాను చూపించి మరోసారి ట్రోల్స్ చేసే అవకాశం ఉంటుందని కూడా అంటున్నారు. ఈ క్రమంలో ఈ తరహా చర్చలకు విమర్శలకు తావు ఇవ్వకుండా పవన్ పార్టీ మీటింగులలోనే గడిపారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే పవన్ విత్ విజయ్ అన్న ఫోటోని మాత్రం జనం మిస్ అయ్యారనే అంటున్నారు. మరో సందర్భంలో అయినా ఈ ఇద్దరి భేటీ ఉండొచ్చు అని కూడా అంటున్నారు. చూడాలి మరి ఆ రోజు ఎపుడు వస్తుందో.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu