Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెద్ది చరణ్ నాలుగు అవతారాలు: ఇది రిస్కా, రికార్డు?

పెద్ది చరణ్ నాలుగు అవతారాలు: ఇది రిస్కా, రికార్డు?

Tupaki.com 1 week ago

'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ ఒకటి కాదు, నాలుగు పాత్రల్లో కనిపిస్తాడని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు లీక్ ఇచ్చాడు. క్రికెటర్, పహిల్వాన్, అథ్లెట్, ఇంకో సర్‌ప్రైజ్ లుక్.

ఒక్క మాటతో సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఫస్ట్ లుక్ లోనే చరణ్ నెవ్వర్ బిఫోర్ అనేలా షాక్ ఇచ్చాడు. ఇక ఆ తరువాత గ్లింప్స్ సాంగ్స్ పోస్టర్స్ ద్వారా కూడా సినిమా సోల్ ఏమిటనేది క్లారిటీ వచ్చింది.

కానీ ఇక్కడ అసలు సందేహం ఏమిటంటే నాలుగు క్యారెక్టర్లు అంటే కథ డీప్ అవుతుందా, లేక కన్‌ఫ్యూజ్ అవుతుందా అనేది. ఒకే హీరో వేర్వేరు లుక్స్‌లో కనిపించడం తెలుగు సినిమాకు కొత్త కాదు. 'విక్రమార్కుడు', 'అదుర్స్', 'జై లవకుశ' లాంటివి గుర్తున్నాయి. అయితే 'పెద్ది' వాటికి భిన్నం. ఇది డ్యూయల్ రోల్ కాదు. ఒకే వ్యక్తి జీవితంలో నాలుగు దశలు, నాలుగు వృత్తులు అయ్యే ఛాన్స్ ఉంది. క్రికెటర్ నుంచి పహిల్వాన్‌గా మారడం, ఆ తర్వాత అథ్లెట్‌గా మారడం వెనుక బలమైన ఎమోషనల్ ఆర్క్ ఉంటేనే వర్కవుట్ అవుతుంది. లేదంటే గెటప్‌ల పరేడ్‌లా మిగిలిపోతుంది.

రత్నవేలు "కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న భావోద్వేగ చిత్రం" అని చెప్పడం హైలెట్. బుచ్చిబాబు 'ఉప్పెన'లో ఎమోషన్‌ని నమ్ముకున్నాడు. ఇప్పుడు 'పెద్ది'ని పాన్ ఇండియా స్కేల్‌లో తీస్తున్నా, ఆ సోల్ మిస్ అవ్వకూడదు. రామ్ చరణ్ 'రంగస్థలం' చిట్టిబాబు లాగా ఒకే క్యారెక్టర్‌లో ఒదిగిపోయి మెప్పించాడు. ఇప్పుడు నాలుగు షేడ్స్‌ని ఒకే ఇంటెన్సిటీతో పండించాలి. అదే అసలు సవాల్. నాలుగో లుక్ ఏంటనేది రత్నవేలు సస్పెన్స్‌లో పెట్టాడు.

ఇండస్ట్రీ టాక్ ప్రకారం అది వింటేజ్ పీరియడ్ లుక్ కావచ్చు. 'RRR' లో అల్లూరి సీతారామరాజుగా మెప్పించిన చరణ్‌కి పీరియడ్ సెటప్ కొత్త కాదు. కానీ ఒకే సినిమాలో పక్కా విలేజ్ క్రికెటర్, రూరల్ పహిల్వాన్ కలిపి చూపించడం బుచ్చిబాబు చేస్తున్న ప్రయోగం. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఈ ట్రాన్సిషన్స్‌ని స్మూత్ చేయాలి. ట్రేడ్ లెక్కల్లో చూస్తే, మల్టిపుల్ గెటప్స్ ఉన్న సినిమాలకు ఓపెనింగ్స్ గట్టిగా ఉంటాయి.

పోస్టర్ మీదే నాలుగు చరణ్‌లను చూపిస్తే థియేటర్‌కి రప్పించడం ఈజీ. కానీ రిపీట్ ఆడియన్స్ రావాలంటే కథలో దమ్ముండాలి. ఏదేమైనా ఇది రామ్ చరణ్ కెరీర్‌లో ఒక డిఫరెంట్ ప్రాజెక్టు. 'గేమ్ ఛేంజర్' ఫ్లాప్ తర్వాత సోలో హిట్ అవసరం. RRR సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ అందుకున్న తరువాత వచ్చిన సినిమాలు మళ్ళీ మరో స్థాయికి వెళ్ళలేదు. కాబట్టి ఫ్యాన్స్ లో కూడా చాలా హోప్స్ ఉన్నాయి. బుచ్చిబాబు నాలుగు క్యారెక్టర్లతో ఆ బాధ్యత తీసుకున్నాడు. రత్నవేలు విజువల్స్, రెహమాన్ బీజీఎం తోడైతే 'పెద్ది' కేవలం మాస్ సినిమా కాదు, చరణ్‌లోని నటుడిని బయటకు తీసే ప్రాజెక్ట్ అవుతుంది. ట్రైలర్‌లో ఈ నాలుగు షేడ్స్‌ని ఎలా చూపిస్తారో దానిమీదే సినిమా ఫేట్ ఆధారపడి ఉంది. మరి కంటెంట్ ఏ స్థాయిలో హైలెట్ అవుతుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu