Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెద్ది గ్లింప్స్: పెద్దికి 'మీర్జాపూర్' నటుడి బస్తీ మే సవాల్?

పెద్ది గ్లింప్స్: పెద్దికి 'మీర్జాపూర్' నటుడి బస్తీ మే సవాల్?

Tupaki.com 1 week ago

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం `పెద్ది` గురించి ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

తాజాగా ఈ చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ `మీర్జాపూర్` ఫేమ్ దివ్యేందు శర్మకు సంబంధించిన ఒక ప్రత్యేక వీడియో గ్లింప్స్‌ను మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా విడుదల చేసింది. సెట్స్‌లో దివ్యేందు చాలా ఉత్సాహంగా కనిపిస్తూ.. రామ్ చరణ్ .. దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి పని చేస్తున్న తీరు చూస్తుంటే ఈ సినిమాలో అతడు ఒక కీలకమైన- ఛాలెంజింగ్ పాత్రలో కనిపించబోతున్నారని అర్థమవుతోంది.

దివ్యేందు లైఫ్, కెరీర్ ప్రయాణం గురించి తెలుసుకుంటే చాలా ఆసక్తి కలుగుతుంది. అతడు థియేటర్ ఆర్ట్స్ నుండి మొదలై ప్రతిష్టాత్మక FTII (ఫిలిం అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా) లో శిక్షణ పొందడం వరకు ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగింది. తన అసలు పేరు దివ్యేందు శర్మ అయినా.. వృత్తిపరంగా తన ఇంటిపేరును తొలగించి కేవలం `దివ్యేందు`గా తన గుర్తింపును మార్చుకున్నారు. తొలినాళ్లలో వాణిజ్య ప్రకటనలలో నటించిన అతడు `ప్యార్ కా పంచనామా చిత్రంలో `లిక్విడ్` అనే హాస్య పాత్రతో యువతకు చేరువయ్యారు. ఆ తర్వాత వచ్చిన `మీర్జాపూర్` వెబ్ సిరీస్‌లో `మున్నా భయ్యా`గా అతడు పండించిన క్రూరత్వం.. డార్క్ హ్యూమర్ కెరీర్‌ను మలుపు తిప్పాయి.

ప్రస్తుతం `పెద్ది` సెట్స్ నుండి విడుదలైన వీడియోలో దివ్యేందు ఎంతో స్నేహపూర్వక వాతావరణంలో కనిపిస్తున్నారు. చరణ్, బుచ్చిబాబులతో అతడికి ఉన్న సాన్నిహిత్యం షూటింగ్ సజావుగా సాగుతోందనడానికి నిదర్శనం. ఈ సినిమాలో క్రికెట్ నేపథ్యం ఉంటుందని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆ క్రీడకు.. దివ్యేందు పోషించే పాత్రకు ఉన్న కనెక్షన్ ఏమిటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బుచ్చిబాబు తన సినిమాల్లో ప్రతి పాత్రను చాలా లోతుగా తీర్చిదిద్దుతారు కాబట్టి దివ్యేందు కోసం ఒక పవర్‌ఫుల్ రోల్‌ను సిద్ధం చేశారని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

బాలీవుడ్ జెన్ జెడ్ ప్రేక్షకులలో దివ్యేందుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సహజమైన నటన, అద్భుతమైన కామిక్ టైమింగ్ , ఇంటెన్స్ పర్ఫార్మెన్స్‌తో అతడు తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా అతడి నటన పై మంచి గౌరవం ఉంది. `పెద్ది` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న ఈ జెన్- జీ నటుడు ఈ సినిమా విడుదల తర్వాత ఇక్కడ మరింత బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. హిందీ నటులు సౌత్ సినిమాల్లో రాణిస్తున్న తరుణంలో దివ్యేందు ఎంట్రీ సినిమాకు అదనపు బలాన్ని ఇస్తోంది.

మొత్తానికి `పెద్ది` గ్లింప్స్ ద్వారా చిత్ర బృందం ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తుండటం.. భారీ తారాగణాన్ని రంగంలోకి దించడం సినిమా స్థాయిని పెంచుతోంది. జూన్ నెలలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ద్వారా రామ్ చరణ్ - దివ్యేందుల మధ్య ఉండే ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచి సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu