Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెద్ది.. గూస్ బంప్స్ మూమెంట్!

పెద్ది.. గూస్ బంప్స్ మూమెంట్!

Tupaki.com 2 days ago

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ పెద్ది చుట్టూ రోజుకో ఆసక్తికరమైన వార్త బయటకు వస్తూనే ఉంది. బుచ్చిబాబు సన డైరెక్షన్ లో వస్తున్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ క్రాస్ పవర్ఫుల్ మాస్ అథ్లెట్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే.

ఈ క్యారెక్టర్ కోసం ఆయన మేకోవర్ ఎలా ఉండబోతోంది అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. లేటెస్ట్ గా ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ కు సంబంధించి ఫైట్ మాస్టర్ నబకాంత్ పంచుకున్న ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.

సినిమాలో ఒక భారీ కుస్తీ ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు మేకర్స్. ఈ ఫైట్ కోసం ఏకంగా నిజమైన మల్లయోధులను రంగంలోకి దించారు. వాళ్ళంతా చూడటానికి చాలా భారీ కాయంతో భయపెట్టేలా ఉన్నారట. అదే సమయంలో చరణ్ పైన ఒక టవల్ కప్పుకుని చాలా క్యాజువల్ గా, నార్మల్ గా రింగ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తీరా ఫైట్ మొదలయ్యే ముందు ఆ టవల్ తీసి పక్కన పడేయగానే, చరణ్ ఫిజిక్ చూసి ఎదురుగా ఉన్న ఆ రియల్ ఫైటర్స్ సైతం ఒక్కసారిగా షాక్ అయ్యారని నబకాంత్ వెల్లడించారు.

ఒక కమర్షియల్ సినిమాలో విలన్లను హీరో ఈజీగా కొట్టేయడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఒక పక్కా స్పోర్ట్స్ డ్రామాలో నిజమైన అథ్లెట్స్ ముందు నిలబడి ఫైట్ చేయాలంటే, ఆ క్యారెక్టర్ కు ఒక అథెంటిసిటీ తీసుకురావడం చాలా కష్టం. తెర మీద ఫేక్ గా బాడీలు చూపిస్తే ఈ జనరేషన్ ఆడియన్స్ ఇట్టే కనిపెట్టేస్తారు. అందుకే రియల్ ఫైటర్స్ కు ఏమాత్రం తీసిపోని విధంగా చరణ్ తన బాడీని మార్చుకున్న తీరు ఈ సినిమాకు మేజర్ హైలైట్ కాబోతోందని అర్థమవుతోంది.

క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ప్రాణం పెట్టి పనిచేయడం చరణ్ కు కొత్తేమీ కాదు. గతంలో వచ్చిన ధృవ, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో ఆయన ఫిజికల్ ట్రాన్స్ ఫార్మేషన్ ఏ రేంజ్ లో ఉందో చూశాం. ఇప్పుడు పెద్ది కోసం కూడా అదే స్థాయిలో కష్టపడ్డారు. కేవలం జిమ్ లో కండలు పెంచడం కాకుండా, ఒక మల్లయోధుడికి ఉండే మొండితనం, ఆ రస్టిక్ లుక్ తీసుకురావడానికి చరణ్ తెర వెనుక చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. ఆ కష్టమే ఇప్పుడు సెట్స్ లో ఉన్న ఫైటర్స్ ను సైతం ఆశ్చర్యపరిచేలా చేసిందట.

దర్శకుడు బుచ్చిబాబు తన సినిమాల్లో రియాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గాల్లో ఎగిరి తన్నే ఫైట్స్ కాకుండా, మట్టిలో జరిగే రియల్ కుస్తీ పోరాటాలను ఆయన డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి రా అండ్ రస్టిక్ యాక్షన్ సీన్స్ తెరమీద పండితే వచ్చే ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. బాడీ లాంగ్వేజ్ నుంచి ఎక్స్ ప్రెషన్స్ వరకు ప్రతి చిన్న డీటైలింగ్ మీద శ్రద్ధ పెట్టడం వల్లే ఆ కుస్తీ సీక్వెన్స్ అంత అద్భుతంగా వచ్చిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ప్రేక్షకులకు ఇదొక కొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu