Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెద్ది కాంబో మళ్లీ రిపీట్? ఈ సారి డిఫరెంట్ జానర్‌లో !

పెద్ది కాంబో మళ్లీ రిపీట్? ఈ సారి డిఫరెంట్ జానర్‌లో !

Tupaki.com 1 week ago

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది విడుదలకు సిద్ధమవుతుండగా, డైరెక్టర్ బుచ్చిబాబు సాన చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఉప్పెన సినిమాతో దర్శకుడిగా అద్భుతమైన ఆరంగేట్రం చేసిన బుచ్చిబాబు, రెండో సినిమాకే రామ్ చరణ్ వంటి స్టార్ హీరోతో పనిచేసే అవకాశాన్ని అందిపుచ్చుకుని అందరి దృష్టిని ఆకర్షించారు.

ప్రస్తుతం పెద్ది ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆయన, రామ్ చరణ్‌తో మరోసారి కలిసి పని చేయాలనే తన ఆసక్తిని బహిరంగంగా వ్యక్తం చేయడం అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఈసారి జానర్ పూర్తిగా భిన్నంగా ఉంటుందని, అందరి అంచనాలకు మించి ఉంటుందంటూ ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బుచ్చిబాబు చెప్పిన ప్రకారం, ఆయన ఇప్పటికే రామ్ చరణ్‌కు కొత్త కథను వినిపించారట. ఆ కథ చరణ్‌కు బాగా నచ్చిందని, చరణ్ కూడా కథ విన్న వెంటనే చాలా ఎగ్జైటెడ్‌గా ఫీల్ అయ్యారని, చరణ్ గారితో మరో సినిమా చేయడానికి తాను ఎదురుచేస్తున్నట్టు బుచ్చి మనసులోని మాటను బయటపెట్టారు. ప్రస్తుతం పెద్ది స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతుండగా, చరణ్ కు నెరేట్ చేసిన కథ మాత్రం పూర్తిగా కొత్త ప్రపంచాన్ని చూపించేలా ఉంటుందని బుచ్చి వెల్లడించారు. ఆ సినిమా ఎవ్వరూ ఊహించని రేంజ్‌లో ఉంటుందని బుచ్చిబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ ఏ జానర్‌లో ఉండబోతోంది? ఫాంటసీనా, సైకాలజికల్ థ్రిల్లరా, లేక హాలీవుడ్ స్టైల్ యాక్షన్ డ్రామానా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే రామ్ చరణ్ వరుసగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన ఇమేజ్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్తుండటంతో, బుచ్చిబాబు చెప్పిన ఈ అన్ ఎక్స్‌పెక్టెడ్ కథపై మరింత ఆసక్తి పెరుగుతోంది.

అయితే ప్రస్తుతం అందరి దృష్టి మాత్రం పెద్ది సినిమా ఫలితంపైనే ఉంది. జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్రామీణ నేపథ్యంతో పాటు స్పోర్ట్స్ ఎలిమెంట్స్ కలగలిపి రూపొందిన ఈ సినిమా, రామ్ చరణ్ కెరీర్‌లో మరో స్పెషల్ ఫిల్మ్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇదే సమయంలో బుచ్చిబాబు- చరణ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు రావడంతో మెగా అభిమానుల్లో ఆనందం రెట్టింపు అయింది. అయితే ఈ కొత్త ప్రాజెక్ట్ పెద్ది తర్వాత వెంటనే ప్రారంభమవుతుందా? లేక బుచ్చిబాబు మరో హీరోతో సినిమా పూర్తి చేసిన తర్వాత చరణ్‌తో పని చేస్తారా? అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu