Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెద్ది టాప్ ప్లేస్ కొడుతుందా? చరణ్ టార్గెట్ ఎంత?

పెద్ది టాప్ ప్లేస్ కొడుతుందా? చరణ్ టార్గెట్ ఎంత?

Tupaki.com 3 weeks ago

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. స్పోర్ట్స్ డ్రామా, విలేజ్ బ్యాక్ డ్రాప్, భారీ క్యాస్టింగ్, ఏఆర్ రెహమాన్ సంగీతం వంటి ఎలిమెంట్స్ సినిమాపై ప్రత్యేక ఆసక్తిని పెంచుతున్నాయి.

జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు సాధిస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది.

నిజానికి.. రామ్ చరణ్‌ కు గేమ్ ఛేంజర్ తర్వాత ఇది అత్యంత కీలకమైన సినిమా. దీంతో అభిమానులతో పాటు సినీ ప్రియులు పెద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌ కు మంచి రెస్పాన్స్ రావడం, బుచ్చిబాబు గత చిత్రం ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, చరణ్‌ కు ఉన్న పాన్ ఇండియా గుర్తింపు సినిమాకు ఎక్స్ ట్రా స్త్రెంగ్త్స్ గా మారాయి.

అయితే ప్రస్తుతం చర్చ మొత్తం సినిమా కలెక్షన్లపైనే నడుస్తోంది. 2026లో ఇప్పటికే కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి. ముఖ్యంగా ధురంధర్ ది రివెంజ్ భారీ స్థాయిలో కలెక్షన్స్ సాధించి టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. దాని తర్వాతి స్థానాల్లో కూడా పలు చిత్రాలు నిలిచాయి. ఈ నేపథ్యంలో పెద్ది టాప్-10 లిస్ట్ లో ఎక్కడ నిలుస్తుంది? లేక నేరుగా టాప్ ప్లేస్ కు సవాల్ విసురుతుందా? అన్న ఆసక్తి నెలకొంది.

ట్రేడ్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం, పెద్దికి స్ట్రాంగ్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్, ఓవర్సీస్ మార్కెట్లలో కూడా సినిమాపై మంచి ఆసక్తి ఉందని చెబుతున్నారు. విడుదల తర్వాత పాజిటివ్ టాక్ వస్తే వసూళ్లు ఓ రేంజ్ లో వస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే టాప్ ప్లేస్ ను అందుకోవడం అంత ఈజీ కాదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

ఎందుకంటే ఇప్పటికే భారీ వసూళ్లు సాధించిన చిత్రాలు ఆ జాబితాలో ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఏడాది సెకండాఫ్ లో మరికొన్ని భారీ ప్రాజెక్టులు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీంతో పెద్దికి వచ్చిన అవకాశాన్ని పూర్తిగా యూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సినిమా బడ్జెట్, స్టార్ క్యాస్ట్, టెక్నికల్ వాల్యూస్, ప్రమోషన్ల రేంజ్ చూస్తే ఇది నార్మల్ మూవీ కాదనే విషయం స్పష్టమవుతోంది.

ప్రేక్షకులను స్టోరీ, ఎమోషన్స్, స్పోర్ట్స్ ఎలిమెంట్స్‌ తో ఆకట్టుకోగలిగితే బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున కలెక్షన్స్ సాధించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ ను ఒకేసారి అట్రాక్ట్ చేస్తే వసూళ్ళ పరంగా కొత్త రికార్డు క్రియేట్ చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఏదేమైనా పెద్ది విడుదలకు ముందే భారీ బజ్‌ ను క్రియేట్ చేసుకుంది. అయితే టాప్-10లో ప్లేస్ సంపాదించడం మాత్రమే కాదు, 2026 బిగ్గెస్ట్ గ్రాసర్స్ జాబితాలో ఏ ప్లేస్ కు చేరుతుందనేదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu