Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెద్ది థియేటర్లలో పూనకాలే.. నిర్మాత పవర్ఫుల్ కాన్ఫిడెన్స్!

పెద్ది థియేటర్లలో పూనకాలే.. నిర్మాత పవర్ఫుల్ కాన్ఫిడెన్స్!

Tupaki.com 1 week ago

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' సినిమా జూన్ 4న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా వృద్ధి సినిమాస్ అధినేత, ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు మీడియాతో ముచ్చటించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

సినిమా బిజినెస్ మొత్తం ఆల్రెడీ క్లోజ్ అయిపోయిందని, తాము చాలా ప్రశాంతంగా ఉన్నామని ఆయన చెప్పారు. మొదటి సినిమానే రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్ తో చేయడం తన అదృష్టమని, టైటిల్ కార్డ్స్ పడినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఆడియన్స్ సీట్లలోంచి కదలలేరని అంత కాన్ఫిడెంట్ గా చెప్పారు సతీష్.

వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సతీష్ కిలారు, ఇంజనీరింగ్ తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్‌లో సెటిల్ అయ్యారు. మైత్రి మూవీస్ నవీన్ తన క్లోజ్ ఫ్రెండ్ కావడంతో అలా ఇద్దరూ కలిసి ఈ సినిమాతో ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టారు. షూటింగ్ ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా కూల్ గా జర్నీ సాగిందని, చివరి రోజున చరణ్, బుచ్చిబాబు అంతా బాగా ఎమోషనల్ అయ్యారని గుర్తుచేసుకున్నారు.

ఈ కథలో ఆడియన్స్ కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఎక్స్‌ట్రార్డినరీ ఎమోషన్స్ ని బుచ్చిబాబు ఒక ప్యాకేజ్ లా రెడీ చేశారని ఆయన ప్రశంసించారు. ఇది 1980ల బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ కావడంతో ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ అద్భుతమైన సెట్లు వేశారని, డీవోపీ రత్నవేలు విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని సతీష్ పేర్కొన్నారు. రియల్ లొకేషన్స్ కోసం శ్రీలంక, పూణే, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో షూట్ చేసినట్లు చెప్పారు.

ముఖ్యంగా రామ్ చరణ్ పడిన కష్టం గురించి ప్రొడ్యూసర్ చెబుతూ షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఈ క్యారెక్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం చరణ్ రెండేళ్ల పాటు ఒక స్పెషల్ ట్రైనర్ ని పెట్టుకుని వర్కవుట్ చేశారట. షూటింగ్ సమయంలో గాయాలైనా లెక్కచేయలేదని, కంటికి కుట్లు పడిన మరుసటి రోజే సెట్ కి వచ్చారని చరణ్ డెడికేషన్ ని కొనియాడారు. కొన్నిసార్లు బాడీ సహకరించకపోయినా ఫిజియో చేయించుకుని మరీ యాక్షన్ సీన్స్ లో పాల్గొన్నారని, ఆ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ని వెండితెరపై చూసి తీరాల్సిందేనని అన్నారు.

మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ ఈ కథ వినగానే ఎంతో ఎక్సైట్ అయి, సినిమా కోసం తమ కంటే ఎక్కువ కష్టపడి బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారని సతీష్ కిలారు తెలిపారు. అలాగే డైరెక్టర్ సుకుమార్ ఇన్వాల్వ్‌మెంట్ పై క్లారిటీ ఇస్తూ, కథను బుచ్చిబాబు మొదట్లో తన గురువు గారితో షేర్ చేసుకుని ఉండొచ్చేమో కానీ, షూటింగ్ స్టార్ట్ అయ్యాక మొత్తం తనే వన్ మ్యాన్ షోలా చూసుకున్నారని చెప్పారు.

ఇక సినిమాలో శివరాజ్ కుమార్, జగపతిబాబు, బోమన్ ఇరానీ లాంటి పెద్ద నటుల పాత్రలు కథతో బలంగా ముడిపడి ఉంటాయని వివరించారు. ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమాపై క్రేజ్ ఇంకో రేంజ్ కి వెళ్తుందని, కంటెంట్ మీద ఉన్న నమ్మకమే తనను ఇంత కూల్ గా ఉంచుతోందని నవ్వుతూ చెప్పారు. ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ నందమూరి బాలకృష్ణ గారితో లైన్ లో ఉందని క్లారిటీ ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu