Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెద్ది ట్రైలర్.. వాళ్లకు బుచ్చిబాబు ఊహించని సర్ ప్రైజ్

పెద్ది ట్రైలర్.. వాళ్లకు బుచ్చిబాబు ఊహించని సర్ ప్రైజ్

Tupaki.com 1 week ago

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' సినిమాపై ఇప్పుడు ఇండస్ట్రీలో బజ్ మామూలుగా లేదు. ఫ్యాన్స్ తో పాటు చాలా మంది ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

ఇక నిన్న జరిగిన మీడియా ప్రతినిధుల ఇంటర్వ్యూల సమయంలో చిత్ర యూనిట్ ఒక స్పెషల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది. ప్రెస్ మీట్ ముగిసిన తర్వాత అక్కడ ఉన్న మీడియా వాళ్లకు మాత్రమే ఈ సినిమా అధికారిక ట్రైలర్ ను ముందే ప్రదర్శించారు. దాదాపు మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ కట్ చూసిన జర్నలిస్టులు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

విజువల్స్, కంటెంట్ పరంగా బుచ్చిబాబు సృష్టించిన పెద్ది ప్రపంచం మైండ్ బ్లోయింగ్ గా ఉందంటూ బలమైన టాక్ బయటకు వస్తోంది. ఈ మూడు నిమిషాల ట్రైలర్ లో రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ను బుచ్చిబాబు చాలా పర్ఫెక్ట్ గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. చరణ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలకు కంప్లీట్ గా భిన్నంగా ఉన్నాయట.

ముఖ్యంగా చరణ్ మేకోవర్ చూసి థియేటర్లలో ఫ్యాన్స్ కి పూనకాలు రావడం ఖాయమని ట్రైలర్ చూసిన వారు చెప్తున్నారు. ఒక పక్కా పల్లెటూరి వాతావరణాన్ని చూపిస్తూనే, ఊహించని రేంజ్ లో యాక్షన్ ఎలిమెంట్స్ ను ఇందులో జోడించారు. ప్రతి ఫ్రేమ్ లోనూ దర్శకుడి కష్టం స్పష్టంగా కనిపిస్తోందని మీడియా సర్కిల్స్ లో వినబడుతోంది. ఈ ట్రైలర్ లోని కంటెంట్ చూసిన తర్వాత 'పెద్ది' అనేది రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదని, ఇందులో ఒక ఇంటెన్సివ్ క్రైమ్ లేదా ఇమోషనల్ ఎలిమెంట్ కూడా గట్టిగా ఉందని అర్థమవుతోంది.

మన మట్టి వాసన తెలిసేలా ఈ కథను వెండితెరపై ఆవిష్కరించారని ఎక్కువమంది నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఈ మూడు నిమిషాల రన్ టైమ్ లో ఒక్క సెకన్ కూడా బోర్ కొట్టకుండా చాలా గ్రిప్పింగ్ గా ట్రైలర్ ను కట్ చేశారట. ఈమధ్య కాలంలో పెద్ద సినిమాల ట్రైలర్లు విడుదలైనప్పుడు మిక్స్ డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. కానీ నిన్న మీడియా వాళ్లకు చూపించిన ఈ స్పెషల్ షోకి మాత్రం వంద శాతం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

చరణ్ లుక్స్ తో పాటు రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ సినిమా రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్లాయని చెప్తున్నారు. ఈ రకమైన ఇండస్ట్రీ టాక్ బయటకు రావడంతో సామాన్య ప్రేక్షకుల్లో కూడా ట్రైలర్ ఎప్పుడు యూట్యూబ్ లోకి వస్తుందా అనే క్యూరియసిటీ విపరీతంగా పెరిగిపోయింది. ఒక రకంగా అఫీషియల్ రిలీజ్ కు ముందే సినిమాపై ఒక పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.

బుచ్చిబాబు తన రెండో సినిమాతోనే ఒక భారీ ప్రయోగానికి తెరలేపినట్లు కనిపిస్తోంది. రామ్ చరణ్ ఇమేజ్ ని వాడుకుంటూనే, తన కథలోని పవర్‌ను ఎక్కడా తగ్గకుండా చూసుకున్నారట. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా జగపతిబాబు, శివరాజ్ కుమార్ ముఖ్యమైన పాత్రలలో హైలెట్ కానున్నారు. ఇక ఎలాంటి ముందస్తు ప్రచారం లేకుండా ఇచ్చిన ట్రైలర్ సర్ ప్రైజ్, సినిమా బిజినెస్ సర్కిల్స్ లో కూడా పెద్ద హల్ చల్ చేస్తోంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ లో ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఎలాంటి రికార్డులు క్రియేట్ అవుతాయో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu