Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెద్దిపై మేకర్స్ నమ్మకం.. రన్ టైమ్ ఎంతంటే?

పెద్దిపై మేకర్స్ నమ్మకం.. రన్ టైమ్ ఎంతంటే?

Tupaki.com 1 week ago

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా పెద్దిపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

ఇప్పటికే పోస్టర్లు, టీజర్, గ్లింప్స్‌తో సోషల్ మీడియాలో భారీ హైప్‌ను సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌తో ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. తాజా సమాచారం ప్రకారం పెద్ది ఫైనల్ కట్ పూర్తై, సినిమాకు 3 గంటల 2 నిమిషాల రన్‌టైమ్‌ను లాక్ చేసినట్టు తెలుస్తోంది.

సాధారణంగా ఈ స్థాయి రన్‌టైమ్‌ను మేకర్స్ ఎంచుకోవడం అంటే కథపై ఉన్న నమ్మకానికి తెలియచేస్తుంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో భారీ సినిమాలు ఎక్కువ నిడివితో వచ్చినప్పటికీ, కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు వాటిని ఆదరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పెద్ది కూడా అదే ట్రెండ్‌ను కొనసాగిస్తుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.

స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్, గ్రామీణ నేటివిటీ కలిసిన ఈ కథను బుచ్చిబాబు సాన అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించినట్టు సమాచారం. ముఖ్యంగా రామ్ చరణ్ ఈ సినిమాలో కనిపించబోయే లుక్‌, బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివరీ ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. చరణ్ కెరీర్‌లో ఇదొక డిఫరెంట్ మూవీగా నిలవబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇక హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, కీలక పాత్రల్లో జగపతి బాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ కనిపించనున్నారు. ఈ స్టార్ క్యాస్టింగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా శివ రాజ్‌కుమార్ పాత్రకు కథలో చాలా ప్రాధాన్యం ఉంటుందని, ఆయన పాత్ర సినిమాకు హైలైట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇక ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ A. R. రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు మంచి స్పందన లభించింది. ఎమోషనల్ సీన్స్, స్పోర్ట్స్ ఎపిసోడ్స్‌ను రెహమాన్ తన సంగీతంతో మరో స్థాయికి తీసుకెళ్లారనే టాక్ వినిపిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ సతీష్ కిలారు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో అన్న ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా మూడు గంటల నిడివి ఉన్నప్పటికీ ప్రేక్షకులను సీట్లలో కట్టిపడేసే కంటెంట్ ఉంటే పెద్ది ఈ ఏడాది టాలీవుడ్‌లో మరో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu