Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెళ్లికి ముందు ఏడవాల్సిందేనా.. ఆశ్చర్యపరుస్తున్న కొత్త సాంప్రదాయం!

పెళ్లికి ముందు ఏడవాల్సిందేనా.. ఆశ్చర్యపరుస్తున్న కొత్త సాంప్రదాయం!

Tupaki.com 1 week ago

పెళ్లి అనగానే మనకు గుర్తొచ్చేది నవ్వులు, సందడులు, బాజభజంత్రీలు. కానీ, ప్రపంచంలో ఒక విచిత్రమైన చోట మాత్రం పెళ్లి చేసుకోవాలంటే వధువు కచ్చితంగా ఏడవాలట.

అదీ ఒక్క రోజు కాదు.. పెళ్లికి నెల రోజుల ముందు నుంచే ఈ ఏడుపుల పండగ మొదలవ్వాలి. చైనాలోని ఒక ప్రత్యేకమైన తెగలో ఇప్పటికీ కొనసాగుతున్న ఈ వింత వివాహ సంప్రదాయం వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలు, మన దేశంలోని పెళ్లిళ్ల భావోద్వేగాల గురించి పూర్తి సమాచారం మీకోసం..

నెలకు ముందే మొదలయ్యే ఏడుపు:

చైనాలోని 'తుజియా' అనే తెగ ప్రజలు ఒక వినూత్నమైన వివాహ సంప్రదాయాన్ని పాటిస్తారు. దీనిని వారు 'జువో టాంగ్' లేదా సాధారణ భాషలో 'క్రైయింగ్ మ్యారేజ్' అంటారు. ఇక ఈ ఆచారం ప్రకారం, వధువు తన పెళ్లికి సరిగ్గా నెల రోజుల ముందు నుంచే ఏడవడం ప్రారంభించాలి. ప్రతిరోజూ ఇక కచ్చితంగా ఒక గంట పాటు ఈ ఏడుపు కార్యక్రమం కొనసాగుతుంది.

కుటుంబమంతా కలిసి ఏడవాలి:

ఈ సంప్రదాయంలో వధువు ఒక్కతే ఏడిస్తే సరిపోదు. మొదటి పది రోజులు ఆమె ఒక్కతే ఏడిస్తే, ఆ తర్వాత రోజుల్లో ఆమెకు తోడుగా తల్లి, ఆపై అమ్మమ్మ, ఆ తర్వాత ఇతర మహిళా బంధువులు కూడా తోడవుతారు.ఇక అందరూ కలిసి కూర్చుని దుఃఖంతో కూడిన కొన్ని ప్రత్యేకమైన సాంప్రదాయ పాటలు పాడుతూ, లయబద్ధంగా ఏడుస్తారు.వినటానికి వింతగా వున్నా ఇది నిజం.

ఎంత బాగా ఏడిస్తే అంత మంచిదట:

మరో విచిత్రమైన విషయం ఏంటంటే.. ఈ ఆచారంలో వధువు ఎంత చక్కగా, రాగయుక్తంగా ఏడుస్తుందో ఆమెను అంత తెలివైనదిగా, గుణవంతురాలిగా ఆ సమాజం గుర్తిస్తుంది. ఇక అసలు ఏడవటం రాని అమ్మాయిలను అక్కడ తక్కువ చేసి చూస్తారట. పుట్టింటిని వదిలి వెళ్తున్నందుకు బాధ, తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత, అలాగే కొత్త జీవితంపై ఉండే ఆశల కలయికగా ఈ ఏడుపును వారు భావిస్తారు.ఇక ఇది తమ వైవాహిక జీవితంలో సుఖసంతోషాలను ఇస్తుందని వారి నమ్మకం.

మన దేశంలో ఎలా ఉంటుంది?:

మన భారతదేశంలో లేదా పాశ్చాత్య దేశాలలో ఇలా కచ్చితంగా ఏడవాలనే నియమం ఎక్కడా లేదు. కానీ, మన దగ్గర కూడా పెళ్లి సమయంలో వధువు కన్నీళ్లు పెట్టుకోవడం చాలా సహజంగా చూస్తుంటాం. ఇక అప్పగింతల సమయంలో పుట్టినిల్లు, స్నేహితులను వదిలి అత్తగారింటికి వెళ్లేటప్పుడు ఆడపిల్లల కళ్లలో వచ్చే నీళ్లు మన సంస్కృతిలో ఒక సహజమైన భావోద్వేగ ప్రక్రియ.

ఇక ఏ దేశ సంప్రదాయాలు ఆ దేశానికి ప్రత్యేకం. చైనాలోని తుజియా తెగలో ఏడవడం అనేది బాధకు సంకేతం కాదు, అది వధువు తన కుటుంబంపై చూపించే ప్రేమకు ప్రతీక. రూపాలు వేరైనా, ఆడపిల్ల పెళ్లి చేసుకొని కొత్త ఇంట్లోకి అడుగుపెట్టేటప్పుడు పుట్టే భావోద్వేగాలు ప్రపంచవ్యాప్తంగా ఒకేలా ఉంటాయని ఈ ఆచారం నిరూపిస్తోంది. ఇక ఈ వింత సంప్రదాయం వినడానికి కొంచెం వింతగా ఉన్నా, అందులోని అంతరార్థం మాత్రం చాలా గొప్పది!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu