Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పేరుకే మంత్రులు .. పెత్తనమేదీ ?

పేరుకే మంత్రులు .. పెత్తనమేదీ ?

Tupaki.com 6 days ago

'తెలంగాణ క్యాబినెట్ లో మంత్రులకు పూర్తి స్థాయి స్వేచ్చ లేదు. దీంతో పనులు జరగడం లేదు. మంత్రులకు వారి శాఖలపై పూర్తి స్థాయి అధికారం, హక్కులతో పనిచేసే కల్పించాలి.

వారికి స్వేచ్చ ఇవ్వకుంటే కొత్త సమస్యలు తెర మీదకు వస్తాయి. వారికి డబ్బులు విడుదల చేసే హక్కు లేదు. దానికి వారు ఆర్థిక శాఖ చుట్టూ తిరుగుతున్నారు. నా నియోజకవర్గానికి నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు పనులను ఆమోదించినా ఆర్థిక శాఖ నిధులు విడుదల చేయడం లేదు' అని కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

రెండున్నరేళ్లుగా ఇదే సాగుతుందని, ఒక్క పని కూడా ముందుకు వెళ్లడం లేదని, నేను కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ ఎమ్మెల్యేను కాబట్టి నేను ప్రభుత్వాన్ని బలంగా విమర్శంచలేను. అలాగని మౌనంగాను ఉండలేను. మంత్రులు నా సౌమ్యతను తీసుకుని వ్యవహరిస్తున్నారు అని కూనంనేని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు పనులు వారి శాఖలకు సంబంధించిన పనులను ఆమోదించినా వాటికి ఆర్థికశాఖ నిధులు మంజూరు చేయక పోవడం మూలంగా పనులు ఆగిపోతున్నాయని ఆయన అంటున్నారు.

2023 శాసనసభ ఎన్నికల్లో సీపీఐ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లింది. ఈ ఎన్నికల్లో కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నియోజకవర్గం నుండి పోటీ చేసి ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి జలగం వెంకట్రావు మీద 26 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు 37,555 ఓట్లు సాధించి మూడో స్థానానికి పరిమితం అయ్యాడు.

కాంగ్రెస్ పార్టీతో పొత్తు మూలంగా మిత్రపక్షంగా ఉన్నప్పటికీ అభివృద్ధి నిధులు, రహదారులు, సింగరేణి ఉద్యోగాలు, భూ సమస్యలు, ఉద్యోగుల డీఎ, ఆర్థీసి వంటి అంశాలలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ప్రభుత్వానికి బయట నుండి మద్దతు ఇస్తూనే వివిధ సమస్యలపై పార్టీ పరంగా గళం ఎత్తుతూనే ఉన్నారు.

స్వాతంత్రానికి ముందు 1930 నుండి కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీలోని వామపక్ష వాదులతో కలిసి పనిచేశారు. 1952లో దేశంలో సీపీఐ సాధారణ ఎన్నికల్లో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. 1964లో కమ్యూనిస్టులు సీపీఐ - సీపీఎంలుగా విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పో కలిసి నడిచేందుకు సీపీఐ మొగ్గుచూపింది. 1980, 1985, 1994 ఎన్నికల్లో సీపీఐ టీడీపీతో పొత్తు పెట్టుకుంది. 2004లో సీపీఐ, సీపీఎంలు కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుని 15 స్థానాల్లో గెలిచాయి. తెలంగాణ - ఆంధ్ర విడిపోయిన తర్వాత వామపక్షాలు రెండు రాష్ట్రాల్లో బలహీనపడ్డాయి. 2023 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్తగూడెం నుండి కూనంనేని ఒక్కరే సీపీఐ నుండి గెలవడం గమనార్హం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu