Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పేటలో 'మార్పు': 'చెద'లవాడ రాజకీయం.. !

పేటలో 'మార్పు': 'చెద'లవాడ రాజకీయం.. !

Tupaki.com 1 week ago

మ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయంగా మార్పులు వచ్చే అవకాశం ఉందని టిడిపి నాయకుల మధ్య పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

ప్రస్తుత ఎమ్మెల్యేపై పార్టీ అధిష్టానం లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని నాయకులు చెబుతున్నారు. గత కొన్నాళ్లుగా వివాదాలకు అత్యంత దగ్గరగా వ్యవహరించడంతో పాటు పార్టీ అధిష్టానాన్ని కూడా లెక్కచేయునట్టుగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అధికారులపై దూకుడుగా వ్యవహరించడం.. తాను పట్టిన పట్టు విడవకుండా ప్రవర్తించటం వంటివి పార్టీ అధినేతకు ఇటీవల ఆగ్రహాన్ని తెప్పించాయి.

అయితే నేరుగా ఎమ్మెల్యే పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండానే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని తద్వారా వచ్చే ఎన్నికలనాటికి వేరే వారికి అవకాశం కల్పించాలని కూడా చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో చదలవాడ అరవింద బాబు నరసరావుపేట నుంచి తొలిసారి విజయం దక్కించుకున్నారు. అయితే ఆయన వ్యవహారం అప్పటినుంచి వివాదంగానే ఉంది. అధికారుల పై దూకుడుగా వ్యవహరించడంతోపాటు దూషించటం వంటివి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చాయి.

అదే సమయంలో మీడియాలోనూ ఆయన ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. ఈ పరిణామాలతో కీలకమైన ముఖ్యంగా టిడిపికి బలమైన మద్దతు ఇచ్చే నరసరావుపేట నియోజకవర్గంలో పార్టీ దెబ్బతినే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ క్రమంలోనే ఇప్పటికి రెండుసార్లు అరవిందు బాబును పార్టీ అధిష్టానం హెచ్చరించింది. పద్ధతి మార్చుకోవాలని కూడా చెప్పింది. కానీ, ఇప్పటివరకు ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. పైగా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఆయన అందుబాటులో ఉండడం లేదన్నది ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

ఇది లా ఉంటే అసలు టార్గెట్ చేయాల్సిన ప్రతిపక్షాన్ని ఎక్కడ పన్నెత్తు మాట కూడా ఆయన అనడం లేదు. కనీసం వైసిపి నాయకులపై ఒక్క విమర్శ కూడా చేయడం లేదు. లేనివి ఉన్నట్టు.. ఉన్నవి లేనట్టు చెప్పాలని ఎవరు అనుకోవడం లేదు. కానీ రాజకీయంగా దూకుడు అయితే ప్రదర్శించాలి. ఆ దూకుడు మిస్సయింది. దీంతో అన్ని విధాలా చదలవాడకు మైనస్ మార్కులు పడ్డాయి అన్నది పార్టీలో జరుగుతున్న చర్చ. దీంతో మార్పు దిశగా నరసరావుపేట అడుగులు వేస్తుంది అన్నది ప్రస్తుతానికి ఉన్న ప్రధాన అంచనా. మరి ఎన్నికల సమయానికి ఏం జరుగుతుందనేది చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu