Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెట్రోల్ బాదుడు:  వారు వీరిపైన.. వీరు వారిపైన!

పెట్రోల్ బాదుడు: వారు వీరిపైన.. వీరు వారిపైన!

Tupaki.com 1 week ago

పెట్రోల్ ధరల పెంపు ఎప్పటికప్పుడు తీవ్ర వివాదంగా మారుతోంది. వాస్తవానికి గతంలో రూపాయి చొప్పు న పెరిగితేనే దేశవ్యాప్తంగా కలకలం రేగేది. పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు కనిపించేవి.

కానీ.. రాను రాను రాజకీయాల్లోనూ ఈ వ్యవహారం పెద్దగా స్పందనలేని విషయంగా మారిపోయింది. తాజాగా రూ.3 చొప్పున పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినా.. దేశంలో పెద్దగా స్పందన కనిపించడంలేదు. ఏదో సోషల్‌ మీడియాలో నాలుగు కామెంట్లు.. రెండు విమర్శలు అన్నట్టుగా మారిపోయింది.

అయితే.. అసలు పెట్రోలు, డీజిల్ ధరలను అదుపు చేయలేరా? అంటే.. చేయొచ్చు. ఇతర వస్తువులను.. సేవలను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువచ్చినట్టే.. ఇప్పుడు పెట్రోలు, డీజిల్‌ను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావచ్చు. తద్వారా.. స్థానిక పన్నులు, వ్యాట్‌, లైబ్రరీ సెస్సు వంటివి ఉండవు. కేవలం జీఎస్టీ పరిధిలోని శ్లాబుల్లోనే పెట్రోలు , డీజిల్ ఉంటాయి. తద్వారా పన్నుల బాధ తప్పి.. ధరలు దిగి వచ్చే అవకాశం ఉంటుంది.

కానీ, ఇలా చేసేందుకు గత 10 సంవత్సరాలుగా రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదని కేంద్రం, కేంద్రానికి చిత్తశు ద్ధి లేదని రాష్ట్రాలు ఒకరిపై ఒకరు.. విమర్శలు చేసుకోవడం.. నిందలు మోపుకోవడంతోనే సరిపుచ్చుతు న్నారు. దీంతో రాష్ట్రాల పరిధిలో వ్యాట్ , ఇతర పన్నుల భారం పెరిగి.. పెట్రోలు ధరలు ఆకాశాన్ని అంటు తున్నాయి. ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కూడా.. ఒక్క ఏపీలోనే పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి. ఇక్కడ భారీ ధరలు ఉన్నాయి. గత వైసీపీ హయాంలోనే పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి.

దీంతో పొరుగు రాష్ట్రాల్లో ధరలు తక్కువగా ఉన్నాయంటూ.. మీడియా పెద్ద ఎత్తున అప్పట్లో హడావుడి చేసింది. అంతేకాదు.. టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ కూడా.. పెట్రోలు ధరల ను తాము వచ్చాక తగ్గిస్తామన్నారు. కానీ.. ఏమాత్రం తేడా లేదు. కాగా.. అసలు పెట్రోలు, డీజిల్ ను.. జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్నది.. మేధావులు సూచిస్తున్నమాట. అయితే.. దీనివల్ల తమకు వచ్చే పన్నులను కేంద్రం లాగేసుకుని.. జనాభా ప్రాతిపదికన కేటాయిస్తే.. నష్టపోతామన్న.. వాదన రాష్ట్రాల నుంచి వినిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu