Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పిల్లలను కనకండి.. కుక్కలను పెంచుకోండి!

పిల్లలను కనకండి.. కుక్కలను పెంచుకోండి!

Tupaki.com 1 week ago

బాలీవుడ్ నటి షెఫాలీ షా సంచలన వ్యాఖ్యలతో నిత్యం మీడియాలో నానుతూనే ఉంటుంది. తాజాగా అమ్మడు నేటి తరం యువతులకు పెళ్లి పిల్లల పెంపకంపై ఇచ్చిన ఓ సలహా నెటిజన్లలో తీవ్ర చర్చకు దారితీసింది.

మారుతున్న కాలంలో మహిళలు తమ జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలనే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `పిల్లలను కనకండి.. కేవలం కుక్కలను మాత్రమే పెంచుకోండి` అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షెఫాలీ షా ఈ విధమైన సలహా ఇవ్వడం వెనుక ఓ లోతైన అంతరంగాన్ని కూడా విడమర్చి చెప్పింది.

నేటి సమాజంలో పిల్లలను కనడం, వారిని సరైన పద్ధతిలో పెంచి పెద్ద చేయడం అనేది అత్యంత బాధ్యతతో కూడుకున్న పని అంటోంది. పిల్లల పెంపకం కోసం మహిళలు తమ కెరీర్‌ను, వ్యక్తిగత కలలను త్యాగం చేయాల్సి వస్తోందని ఆ ఒత్తిడిని భరించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడింది. దానికి బదులుగా పెంపుడు జంతువులను పెంచుకుంటే, అవి ఇచ్చే ప్రేమ , సంతోషం జీవితాన్ని మరింత ప్రశాంతంగా మారుస్తాయని అంటోంది. సొంత వైవాహిక జీవితం , ఇద్దరు కుమారుల పెంపకం గురించి ప్రస్తావించింది.

తాను ఒక తల్లిగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని షెఫాలీ అంగీకరించారు. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వారి చదువులు, భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు నిరంతరం ఆందోళన చెందాల్సి ఉంటుందని చెప్పారు. కానీ కుక్కల విషయానికి వస్తే అవి ఎల్లప్పుడూ మనపై నమ్మకంగా ఉంటాయని వాటితో ఉండే బంధం ఎంతో నిష్కల్మషంగా ,తక్కువ ఒత్తిడితో ఉంటుందని వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంది. ఈ వ్యాఖ్యలు కెరీర్ వైపు అడుగులు వేస్తున్న నేటి తరం యువతులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. ప్రస్తుతం చాలామంది మహిళలు పెళ్లిని, పిల్లలను వాయిదా వేస్తూ స్వయంసమృద్ధి కోసం పోరాడుతున్నారు.

అలాంటి వారికి షెఫాలీ మాటలు మద్దతుగా అనిపించినా? సాంప్రదాయ కుటుంబ విలువలను నమ్మే కొందరు మాత్రం ఈ సలహాను తప్పుబడుతున్నారు. పిల్లలను కనడం ద్వారా వచ్చే మాతృత్వపు అనుభూతిని, పెంపుడు జంతువులతో పోల్చడం సరికాదని వాదిస్తున్నారు. మరికొంత మంది అమ్మడు వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ప్రతిగా షెఫాలీ తాను కేవలం ఒక ప్రత్యామ్నాయ ఆలోచనను మాత్రమే పంచుకున్నానని.. ఎవరి జీవిత నిర్ణయాలు వారి వ్యక్తిగత ఇష్టాలపై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేసింది. అయితే ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఇలాంటి బోల్డ్ స్టేట్‌మెంట్ ఇవ్వడం బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. షెఫాలీ షా `ఢిల్లీ క్రైమ్`, `డార్లింగ్స్` వంటి ప్రాజెక్టులతో మహిళా ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu