Sunday, 24 Jan, 9.35 am Tupaki.com

పొలిటికల్ న్యూస్
ప్లాస్టిక్ జెండా ఎగురవేస్తే కఠిన చర్యలు: కేంద్రం వార్నింగ్

జనవరి 26.. భారత గణతంత్ర దినోత్సవం. ఈ వేడుకకు ఊరు వాడ పల్లె పట్టణం అంతా రెడీ అవుతున్నారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.ఈ జెండా పండుగులో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడమే ముఖ్యం. ఈ క్రమంలో కేంద్రప్రభుత్వం తాజాగా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఈ సారి ప్లాస్టిక్ జెండాలు ఉపయోగించవద్దని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ మేరకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది.

దేశంలో ఎక్కడా ప్లాస్టిక్ జెండాను ఎగురవేయవద్దని కేంద్రం స్పష్టం చేసింది. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ సల్ట్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ 1971 కింద కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇక ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 ప్రకారం నిబంధనలను అతిక్రమించవద్దని కేంద్రం స్పష్టం చేసింది. అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu
Top