Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పోస్టర్ లో మిస్సింగ్.. నటి Vs డైరెక్టర్.. ఎవరిది తప్పు?

పోస్టర్ లో మిస్సింగ్.. నటి Vs డైరెక్టర్.. ఎవరిది తప్పు?

Tupaki.com 1 week ago

సోషల్ మీడియాలో ప్రస్తుతం నటి, యాంకర్‌ సునయన బాదం పేరు ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ వీడియోలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె..

ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ హ్యాపీ జర్నీ ఫస్ట్‌ లుక్ పోస్టర్ వివాదంతో వార్తల్లో నిలిచారు. పోస్టర్‌ లో తన ఫోటో లేకపోవడంపై సునయన ఆవేదన వ్యక్తం చేయగా.. దీనికి దర్శకుడు అభిరామ్ నాయుడు స్పందిస్తూ వివరణ ఇచ్చారు. దీంతో ఆ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

యాంకర్‌ గా, ఆర్జే గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసిన సునయన బాదం.. తర్వాత నటిగా తనకంటూ ఫేమ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో మహిళల జీవితాల్లో ఎదురయ్యే సమస్యలను కామెడీగా చూపిస్తూ చేసిన వీడియోలతో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ కాన్సెప్ట్‌ తో ఆమెకు గుర్తింపు వచ్చింది.

ఇటీవల హ్యాపీ జర్నీ ఫస్ట్‌ లుక్ పోస్టర్ విడుదలైంది. ఆ చిత్రంలో ఆమని, ఝాన్సీ, అన్నపూర్ణమ్మ, పాయల్ రాధాకృష్ణ, జినిషా అలీశెట్టి, రూపా శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు అభిరామ్ నాయుడు తెరకెక్కిస్తున్న ఆ సినిమాను బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఏడుగురు మహిళల జీవితాలు, వారి ఎమోషన్స్ నేపథ్యంలో చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.

అయితే విడుదలైన ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ లో సునయన పిక్ లేకపోవడమే వివాదానికి దారితీసింది. ఆ విషయంపై ఆమె ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశారు. "హ్యాపీ జర్నీ పోస్టర్‌ లో నేను లేకపోవడం బాధగా ఉంది. అందరూ ఎందుకు లేవని నన్ను అడుగుతున్నారు. వేరే కంట్రీ వెళ్లినప్పుడు చిన్న గ్యాప్ ఉంటే ఎవరైనా షాపింగ్ స్టోర్స్ కు వెళ్తారు. కాస్త పని ఉంటే పక్కకు వెళ్తారు.. అంతమాత్రాన తీసేస్తారా?" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సునయన వ్యాఖ్యలు వైరల్ కావడంతో దర్శకుడు అభిరామ్ నాయుడు రెస్పాండ్ అయ్యారు. షూటింగ్ సమయంలో జరిగిన పరిస్థితుల వల్లే పోస్టర్‌ లో ఆమె ఫోటో లేకపోయిందని చెప్పారు. "పారిస్ వరకు షూటింగ్‌ కు వచ్చినప్పుడు అందుబాటులో ఉండాలి. ఎంత తక్కువ టైమ్ లో ఎలా షూట్ చేశామో సునయనకు కూడా తెలుసు. అలాంటప్పుడు మీరు సెట్లో మా పక్కన ఉండాలి కానీ, అక్కడెక్కడో మిక్సర్ బాగుందట, బజ్జీలు బాగుందట అటు ఇటు తిరగడానికి, షాపింగ్ చేసుకోవడానికి వెళ్తే పోస్టర్లో ఎలా ఉంటారండి? దొరికిన తక్కువ టైంలో పోస్టర్స్ కు ఫోటోలు తీసుకున్నాం. అవే రిలీజ్ చేశాం" అని తెలిపారు.

అంతేకాకుండా తర్వాత వీఎఫ్‌ఎక్స్ ద్వారా ఆమెను పోస్టర్‌ లో యాడ్ చేయాలని ప్రయత్నించామని, కానీ నేచురల్ గా కనిపించకపోవడంతో తానే వద్దని చెప్పినట్లు అన్నారు. "ఆ రోజు లొకేషన్లో ఉండి ఉంటే ఈరోజు పోస్టర్‌ లో ఉండేవారు. నేను ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. ఇప్పుడు బాధపడితే ఏం చేయలేను" అని చెప్పారు. ఇలా సునయన-దర్శకుడి మధ్య జరిగిన పోస్టర్ వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్‌ గా మారింది. అయితే ఇప్పుడు కొందరు నెటిజన్లు సునయనకు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు దర్శకుడి క్లారిటీ సరైనదేనని అభిప్రాయపడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu