Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రభాస్ + మహేష్.. ఇక దిష్టి తీయించుకో అబ్బాయ్!

ప్రభాస్ + మహేష్.. ఇక దిష్టి తీయించుకో అబ్బాయ్!

Tupaki.com 2 weeks ago

'రోమాంచకం' రిలీజ్‌కు ముందే సుమంత్ ప్రభాస్‌కు దొరికిన సపోర్ట్ చూస్తే ఈ టైటిల్ అతనికే సెట్ అవుతుంది. ఒకవైపు తన పేరులోనే పెట్టుకున్న ప్రభాస్ డైరెక్ట్ గా కెమెరా ముందుకు వచ్చి టీమ్‌కు విషెస్ చెప్పాడు.

ఇప్పుడు మహేష్ బాబు కూడా సినిమా ఎంటర్‌టైనింగ్‌గా, ప్రామిసింగ్‌గా కనిపిస్తోందంటూ ట్వీట్ చేశాడు. మొదటి నుంచి సందీప్ రెడ్డి వంగా బ్రాండ్ అండగా ఉంది. కొత్త హీరో సినిమా రిలీజ్‌కు ముందు ప్రభాస్, మహేష్ లాంటి ఇద్దరు స్టార్లు ఇలా మాట్లాడటం చిన్న విషయం కాదు. అందుకే ఇప్పుడు సుమంత్‌ను "దిష్టి తీయించుకో అబ్బాయ్" అంటున్నారు జనాలు.

ప్రభాస్ సపోర్ట్ కూడా ఒక ఫోటోతో ఆగలేదు. 'రోమాంచకం' టీమ్‌ను ఇంటికి పిలిచి కాసేపు మాట్లాడాడు. సుమంత్ షర్ట్‌పై సైన్ చేశాడు. తర్వాత టీమ్‌తో కలిసి ఫోటోలు దిగాడు. సినిమా టీమ్‌కు తన విషెస్ కూడా చెప్పాడు. ఎప్పటి నుంచో ప్రభాస్ ఫ్యాన్‌గా ఉన్న సుమంత్‌కు, తన సినిమా రిలీజ్ ముందు అదే హీరో నుంచి ఇలా పబ్లిక్ సపోర్ట్ రావడం అతని జర్నీలో గుర్తుండిపోయే మూమెంట్ అయింది.

ఇప్పుడు మహేష్ బాబు ట్వీట్ మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. సినిమా ఎంటర్‌టైనింగ్‌గా, ప్రామిసింగ్‌గా కనిపిస్తోందని చెప్పడంతో పాటు సందీప్, ప్రణయ్, మొత్తం టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌లో పెట్టిన ప్రేమ, ప్యాషన్, హార్డ్ వర్క్ కనిపిస్తోందని కూడా రాశారు. ఒక కొత్త హీరో సినిమాపై మహేష్ ఇలా స్పందించడం వల్ల 'రోమాంచకం' పేరు మరోసారి పెద్ద ఆడియన్స్ దగ్గరకు వెళ్లింది.

సుమంత్ ఈ హీరో స్థాయికి అంత ఈజీగా వచ్చేయలేదు. ఒకప్పుడు ఐమ్యాక్స్ దగ్గర సినిమాలు చూసి రివ్యూలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రాంక్స్ చేశాడు. షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. చిన్న చిన్న వీడియోలతో తనకు తానే ఆడియన్స్ తయారు చేసుకున్నాడు. తర్వాత 'మేమ్ ఫేమస్'తో హీరోగా మాత్రమే కాదు, దర్శకుడిగానూ తనను చూపించాడు. అక్కడి నుంచి ఇప్పుడు వంగా టీమ్ నిర్మించిన సినిమాలో లీడ్‌గా రావడం అతని కెరీర్‌లో అతిపెద్ద షిఫ్ట్.

'రోమాంచకం'కు మొదటి నుంచే వంగా పేరు పెద్ద ప్లస్ అయింది. సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తుండటం, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించడం వల్ల రెగ్యులర్ కొత్త హీరో సినిమాకు దొరకని ఫోకస్ దీనికి వచ్చింది. ప్రమోషన్స్‌లో కూడా వంగా స్వయంగా ముందుండటం, ఇప్పుడు ప్రభాస్, మహేష్ నుంచి వచ్చిన సపోర్ట్ కలవడంతో రిలీజ్‌కు ముందు కావాల్సినంత రీచ్ వచ్చింది. ఇలాంటి బ్యాకింగ్ కొత్తగా వస్తున్న ప్రతి హీరోకు దొరకదు. ఇక ఈ రోజుతో 'రోమాంచకం' సంగతేంటి అనేది తెలుస్తుంది. గత రాత్రి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. ఇప్పటివరకు పేర్లు, ప్రమోషన్స్, స్టార్ విషెస్ సుమంత్‌ను థియేటర్ గుమ్మం వరకు తీసుకొచ్చాయి. టాక్ బాగుంటే మాత్రం అక్కడి నుంచి అతని కెరీర్ మరో లెవెల్ కు వెళ్లొచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu