Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రొఫైల్ కోసం పర్ఫెక్ట్ లుక్.. ఆకట్టుకుంటున్న శోభిత!

ప్రొఫైల్ కోసం పర్ఫెక్ట్ లుక్.. ఆకట్టుకుంటున్న శోభిత!

Tupaki.com 6 days ago

సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు పంచుకునే ఫోటోలు అభిమానులను ఆకట్టుకోవడమే కాదు.. ఫాలోవర్స్ ను కూడా పెంచుతున్నాయి. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు చాలా అందంగా, ట్రెడిషనల్ గా ముస్తాబయ్యి ఆకట్టుకుంటుంటే ..

మరికొంతమంది గ్లామర్ డోస్ పెంచేసి సెగలు పుట్టిస్తున్నారు. ఇంకొంతమంది లేడీ బాస్ గెటప్లో మైమరపింప చేస్తున్నారు అనడంలో సందేహం లేదు. అలాంటి వారిలో అక్కినేని కోడలు శోభిత ధూళిపాల కూడా ఒకరు . అటు సంప్రదాయానికైనా ఇటు ఫ్యాషన్ సెన్స్ కైనా కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ ..తాజాగా ప్రొఫైల్ కోసం పర్ఫెక్ట్ లుక్ లో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.

తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఆ ఫోటోల కింద లింక్డ్ ఇన్ ప్రొఫైల్ కోసం అంటూ క్యాప్షన్ కూడా జోడించింది

ఇక ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. లింక్డ్ ఇన్ ప్రొఫైల్ కోసం శోభిత ధూళిపాల చాలా అందంగా ముస్తాబయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇందులో నేవీ బ్లూ షూట్ ధరించి జుట్టును క్రాప్ చేసి చాలా స్టైలిష్ గా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఇక మెడను సింపుల్ నెక్ చైన్ తో ఫుల్ ఫిల్ చేసిన శోభిత స్టైలిష్ ఫోజులు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసాయి. మొత్తానికైతే లింక్డ్ ఇన్ లో పెట్టడానికి ఈ ఫోటోలు షేర్ చేశాను అంటూ శోభిత చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

శోభిత విషయానికి వస్తే.. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె విశాఖపట్నంలో లిటిల్ ఏంజెల్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్లో తన విద్యాభ్యాసం పూర్తి చేసింది. ముంబై యూనివర్సిటీ హెచ్ ఆర్ కాలేజ్ లో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేసిన ఈమె భరతనాట్యం, కూచిపూడి వంటి సాంప్రదాయ నృత్యాలలో శిక్షణ కూడా పొందింది. ఇండస్ట్రీలోకి రాకముందు మోడల్ గా కెరియర్ ను ఆరంభించిన శోభిత.. 2013 మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొని రెండవ స్థానంలో నిలిచింది.

అలాగే 2013లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీలలో ఇండియా తరఫున పాల్గొని అందరి దృష్టిని ఆకట్టుకుంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా పాపులారిటీ సొంతం చేసుకున్న శోభిత తొలిసారి అడివి శేష్ హీరోగా, మహేష్ బాబు నిర్మించిన మేజర్ సినిమాలో కీలకమైన పాత్ర పోషించి, తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0 లో తొలిసారి తెరపై కనిపించింది.

బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. అక్కినేని నాగచైతన్య తో ప్రేమలో పడి సౌత్ లో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా నాగచైతన్యతో నిశ్చితార్థం జరిగిన తర్వాత

..టాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే అత్యంత ప్రజాదారణ పొందిన నటీమణిగా పేరు సొంతం చేసుకుంది ..ఇక 2024 ఆగస్టు 4న అన్నపూర్ణ స్టూడియోలో నాగచైతన్యతో ఏడడుగులు వేసింది శోభిత. పెళ్లి తర్వాత కూడా సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీగా మారిపోయింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu