Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పూరి మ్యూజింగ్స్: మనల్ని యుద్ధానికి సిద్ధం చేసేది ఏదో తెలుసా?

పూరి మ్యూజింగ్స్: మనల్ని యుద్ధానికి సిద్ధం చేసేది ఏదో తెలుసా?

Tupaki.com 1 week ago

ర్శకుడు పూరి జగన్నాథ్ తన `పూరి మ్యూజింగ్స్`లో `కార్డిసాల్` అనే స్ట్రెస్ హార్మోన్ గురించి.. అది మన శరీరాన్ని ఎలా నియంత్రిస్తుందో చాలా ప్రాక్టికల్‌గా వివరించారు.

కిడ్నీల పైభాగంలో ఉండే అడ్రినల్ గ్లాండ్స్ నుండి విడుదలయ్యే ఈ హార్మోన్ గురించి ఆయన మాటల్లోని సారాంశం పరిశీలిస్తే....

``మనం భయపడినా లేదా టెన్షన్ పడినా మన మెదడు వెంటనే బాడీని `ఎమర్జెన్సీ మోడ్` లోకి తీసుకెళుతుంది. అడ్రినల్ గ్లాండ్స్ నుంచి కార్డిసాల్ అనే హార్మోన్ రక్తం లోకి విపరీతంగా రిలీజ్ అవుతుంది. ఇది కేవలం మనల్ని ప్రమాద సమయాల్లో అలెర్ట్ చేయడానికి ప్రకృతి ఇచ్చిన ఒక మెకానిజం. ``టెన్షన్ పడినప్పుడు మన కడుపులో సీతాకోకచిలుకలు ఎగిరినట్టు`` అనిపిస్తుంది. అది మరేదో కాదు, మీ బాడీ మిమ్మల్ని యుద్ధానికి సిద్ధం చేస్తోందని అర్థం.

కార్డిసాల్ మన బాడీ మెటాబాలిజాన్ని మెయింటెయిన్ చేస్తుంది. నార్మల్‌గా ఇది ఉదయం పూట ఎక్కువగా ఉంటుంది.. అందుకే మనం ఉదయాన్నే అలెర్ట్‌గా నిద్ర లేస్తాం.. రాత్రి సమయానికి ఇది నెమ్మదిగా తగ్గిపోతుంది. అప్పుడే మనకు ప్రశాంతంగా నిద్ర పడుతుందని తెలిపారు. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే.. ఒత్తిళ్లు లేకపోయినా మనం చిన్న చిన్న విషయాలకే అంటే ట్రాఫిక్ జామ్ అయినా, బాస్ తిట్టినా.. ఎవడో కామెంట్ చేసినా టెన్షన్ పడిపోతున్నాం. అంటే మన బాడీలో కార్డిసాల్ లెవల్స్ ఎప్పుడూ హై లోనే ఉంటున్నాయి.

కార్డిసాల్ రిలీజ్ అయినప్పుడు బాడీలోని రోగనిరోధక శక్తి .. జీర్ణక్రియ ఆగిపోతాయి. ఎందుకంటే అప్పుడు బ్రతకడం ముఖ్యం కానీ అరగడం కాదు. మీరు రోజూ టెన్షన్ పడితే మీ బాడీ ఎప్పుడూ ఎమర్జెన్సీ మోడ్ లోనే ఉంటుంది. దీనివల్ల షుగర్ వస్తుంది.. జుట్టు ఊడిపోతుంది, వయసు పెరిగిపోతుందిని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే దేనికీ టెన్షన్ పడకండి. మీ బాడీని పదే పదే ఆ ఎమర్జెన్సీ మోడ్ లోకి నెట్టకండి. అంతా లైట్ తీసుకోండి.. చిల్ అవ్వండి! అని కూడా సూచిస్తున్నారు. పూరి తన మ్యూజింగ్స్ లో ఒక అద్భుతమైన ఎలిమెంట్ గురించి వివరించారు.

పూరి జగన్నాథ్ కెరీర్ మ్యాటర్ కి వస్తే... అతడు విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి `స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్` అనే టైటిల్ . ఈ చిత్రం ప్రస్తుతం సినీ ప్రియులలో అమితాసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక విడుదల తేదీని ప్రకటించలేదు. అయితే సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, ఆయన రగ్గడ్ లుక్ .. చేతిలో రక్తంతో ఉన్న కత్తి ఈ సినిమా ఇంటెన్సిటీని ఆవిష్కరించాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబై, హైదరాబాద్ పరిసరాల్లోని వివిధ లొకేషన్లలో జరుగుతోంది. కోలీవుడ్ మక్కల్ సెల్వన్ సహజ నటనకు, పూరి మార్క్ మాస్ ఎలిమెంట్స్ తోడైతే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కీలక దశలో ఉంది. 2026 చివరిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu