Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాఘవేంద్రుడి కంటే ముందే అన్నమయ్యను ఆ డైరెక్టర్ తీయబోయారా ?

రాఘవేంద్రుడి కంటే ముందే అన్నమయ్యను ఆ డైరెక్టర్ తీయబోయారా ?

Tupaki.com 6 days ago

న్నమయ్య 1997లో వచ్చిన భక్తి రస చిత్రం. కె రాఘవేంద్రరావు కెరీర్ లోనే ఒక అద్భుత చిత్ర రాజంగా ఉంటుంది. అంతే కాదు అక్కినేని నాగార్జున చిత్రాలలో ది బెస్ట్ గా ఉంటుంది.

ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పటికి ముప్పయ్యేళ్ల గడచినా అన్నమయ్య చిత్రం ఇంకా జనాల గుండెలలో ఉంది. అది ఎవర్ గ్రీన్ మూవీగా చెబుతారు. ఈ సినిమాలో పాటలు కానీ నాగార్జున నటన కానీ దర్శకేంద్రుని ప్రతిభ కానీ కీరవాణి సంగీతం బాలూ ఇతర గాయకుల గానం ఇవన్నీ అన్నమయ్యకు చిర స్థాయి కీర్తిని ఆర్జించి పెట్టాయి. అయితే అన్నమయ్య సినిమాను రాఘవేంద్రరావు తీయడం ఒక వరంగా కూడా ఆయనే చెప్పుకున్నారు. కానీ ఈ చిత్రాన్ని తీయాలని ఆయన కంటే ముందు ఎంతో మంది ప్రయత్నించి కూడా ఎందుకో సాకారం చేసుకోలేకపోయారు అని చెబుతారు.

జంధ్యాల మదిలో అలా :

మొదట మాటల రచయితగా తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించిన జంధ్యాల 1981 నాటికి ముద్ద మందారం చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. తొలి సినిమా సూపర్ హిట్ కావడంతో ఆయన దర్శకత్వ ప్రతిభ అందరికీ తెలిసింది. అది లగాయితూ ఎన్నో హాస్య రస చిత్రాలను రూపొందించి తెలుగు వారికి ఇష్ట దర్శకుడిగా జంధ్యాల మారారు. ఆయన 1984లో తీసిన ఆనందభైరవి మూవీ ఆయనలోని కళాత్మ కోణాన్ని కూడా ఆవిష్కరించింది. అంతే కాదు శంకరాభరణం సాగర సంగమం వంటి చిత్రాల కోవలో ఈ మూవీని నిర్మించారు అన్న పేరుని కూడా జంద్యాల దక్కించుకున్నారు. సరిగ్గా అదే సమయంలో జంధ్యాలకు ఒక ఆలోచన తట్టింది. అదే అన్నమయ్య జీవిత చరిత్రను సినిమాగా రూపొందించాలని. ఎందుకంటే సంగీత నాట్య ప్రధానమైన ఇతి వృత్తంతో ఆనందభైరవి సినిమా తీసి జనాలను మెప్పించామని అన్నమయ్య వంటి ఆధ్యాత్మిక సంగీత చిత్రాన్ని తీసినా జనాలు ఆదరిస్తారు అన్న నమ్మకం జంధ్యాలలో కలిగింది అని అంటారు.

చకచకా ప్రాజెక్ట్ తో :

అంతే ఈ ఆలోచన వచ్చిందే తడవుగా జంధ్యాల చకచకా ప్రాజెక్టుని ముందుకు పరుగులు తీయించారు. తన ఆస్థాన సంగీత దర్శకుడు రమేష్ నాయుడుని మ్యూజిక్ డైరెక్టర్ గా జంధ్యాల అన్నమయ్యకు సెలెక్ట్ చేశారు. సంగీత దర్శకుడు రమేష్ నాయుడుతో కలిసి 40కి పైగా పాటలను కూడా రికార్డ్ కూడా చేశారు. నటీ నటుల ఎంపిక కోసం కూడా భారీ అన్వేషణ చేశారు. ముంబైకి చెందిన ఒక నటుడిని అన్నమయ్య పాత్ర చేయించాలని అనుకున్నారు. జంధ్యాల అన్నమయ్య అనగానే చాలా మంది వచ్చి ఆ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో తామూ భాగస్వామ్యం అయ్యారు. ఇలా అన్నీ కలిసి వచ్చి షూటింగ్ కి కూడా రంగం చేసుకున్నారు కానీ ఎందుకో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇదే విషయాన్ని జంధ్యాల తరువాత పలు ఇంటర్వ్యూలలో చెప్పారు కూడా.

పద కవితా పితామహుడు అన్నమయ్య సినిమా తీయాలని ఎంతో ప్రగాఢమైన కోరిక జంధ్యాలకు ఉన్నా కూడా ప్రాజెక్ట్ మాత్రం పట్టాలెక్కలేదు. లేకపోతే 1997లో కాదు 1985లోనే అన్నమయ్య మూవీ జనాల ముందుకు వచ్చేది. ఏది ఏమైనా ఏ గింజ మీద ఎవరి పేరు ఉంటే వారే ఆ మెతుకు తింటారు అన్నది ఒక కర్మ సిద్ధాంతం. సినిమాల విషయంలో కూడా అదే చెప్పుకోవాల్సి ఉంది. అందుకే అన్నమయ్య ప్రాజెక్టు చివరికి రాఘవేంద్రరావుకు చేరింది అని అంటారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu