Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజమౌళి కొడుకు.. ఈ మ్యాజిక్ క్లిక్కయ్యేనా..

రాజమౌళి కొడుకు.. ఈ మ్యాజిక్ క్లిక్కయ్యేనా..

Tupaki.com 3 days ago

స్‌.ఎస్‌. కార్తికేయ పేరు ఇప్పటివరకు ఎక్కువగా రాజమౌళి కొడుకుగానే వినిపించింది. కానీ ఇప్పుడు నిర్మాతగా తనదైన కెరీర్ ట్రాక్ ను మొదలుపెడుతున్నాడు.

ఇదివరకే షోయింగ్ బిజినెస్ ద్వారా 'ప్రేమలు' తెలుగు వెర్షన్‌ను విడుదల చేసి మంచి సక్సెస్ చూసిన కార్తికేయ, ఈసారి డైరెక్ట్ గా నిర్మాతగా వచ్చాడు. ఆర్కా మీడియా వర్క్స్‌తో కలిసి చేస్తున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది. ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో ఉండటం వలన మొదటి నుంచి ఈ ప్రాజెక్ట్‌కు క్రేజ్ ఉంది.

రాజమౌళి కొడుకు అనే పేరు ఒక వైపు ఉండొచ్చు. కానీ నిర్మాతగా గుర్తింపు అందుకోవాల్సింది తన సినిమా తోనే. అందుకే మొదటి ప్రయత్నానికే పెద్ద స్టార్ హీరో కమర్షియల్ సినిమా వైపు వెళ్లకుండా, ఫహాద్‌తో ఫాంటసీ కథను ఎంచుకున్నాడు. శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిన్నారి స్సారా కూడా కీలక పాత్రలో కనిపిస్తోంది.

టీజర్‌లో కూడా సినిమా ప్రపంచాన్ని పూర్తిగా చెప్పకుండా కొన్ని విచిత్రమైన పరిస్థితులను మాత్రమే చూపించారు. ఫహాద్ పాత్ర చుట్టూ ఫాంటసీ ఎలిమెంట్స్ ఉండగా, చిన్నారి పాత్రకు కూడా కథలో పెద్ద లింక్ ఉన్నట్టు కనిపిస్తోంది. తర్వాత వచ్చిన 'కేకు వాకు' పాట మాత్రం సినిమా టోన్ పూర్తిగా సీరియస్‌గా ఉండదనే హింట్ ఇచ్చింది. సౌరభ్ సచ్‌దేవ్ మరో పాత్రలో కనిపించనున్నాడు.

ఇప్పుడు రిలీజ్ డేట్ పోస్టర్‌తో మరో చిన్న పాయింట్ బయటపెట్టారు. మెట్లపై ఫహాద్ కూర్చుని ఉండగా, పక్కనే స్సారా చేతిలో కలర్ స్టిక్‌తో ఏదో మ్యాజిక్ చేస్తోంది. చుట్టూ డబ్బు వర్షంలా పడుతుంటే ఫహాద్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఈ ఒక్క పోస్టర్‌తోనే కథలో మ్యాజిక్ ఎలా పని చేస్తుందో చెప్పకుండా, దాని వల్ల వచ్చే పరిస్థితులను హైలెట్ చేశారు.

కార్తికేయకు ఆర్కా మీడియాతో కలవడంతో నిర్మాతగా మంచి బ్యాకప్ అనే చెప్పాలి. 'బాహుబలి' నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సినిమాలో భాగమవుతున్నారు. పెద్ద ప్రాజెక్టులు హ్యాండిల్ చేసిన టీమ్‌తో కలిసి మొదటి నిర్మాణం చేయడం వల్ల ప్రొడక్షన్ వైపు కూడా మంచి అనుభవం దొరుకుతుంది. కీరవాణి కొడుకు కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఇక 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కార్తికేయకు ఇది డిస్ట్రిబ్యూషన్ తర్వాత నిర్మాతగా మొదటి పెద్ద పరీక్ష. మరి ఎలాంటి గుర్తింపును అందుకుంటాడో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu