Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రామాయణం రిలీజ్ వేళ.. హాట్ టాపిక్‌గా మారిన పాత రచ్చ!

రామాయణం రిలీజ్ వేళ.. హాట్ టాపిక్‌గా మారిన పాత రచ్చ!

Tupaki.com 2 weeks ago

బాలీవుడ్ `రామాయణం` రిలీజ్ కు సమయం ఆసన్నమవుతోంది. రెండు భాగాలుగా నితీష్ తివారీ తెరకెక్కిస్తోన్న మొదటి రామాయణం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ నేపథ్యంలో సినిమాలో పాత్రలు ఎలా ఉంటాయి? రామాయణాన్ని ఎంత వరకూ డ్రెమటైజ్ చేసి ఉంటారు? నితీష్ రామాయణాన్ని ఎలాంటి కోణంలో చూపించబోతున్నారు? ఇలా రకరకాల డిస్కషన్స్ నెట్టింట జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో రామాయణం ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు వాటి వివాదాలు మళ్లీ సోషల్ మీడియాలో చర్చకొస్తున్నాయి.

ఇతిహాసమైన రామాయణం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సినిమాలు, యానిమేషన్ చిత్రాలు తెరకెక్కాయి. అయితే వీటిలో కొన్ని చిత్రాలు ఊహించని రీతిలో తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగానూ మారాయి. తాజాగా సోషల్ మీడియాలో `సీతా సింగ్స్ ది బ్లూస్` అనే అమెరికన్ ఫెమినిస్ట్ యానిమేషన్ సినిమా మరోసారి సోషల్ మీడియాలో చర్చనీ యాంశంగా మారింది. భారతీయ పురాణాన్ని ఒక విదేశీ మహిళా దర్శకురాలు పూర్తిగా భిన్నమైన పద్ధతిలో తెరకె క్కించడం పట్ల నెట్టింట పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమెరికన్ యానిమేటర్ నినా పాలే దర్శకత్వంలో ఏకంగా 2008లోనే విడుదలైన ఈ చిత్రం అప్పట్లోనే పెను వివాదాలను సృష్టించింది.

రామాయణాన్ని సీతాదేవి దృక్పథం నుంచి ఫెమినిస్ట్ కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేసిన పురాణ గాథను, ఆధునిక బ్రేకప్ కథతో ముడిపెట్టారు. ఈ యానిమేషన్ మూవీ భారతీయ సంప్రదాయాలను, హిందూ దేవతలను కించపరిచే విధంగా ఉందనే విమర్శలను ఎదుర్కొంది. సినిమాలోని కొన్ని సన్నివేశాలు, హాస్య ధోరణి పట్ల సాంప్రదాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు మళ్లీ ప్రభాస్ హీరోగా రిలీజ్ అయిన `ఆదిపురుష్` చిత్రం కూడా రామాయణాన్ని వక్రీకరించిందంటూ దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే.

అయితే `ఆదిపురుష్` పై వచ్చిన విమర్శల కంటే అమెరికన్ యానిమేషన్ చిత్రం మరింత వివాదాస్పదమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హిందూ ఇతిహాసాలను పాశ్చాత్య కోణంలోకి మార్చి వాటిని సెటైరికల్ పద్ధతిలో ప్రదర్శించడం పట్ల మతపరమైన సంఘాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. చిత్రంలో సీతాదేవి పాత్రను ఆధునిక మహిళల కష్టాలతో పోల్చుతూ చూపించిన తీరుపై భిన్న స్పందనలు వచ్చాయి. ఒక వర్గం దీనిని సృజనాత్మక స్వేచ్ఛగా సమర్ధించినా? మెజారిటీ ప్రేక్షకులు .. సాంప్రదాయవాదులు మాత్రం పురాణ పాత్రలను అగౌరవపరచడమేనని బలంగా వాదించారు. ముఖ్యంగా రామచంద్రుడి పాత్రను చిత్రించిన విధానంపై పెద్ద ఎత్తున అప్పట్లో నిరసనలు చెలరేగాయి.

కళాత్మకంగా యానిమేషన్ చిత్రం ప్రశంసలు అందుకున్నా? సాంస్కృతిక సున్నితత్వం విషయానికి వచ్చేసరికి తీవ్ర విమర్శల పాలైంది. ఏ దేశ సంస్కృతికైనా? వారి ఇతిహాసాలకైనా? ఒక పవిత్రత ఉంటుందని దానిని ప్రయో గాత్మక ప్రయోజనాల కోసం వక్రీకరించడం సరైన పద్ధతి కాదని మేధావులు అభిప్రాయపడ్డారు. ఈ సినిమా చుట్టూ జరిగిన వివాదాలు పాశ్చాత్య దేశాలలో పురాణాలపై ఉన్న అవగాహన లోపాలను కూడా ఎత్తిచూపాయి.

మొత్తానికి మూడేళ్ల క్రితం రిలీజ్ అయిన `అదిపురుష్` కంటే? దశాబ్దంన్నర క్రితం రిలీజ్ అయిన `సీతా సింగ్స్ ది బ్లూస్` వివాదం నెట్టింట ట్రెండింగ్ లో కి రావడం ఆసక్తికరం. మరి నితీష్ తివారీ రామాయణం రిలీజ్ అంతా సాఫీగా ఉంటుందా? వివాదాలు తెచ్చి పెడుతుందా? అన్నది చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu