Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాష్ట్రంలో వైసీపీ ఫిఫ్టీ - ఫిఫ్టీనే.. !

రాష్ట్రంలో వైసీపీ ఫిఫ్టీ - ఫిఫ్టీనే.. !

Tupaki.com 5 days ago

రాష్ట్రవ్యాప్తంగా వైసిపి సోమవారంనాడు పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమం కొన్ని కొన్ని జిల్లాల్లో బాగానే జరిగింది. మెజారిటీ జిల్లాల్లో మాత్రం నామమాత్రంగా జరిగింది.

ఇక మరికొన్ని జిల్లాల్లో మాత్రం అసలు ఊసే కనిపించ లేదు. విజయవాడ, గుంటూరు అదేవిధంగా నెల్లూరు, కడప, విజయనగరం జిల్లాల్లో వైసిపి చేపట్టిన నిరసన కార్యక్రమానికి స్పందన లభించింది. పలువురు నాయకులు రోడ్డెక్కారు. ప్ల కార్డులు పట్టుకుని తిరిగారు.

అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కూటమికి వ్యతిరేకంగా నాయకులు వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరలు పెరిగిపోతే సామాన్యుడు జీవించేదెలా అంటూ ప్రశ్నించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కొన్ని కొన్ని జిల్లాల్లో మాత్రం అసలు వైసీపీ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం ఎక్కడ కనిపించలేదు. ఉదాహరణకు శ్రీకాకుళం, ఉమ్మడి పశ్చిమగోదావరి, ఉమ్మడి విశాఖపట్నం అదే విధంగా ప్రకాశం జిల్లాలో కూడా వైసిపి చేపట్టిన నిరసన కార్యక్రమాలు పెద్దగా వర్కౌట్ కాలేదు.

నాయకులు సైతం ఎక్కడా కనిపించలేదు. కేవలం ఒకరిద్దరు మాత్రమే నాయకులు ప్లకార్డులు పట్టుకుని రోడ్డు ఎక్కారు. మరికొందరు మాత్రం కేవలం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమయ్యారు. ఈ పరిణామాలతో రాష్ట్రంలో వైసిపి పరిస్థితి అర్థమయిపోయింది అన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. క్షేత్రస్థాయిలో ఇప్పటివరకు బలంగా ఉందని, ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని భావిస్తూ వచ్చిన వైసీపీ అధినేతకు ఈ పరిణామం ఒక ఉదాహరణగా నిలుస్తుందని వారు చెబుతున్నారు.

ఎన్టీఆర్ జిల్లాలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే నిరసన కార్యక్రమం చేపట్టారు. నిజానికి వైసీపీకి బలంగా ఉన్న జిల్లాలో ఎన్టీఆర్, గుంటూరు వంటివి కీలకంగా ఉన్నాయి. అయితే ఈ జిల్లాల్లో కూడా సగం మంది నాయకులు మాత్రమే బయటికి వచ్చారు. జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం వంటి నియోజకవర్గాల్లో ఎక్కడ నిరసన కార్యక్రమాలు పెద్దగా కనిపించలేదు.

అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో మాత్రమే ఈ నిరసన కార్యక్రమం జరిగింది. మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ నిర్వహించారు. మరి మిగిలిన జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి మాత్రం మైనస్ గా మారింది. దీనిని బట్టి వైసీపీ పరిస్థితి ఫిఫ్టీ-ఫిఫ్టీగానే ఉందన్న వాదన వినిపించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu